పిల్లలకు కత్తి యుద్ధం నేర్పిస్తున్న 82 ఏళ్ళ బామ్మ !
కత్తి .. డాలు పట్టుకుని యుద్దానికి రెడీ అయిన 82 ఏళ్ళ ఈ బామ్మను చూసారు కదా
ఈ బామ్మ అట్లాంటి ఇట్లాంటి బామ్మ కాదు
కత్తి యుద్ధంలో ఆరితేరిన బామ్మ
కలరిపయట్టు విద్యలో నిష్ణాతురాలు
కలరిపయట్టు విద్య ఏంటా అనుకుంటున్నారా ?
అయితే టైం మిషన్ లో 3 వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి
ఇండియా లో షుమారు మూడు వేల సంవత్సరాల క్రితమే ప్రాచుర్యంలో ఉన్న అత్యంత పురాతన యుద్ధం ఈ కలరిపయట్టు యుద్ధ విద్య
కలరి అంటే యుద్ధ భూమి , పయట్టు అంటే పోరాటం
మళ్ళీ ఈ విద్య నేర్చుకోవడంలో మూడు దశలు ఉంటాయి
మొదటి దశలో ఆయిల్ మసాజ్ , శరీరాన్ని బలంగా మార్చే కసరత్తులు నేర్పిస్తారు
అలా రెండేళ్ల సాధన తర్వాత కర్రల పోరాటం , ఆయుధ పోరాటం ,చేతులతో చేసే పోరాటం నేర్పిస్తారు .. ఇదంతా నేర్చుకోవడానికి ఐదేళ్లు పడుతుంది
ఈ ప్రాచీన విద్యను అందిపుచ్చుకుని కేరళలో ఇప్పటికీ పిల్లలకు నేర్పిస్తున్న వారిలో ప్రధమురాలు ఈ మీనాక్షి బామ్మ
82 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ ఆమె విద్యార్థులకు ఉత్సాహంగా కత్తి యుద్ధం నేర్పించడం వెనుక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది
మీనాక్షికి ఏడేళ్ల వయసులో ఆమెకు నాట్యం నేర్పించే గురువు రాఘవన్ తనని కలరిపయట్టు విద్య నేర్చుకోవటానికి కలరి స్కూల్ లో చేర్పించాల్సిందిగా ఆమె తండ్రికి సూచించాడు
తండ్రి అనుమతితో మీనాక్షి కలరి స్కూల్ లో చేరి కత్తి యుద్దాలు నేర్చుకుంది
తర్వాత ఆమె రాఘవన్ ను వివాహం చేసుకోవడంతో ఇద్దరూ కలిసి 1950 లో సొంతంగా కలరి స్కూల్ స్థాపించారు
అప్పటినుంచే భర్త సాయంతో ఆమె రోజుకు 50 మంది విద్యార్థులకు విద్య నేర్పించడం మొదలుపెట్టారు
ఇందుకు గానూ విద్యార్థుల నుంచి ఫీజు కూడా ఏమీ తీసుకునేవారు కాదు
స్థానికులు స్వచ్ఛందంగా తమకు తోచినంత విరాళాలు ఇచ్చేవాళ్ళు
2007 లో భర్త మరణించటంతో మీనాక్షి స్కూల్ బాధ్యతలను తన భుజాన వేసుకుని పిల్లలకు కత్తి విద్య నేర్పిస్తుంది
కలరి గురువుగా మీనాక్షి సొంత ఊరు వడకర్ లోనే కాదు కేరళ అంతటా బాగా పాపులర్ అయ్యారు
అసలు కలరిపయట్టు విద్య ప్రపంచంలోనే ముందుగా భారతదేశంలోనే కనుగొన్నారు
అప్పట్లో ఆడపిల్లలకు కూడా మానసిక శారీరక బలాన్ని పెంపొందించే చర్యలో భాగంగా పూర్వీకులు ఈ విద్యను కనుగొన్నారని చెప్తారు
అయితే 6 వ శతాబ్దంలో ఒక భారతీయ బౌద్ధ సన్యాసి ఈ విద్యను చైనాకు తీసుకెళ్లి షావోలిన్ పేరుతొ పరిచయం చేసాడని , కుంగ్ ఫు కూడా అందులోనుంచి పుట్టిందని వాదనలు ఉన్నాయి
ప్రస్తుతం మీనాక్షి 62 ఏళ్ళ కొడుకు సంజీవ్ కూడా కలరి స్కూల్ లో తల్లితో పాటు పిల్లలకు కత్తి యుద్దాలు నేర్పిస్తున్నారు
ఏదిఏమైనా 82 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ పిల్లలకు కలరి విద్య నేర్పిస్తున్న మీనాక్షి బామ్మ ఎందరో మహిళలకు స్ఫూర్తి !