టీటీడీ అధికారులూ.. విన్నపాలు వినవలె!

Spread the love

టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జూబ్లీ హిల్స్ ఎన్టీవీ న్యూస్ ఛానెల్ ఆఫీస్ వెనక అధ్భుతమైన వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది

నిన్న సాయంత్రం వెళ్ళా
గతంలో కూడా వెళ్ళా

నేను పరిశీలించినంతలో టీటీడీ అధికారులకు కొన్ని సూచనలు.. విజ్ఞాపనలు

ఈ గుడిలో గతానికి ఇప్పటికీ కొన్ని మార్పులు వచ్చాయి

వాటిలో ముఖ్యమైనది రష్
భక్తుల రాక పెరిగింది

భక్తుల తాకిడి పెరగడంతో పార్కింగ్ సమస్య పెరిగింది

కొండపైకి రోడ్ కొద్దిగా ఇరుగ్గా ఉండటంతో వాహనాలు జామ్ అవుతున్నాయి

కాబట్టి కొండపైకి వెళ్ళే మార్గం వెడల్పు చేసే అవకాశాలతో పాటు పార్కింగ్ సమస్య మీద టిటిడి అధికారులు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది

ఇక ఆలయం వరకు వస్తే టీటీడీ అధికారులు చక్కటి ఏర్పాట్లు చేసారు

భక్తులు కూర్చోవడానికి వీలుగా మాడ వీధికి ఆనుకుని ఓపెన్ లాన్ వంటిది ఏర్పాటు చేసారు

ఈ ఏర్పాటు బావుంది

పర్వదినాల్లో రద్దీకి అనుగుణంగా చుట్టూ క్యూ లైన్లతో బారికేడ్లు ఏర్పాటు చేసారు

ఈ గుడిలో చేసిన మంచి ఏర్పాటు ఏంటంటే టికెట్ల గోల లేకుండా సెలబ్రిటీ అయినా సామాన్యుడికైనా అందరికీ ఒకటే దర్శనం.. అదే సర్వ దర్శనం పద్దతి బావుంది

కాకపోతే తిరుమల మాదిరి స్వామి వారిని ప్రశాంతంగా దర్శనం చేసుకునేకుండా జరగండి.. జరగండి.. అని అరవడానికి ఇక్కడ కూడా ఇద్దరు మనుషులను పెట్టారు

లైన్ ఆగకుండా ఈ పద్ధతికి ప్రత్యామ్నాయం ఏదైనా కనిపెడితే బావుణ్ణు

(గర్భ గుడిలో ఆటో స్లైడింగ్ వే ఏర్పాటు ఆలోచించవచ్చు.. ఇదైతే వాళ్ళు అరిచేపని ఉండదు.. భక్తుల లైన్ ఆలస్యం అయ్యే పని ఉండదు.. వే ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది కాబట్టి దర్శనం కూడా త్వరగా ప్రశాంతంగా అవుతుంది)

దర్శనం చేసుకుని బయటికి వచ్చాక గర్భగుడికి ఇరువైపులా అమ్మవార్ల గుడులు ఉన్నాయి

విమాన వేంకటేశ్వరుని దర్శించుకుని ముందుకెళితే ప్రసాదాల కోసం క్యూ లైన్ ఉంటుంది

ఒక లైన్ ఉచిత ప్రసాదానికి.. ఇంకో లైన్ 50 రూపాయల లడ్డూకి కేటాయించారు

నిన్న కట్టు పొంగలి ప్రసాదం పెట్టారు
మంచి క్వాలిటీ ఉంది

50 రూపాయల లడ్డూ కూడా బావుంది కానీ తిరుమల లడ్డూ తో పోలిస్తే నాణ్యత విషయంలో కానీ సైజు విషయంలో కానీ కొద్దిగా తక్కువ మార్కులు పడతాయి

దేశమంతా డిజిటల్ విప్లవం నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో లడ్డూ కౌంటర్లో క్యాష్ ఓన్లీ బోర్డ్ పెట్టారు

దీనివల్ల డిజిటల్ పేమెంట్ కు అవకాశం ఉండదు

టీటీడీ అధికారులు ప్రసాదం కౌంటర్లో కూడా డిజిటల్ పేమెంట్ అలో చేసే విధంగా చర్యలు తీసుకోవాలి

ప్రధాన గుడినుంచి బయటికి రాగానే ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది

అక్కడ దర్శనం చేసుకుని చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు

కానీ గుడికి ఇంకోవైపు వినాయకుడి గుడి ఉంది
చాలామందికి ఇది తెలీదు

అంచేత వినాయకుడి గుడికి వెళ్ళే మార్గాన్ని సూచిస్తూ డిస్ ప్లే బోర్డులు పెడితే బావుంటుంది

నిన్న రద్దీగా ఉంది కాబట్టి పార్కింగ్ ప్లేసులో ఒక పోలీసును.. గర్భ గుడిలో ఒక పోలీసును డ్యూటీ వేసారు

పార్కింగ్ ప్లేసులో డ్యూటీ చేసిన పోలీసు మాత్రం చాలా ఓపిగ్గా ఎవర్నీ విసుక్కోకుండా ట్రాఫిక్ జామ్ అవకుండా చాలా తంటాలు పడ్డాడు

ఆ పోలీస్ కి అభినందనలు

రద్దీ రోజుల్లో తిరుమల మాదిరి ఇక్కడ కూడా సేవా వాలంటీర్లను తీసుకుంటే చాలావరకు ఇబ్బందులు తగ్గుతాయి

చిన్న చిన్న ఇబ్బందులను సరిచేస్తే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ గుడి మరింత అధ్భుతమైన దేవాలయం అవుతుంది

EOTTD

ఈఓటిటిడి

పరేష్ తుర్లపాటి ✍️


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!