కేసీఆర్ సార్ ఏం చేస్తున్నారు?

Spread the love

మే 2 వ తేదీన కవిత డాడీ అంటూ కేసీఆర్ కు లెటర్ రాసింది

ఆ లెటర్లో పొగడ్తలూ ఉన్నాయి
విమర్శలూ ఉన్నాయి

ఆరు పేజీల లేఖ మొత్తం పొగడ్తలే ఉంటే ఇష్యూ ఏమీ ఉండేది కాదు

కానీ స్ట్రెయిట్ గా కేసీఆర్ తప్పులను ప్రశ్నిస్తూ కొన్ని నెగిటివ్ వాఖ్యలు రాసింది కవిత

పోనీ రాస్తే రాసింది

లెటర్ లీక్ చేయకుండా ఉంటే అంతకుముందు కేసీఆర్ కు రాసిన వందో లెటర్ తర్వాత ఇంకో అంకె పెరిగి ఈ లెటర్ 101 అయ్యేది

అంతకుమించి ఏమీ అయ్యేది కాదు
కానీ లెటర్ లీక్ అయ్యింది

లెటర్ లీక్ చేయడమంటే కేసీఆర్ ఇజ్జత్ కు సంబంధించిన విషయం

పార్టీలో కేసీఆర్ ను వేలెత్తి చూపి ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు

కానీ కూతురే ఆ పని చేసింది

లెటర్ ఎవరు లీక్ చేశారన్నది ఇంతవరకు అధికారికంగా బయటికి రాలేదు

కానీ లీక్ అయిన లెటర్ వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని గ్రహించి కేసీఆర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారా?

లేదు
మౌనంగా ఉన్నారు

అమెరికా నుంచి వచ్చిన కవిత ఎయిర్పోర్టులోనే పరోక్షంగా కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాల గురించి విమర్శించినప్పుడు కేసీఆర్ వెంటనే రియాక్ట్ అయి కవితను ఫార్మ్ హౌస్ కి పిలిపించి పార్టీ పరువు బజారున పడకుండా దిద్దుబాటు చర్యలు తీసుకున్నారా?

లేదు
మౌనంగా ఉన్నారు

కవిత లెటర్ పై విలేఖరులు కేటీఆర్ స్పందన అడిగితే ‘ కార్యకర్తలు ఎవరైనా తమ నాయకుడికి ఉత్తరాలు రాయొచ్చు ‘ అని ఘాటుగా సమాధానం చెప్పి చెల్లిని కార్యకర్త స్థాయికి దించినప్పుడైనా కేసీఆర్ కొడుకుని పిలిపించుకుని వివాదానికి తెర దించే ప్రయత్నం చేశారా?

లేదు
మౌనంగా ఉన్నారు

పార్టీలో ఇంత రచ్చ జరుగుతున్నా కేసీఆర్ మౌనంగా ఉండటంతో కవిత ఆవేశం కాస్తా ఆక్రోశంగా మారి ఈరోజు నేరుగా తన అసంతృప్తిని వెళ్లగక్కింది

పేర్లు బయటికి చెప్పకపోయినా కవిత ఆక్రోశానికి కేటీఆర్. హరీష్ రావు.. సంతోష్ కుమార్ లు కారణమని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది

కేసీఆర్ నుంచి తనను దూరం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా తనకు డాడీ కి దూరం పెరుగుతున్న సంగతి మీడియాకు చెప్పింది

అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆమెకు ఇంతవరకు కేసీఆర్ నుంచి పిలుపు రాలేదు

కేసీఆర్ కు నోటీసులు వస్తే పార్టీ తరపున నిరసనలు చేపట్టేవారే కరువయ్యారని.. ట్వీట్లతో సరి పుచ్చుతున్నారని ట్విట్టర్ కింగ్ గా పేరున్న కేటీఆర్ ను పరోక్షంగా విమర్శించింది

లెవెల్ వన్ లో కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత విమర్శించింది

లెవెల్ టూ లో కేటీఆర్ ను విమర్శిస్తూ పరోక్షంగా బాణాలు సంధించింది

BRS పార్టీని బీజేపీ లో విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయని పార్టీ అంతర్గత విషయాలు కొన్ని బయటపెట్టింది

ఈరోజు కవిత ప్రెస్ మీట్ లెవెల్ టూని దాటిపోయింది

అయినా కేసీఆర్ కవితని ఫామ్ హౌస్ కి పిలిపించుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు
మౌనంగా ఉన్నారు

*
ఇంతవరకు కవిత ఆవేశం లెవెల్ 3 వరకు వచ్చింది

ఇంకా కేసీఆర్ మౌనంగా ఉంటే లెవెల్ 4 లో కవిత నుంచి పేర్లతో సహా నేరుగా సంధించే విమర్శనాస్త్రాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి

*
ఈ సందర్భంగా ఒకసారి షర్మిల ఉదంతం గుర్తు తెచ్చుకుందాం

షర్మిల విషయం జగన్ సీరియస్ గా తీసుకోలేదు

షర్మిల పరోక్షంగా అన్న పట్ల తన అసంతృప్తిని వెళ్లగక్కినప్పుడు అయినా జగన్ షర్మిలను ఇంటికి పిలిపించుకుని వ్యవహారం చక్కబెట్టుకోవల్సింది

(ఇంటికి పిలిపించుకున్నారు కానీ వ్యవహారం సెటిల్ అవలేదు)

అయినా జగన్ షర్మిలను సీరియస్ గా తీసుకోలేదు

అన్న నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో షర్మిల నేరుగా బాణాలను జగన్ మీదే సంధించింది

ఏపీలో ఏకఛత్రాధిపత్యంగా పార్టీని నడిపిస్తున్న జగన్ నాయకత్వాన్ని ప్రశ్నించే ధైర్యం చెల్లి నుంచే మొదలైంది

నాలుగు గోడల మధ్య ఉన్నంత వరకే కుటుంబ కలహాలు
ఒక్కసారి వీధిలో పడితే అందరికీ లోకువే

జగన్ లోకువ కావడానికి చెల్లి షర్మిల కూడా ఒక కారణం

*
షర్మిల విషయంలో జగన్ చేసిన పొరపాటే కవిత విషయంలో కేసీఆర్ చేస్తున్నారు

కూతుర్ని పిలిపించుకుని నాలుగు గోడల మధ్య సెటిల్ చేసుకోవాల్సిన విషయాలను ఉదాసీనంగా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు

ఫలితం ఏమౌతుంది?

కేసీఆర్ లోకువ అవుతారు

కేసీఆర్ లోకువ అయితే నాయకత్వం లోకువ అవుతుంది

నాయకత్వం లోకువ అయితే పార్టీ పుట్టి మునుగుతుంది

*

అసలు కేసీఆర్ లో ఎందుకీ నైరాశ్యత?

TRS పార్టీని స్థాపించి తెలంగాణా ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రదర్శించిన అసమాన పోరాట స్ఫూర్తిని ఎవరూ మర్చిపోలేరు

ఎన్ని అవరోధాలు ఎదురైనా బెదిరిపోకుండా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో పోరాడి తెలంగాణా సాధించారు

అటువంటి కేసీఆర్ ఇంటి గొడవలతో పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యే పరిస్తితి వచ్చిందంటే కారణం ఎవరు?

ప్రత్యేక తెలంగాణా సాధించిన పార్టీగా TRS జీవిత కాలం తెలంగాణాని పాలిస్తుందని ఆశలు పెట్టుకున్న కేసీఆర్ నమ్మకాన్ని ఎవరి అహంకారం వమ్ము చేసింది?

పదేళ్లకే ఇంటిదారి పట్టించిన తెలంగాణా ప్రజల తీర్పును కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు

ఒకరకమైన రాజకీయ వైరాగ్యంతో ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయారు

ఓటమిని కేసీఆర్ ఎంత తట్టుకోలేకపోయారంటే కింద పడి తుంటి ఎముక విరిగేంత?

సరిగ్గా కేసీఆర్ రాజకీయ వైరాగ్యంలో ఉన్న సమయంలోనే BRS పార్టీని పూర్తిస్థాయి లో నడిపించడానికి నాయకత్వ పోటీ వచ్చింది

అవి అప్పట్నుంచి అంతర్గతంగా నలుగుతూ ఇప్పుడు వీధిలోకి వచ్చాయి

కవిత కోపం.. అసంతృప్తి రాత్రికి రాత్రి వచ్చింది కాదు
కేసీఆర్ ఫార్మ్ హౌస్ కు పరిమితం అయినప్పటి నుంచి ఉన్నదే

అటు కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం కావడం.. ఇటు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పూర్తిస్థాయిలో ఆక్టివ్ కావడం.. పార్టీలో కవితని నామమాత్ర పాత్రకి పరిమితం చేయడం.. ఇవన్నీ కవితను అసంతృప్తికి గురి చేసిన అంశాలే

కొంతమంది అంటున్నారు

ఇవన్నీ పార్టీలో కోవర్టులను ఏరివేయడానికి ఆడుతున్న డ్రామా అని

నిజానికి ఒకవేళ ఇదంతా డ్రామా అయినా కుటుంబ రచ్చలు BRS పార్టీకి… వ్యక్తిగతంగా కేసీఆర్ ప్రతిష్టకు నష్టం కలిగించేవే

కాబట్టి ఈ రచ్చలకు ఫుల్ స్టాప్ పెట్టగల ఒకేఒక వ్యక్తి

KCR

చూద్దాం ఇకనైనా ఈ సంక్షోభ సమయంలో పాత కేసీఆర్ తిరిగి చక్రం తిప్పుతారేమో !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!