హైదరాబాద్ శివార్లలోని చేవెళ్లలో త్రిపుర రిసార్ట్స్ లో మంగళవారం రాత్రి జరిగిన సింగర్ మంగ్లి బర్త్ డే వేడుకలపై పోలీసుల దాడి సంచలనం సృష్టించింది . ఈ వేడుకల్లో ఆమె కుటుంబ సభ్యులతో పాటు మొత్తం 50 మంది పాల్గొన్నారు
పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడ ఫారిన్ లిక్కరుతో పాటు గంజాయి దొరికినట్టు తెలుస్తుంది
దానితో పోలీసులు వారికి పరీక్షలు చేయించగా వారిలో ఒకరు గంజాయి సేవించినట్టు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది
అయితే తాను నెల క్రితం వేరే చోట గంజాయి సేవించినట్టు అతడు చెప్తున్నాడు
ఈ నేపథ్యంలో పోలీసులు NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మంగ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి
మంగ్లి అసలు పేరు సత్యవతి రాధోడ్ అని .. ఈమె గతంలో తిరుపతిలో కచేరీలు చేసేదని .. మంగ్లి స్వస్థలం తెలంగాణా కాదని రకరకాల కధనాలు ప్రచారంలోకి వస్తున్నాయి .. హైద్రాబాదులో తెలంగాణా యాసలో పాటలు పాడటంతో మంగ్లి తెలంగాణా గాయకురాలిగా పాపులర్ అయ్యారని చెప్తున్నారు
వివాదాల్లో చిక్కుకోవడం మంగ్లికి ఇదే మొదటిసారి కాదు .. గతంలో ఓ పాట విషయంలో పలు హిందూ సంఘాల నుంచి ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు .. ఆ మధ్య బెంగుళూరు రేవ్ పార్టీలో ఇరుకున్న సినీ నటి హేమ తో పాటు మంగ్లి కూడా ఉన్నారని అయితే ఆమె తృటిలో పోలీసులనుంచి తప్పించుకోవడంతో హేమ దొరికిపోయారని కధనాలు ప్రచారంలో ఉన్నాయి
పోలీసుల వివరణ : ఈ కేసు విషయమై రాజేందర్ నగర్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ మంగళవారం రాత్రి పది గంటలకు రిసార్ట్స్ లో పార్టీ మొదలైంది .. డీజే శబ్దాలు విపరీతంగా వస్తున్నాయని మాకు కంప్లైంట్ వచ్చింది . అర్థరాత్రి పన్నెండు గంటలకు మా SOT టీమ్ రిసార్ట్స్ మీద దాడి చేయడంతో విపరీతమైన డీజే సౌండ్ తో లిక్కర్ పార్టీ జరుగుతుంది .. పార్టీలో ఉన్న మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకుని పరీక్షలు చేయగా ఒకరికి గంజాయి సేవించినట్టు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది .. NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పారు
మంగ్లి స్పందన : తాజాగా ఈ వివాదంపై ఓ వీడియో ద్వారా మంగ్లీ స్పందిస్తూ ‘ తన పుట్టినరోజు వేడుకలకు కుటుంబ సభ్యులను , స్నేహితులను పిలిచి లిక్కర్ పార్టీ ఇచ్చిన మాట వాస్తవమే కానీ ఎటువంటి మాదక ద్రవ్యాలను వినియోగించలేదని తెలిపారు .. మాదక ద్రవ్యాలను వినియోగిస్తే పార్టీకి తన కుటుంబ సభ్యులను ఎందుకు ఆహ్వానిస్తానని.. డీజే కి.. లిక్కర్ కి పోలీసుల అనుమతి తీసుకోవాలనే అవగాహన లేకపోవడం వల్లనే వాళ్ళ పర్మిషన్ తీసుకొలేదని .. అందువల్ల తనపై అసత్యాలను ప్రచారం చేయొద్దని వేడుకున్నారు
మంగ్లి లిక్కర్ పార్టీ కొన్ని అనుమానాలు : ఇదిలా ఉండగా మంగ్లి లిక్కర్ పార్టీ వీడియోలు ఒకటొకటి బయటికి వస్తుండటంతో కొన్ని అనుమానాలకు ఆస్కారం కలిగిస్తున్నాయి .. పార్టీకి తాను మొత్తం యాభయ్ మందినే పిలిచానని చెప్తున్నప్పటికీ అక్కడ పార్టీలో టేబుళ్ల మీద భారీగా లిక్కర్ బాటిళ్లు కనిపిస్తున్నాయి .. చిన్న పార్టీకి అన్ని బాటిళ్లు ఎందుకు తెప్పించింది ? మాదక ద్రవ్యాల వినియోగం జరగలేదు అని చెప్తున్నప్పుడు అక్కడ హుక్కా పైపులు ఎందుకు ఉన్నాయి ? పార్టీలో దొరికినవారిలో ఒకరికి గంజాయి సేవించినట్టు పాజిటివ్ రిపోర్ట్ ఎందుకు వచ్చింది ? ఎప్పుడో సేవించాను అనే మాట మంగ్లీని బయటపడేసేందుకేనా ? పోలీసుల సోదాల్లో బీడీలు దొరికాయి .. అవి గంజాయి తో తయారైనవి అనే వార్తలు వినవస్తున్నాయి ..అది నిజమేనా ? పోలీసులు దాడులు చేసినప్పుడు వారికి సహకరించకుండా పార్టీలో మంగ్లి ఎందుకు ప్రతిఘటించింది.. పోలీసులు దాడి చేసినప్పుడు మంగ్లి ఎవరికి ఫోన్లు చేసింది .. లేడీ కానిస్టేబుల్ మంగ్లి పక్కనే నిలబడ్డప్పుడు ఆమె గబగబా వాష్ రూమ్ లోకి పోయి అక్కడే తలుపేసుకుని ఎందుకు దాక్కుంది ? లేడీ కానిస్టేబుల్ బలవంతంగా తలుపులు కొట్టి డోర్ ఓపెన్ చెయ్యాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ?
ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు త్వరలో బయటికి వస్తాయి !
పరేష్ తుర్లపాటి