ఆయన పీపుల్స్ సూపర్ స్టార్

Spread the love

సూపర్ స్టార్

“ఏంది మామ? పొద్దున్నే జనాలు వీధుల్లో అలా లగెత్తుతున్నారు..?”

“అదా ..ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ సినిమా రిలీజ్ గదా .. బుర్రిపాలెం బుల్లోడి సినిమా రిలీజ్ రోజే మొదటి ఆట చూడటం మా విజయవాడోళ్ళకి మొదటినించి అలవాటు ..నీకింకో సంగతి చెప్పనా ..!”

“చెప్పు మామా”

“తన సినిమా విడుదల అయిన రోజే మద్రాస్ నుంచి ప్రత్యేకంగా విజయవాడ వచ్చి మరీ ధియేటర్ లో మొట్టమొదటి ఆట చూడటం సూపర్ స్టార్ కి అలవాటు”

“భలే మామా”

“అంతేనా ..సినిమా చూడగానే బాగుంటే వంద రోజుల ఫంక్షన్ కి డేట్ కూడా అప్పటికప్పుడే చెప్పేసేవాడు ..బాగోపోతే అస్సలు ఆడదని కూడా నిర్మొహమాటంగా చెప్పేసెయ్యటం సూపర్ స్టార్ ప్రత్యేకత ..!”

“ఎంత గట్స్ ఉంటే తన సినిమా మీద తనే ముక్కుసూటిగా జడ్జిమెంట్ చెప్పగలరు మామా”

“అందుకే గదా అందరూ ఆయన్ను డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనేది…
అన్నట్టు మర్చిపోయానరోయ్..డేరింగ్ అంటే గుర్తొచ్చింది ..తెలుగు సినిమాల్లో తోలి జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116 ..తోలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు ..తోలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతా రామరాజు ..తోలి 70 ఎం ఎం సినిమా సింహాసనం తీసింది కూడా మన బుర్రిపాలెం బుల్లోడే ..ఇవి చూసిన జనాలు ఆయన్ను డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనకుండా ఉండగలరా ? ఆహ ..ఉండగలరా అని ..??”

“డౌటేముంది మామా .. ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ హీరోనే”

“ఇంకో విషయమరోయ్..అసలాయనకి సూపర్ స్టార్ అన్న బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? ఆ బిరుదు ఆయనకు ఆయన తగిలిచ్చుకుంది కాదు”

“ఎలా మామా?”

“అభిమానులు ఇచ్చింది ..అప్పట్లో జ్యోతి చిత్ర అనే సినిమా మ్యాగజైన్ సూపర్ స్టార్ కూపన్ లు పెడితే మార్కెట్ లోకి వచ్చిన రోజే ఒక్కొక్కల్లమ్ నాలుగైదు కాపీలు కొని సూపర్ స్టార్ కృష్ణ అని కూపన్ల మీద రాసి పంపేవాళ్ళాం”

“అవునా?”

“ఎస్..అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు సూపర్ స్టార్ ఆయనే ..ఇంతలా అభిమానుల మనసులు గెలుచుకున్న తేనే మనసులు హీరో కృష్ణ ఒక్కరే”

“గ్రేట్ మామా”

“ఆగరేయ్.. ఇంకా ఉంది..మా విజయవాడ లో సింహాసనం వంద రోజుల ఫంక్షన్ పెడితే మద్రాస్ నుంచి 30,000 వేల మంది అభిమానులు బస్సుల్లో స్వచ్ఛందంగా తరలి వచ్చి ఫంక్షన్ ను సూపర్ హిట్ చేసారురోయ్ “

“సూపర్”

“అంతేనంటావా ..నా పిలుపే ప్రభంజనం సినిమా షూటింగ్ లో పట్టుబట్టి ఆ అభిమానులతో కలిసి చిన్న సన్నివేశం చేసి వారి కోరికను మన్నించారు ..ఆయనకు వచ్చిన అవార్డు లు ,పురస్కారాలకు లెక్క లేదు ..ప్రభుత్వం కూడా ఆయనను పద్మ భూషణ్ అవార్డు తో సత్కరించింది ..ఇప్పుడు అర్థమైందా ఆయన సూపర్ స్టార్ ఎందుకయ్యారో ?”

“అర్థమైంది మామా .. ఆయన పీపుల్స్ సూపర్ స్టార్ ..!”

“మరి .. ఈ రోజు సూపర్ స్టార్ పుట్టిన రోజు కదా .. గ్రీటింగ్స్ చెబుదామా”

భువి నుంచి దివికేగిన సూపర్ స్టార్ కృష్ణ కు పుట్టినరోజు శుభాకాంక్షలు🌹🙏🌹

తుర్లపాటి పరేష్


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!