బెజవాడ గురించి సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాస రావు గారు రాసిన ఆర్టికల్ వైరల్ అయ్యింది .. బెజవాడ అంటే ఇదీ అని ఆయన రాసిన ఆర్టికల్ చదివితే ఆ ఊరి ఔన్నత్యం పూర్తిగా తెలుస్తుంది !
బెజవాడ అంటే ఇదీ! – భండారు శ్రీనివాసరావు “రెండు కులాల మద్య కక్షలు కార్పణ్యాలు, ఆ కులాలకు ప్రతినిధులని చెప్పుకొనే వ్యక్తుల మధ్య రగిలే పగలు, సెగలు ఇవాళ బెజవాడ అంటే అంటున్నారు.. బహుశా దాన్ని విజయవాడ అనాలేమో. బెజవాడ కాదేమో. “నాకు తెలిసిన బెజవాడ, సినిమాల్లో చూపించే బెజవాడ మాత్రం కాదు. “నా బెజవాడ హుందాతో కూడిన రాజకీయాలకు నెలవు. సంగీత సాహిత్యాలకి కాణాచి. చైతన్యానికి, దాతృత్వానికి, సేవాభావాలకు మారు పేరు. “అయ్యదేవర కాళేశ్వరరావు, అచ్చమాంబ,…
