విమాన ప్రమాదానికి కారణాలు తెలియాలంటే బ్లాక్ బాక్స్ కీలకం .. అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి ?

Spread the love

విమాన ప్రమాదం జరగ్గానే అందరి నోటా వినవచ్చే మాట బ్లాక్ బాక్స్

తాజాగా అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలుసుకోవడానికి ఈ బ్లాక్ బాక్స్ సమాచారం కీలకంగా మారింది

ఇంతకీ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి ?

దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చు ? లాంటి ప్రశ్నలకు సమాధానాలు  తెలుసుకుందాం

నిజానికి అందరూ బ్లాక్ బాక్స్ అని పిలుచుకునే  ఈ బ్లాక్ బాక్స్ నలుపు రంగులో ఉండదు .. ఆరంజ్ కలర్ లో ఉంటుంది .. పైగా ఇది బాక్స్ ఆకారంలో ఉండదు .. సిలిండర్ ఆకారంలో ఉంటుంది

ఫ్రెంచికి చెందిన వైమానిక ఇంజనీర్ 1930 లోనే ఈ బ్లాక్ బాక్స్ కు రూపకల్పన చేసారు

ఇదే పరికరాన్ని 1954 లో డేవిడ్ వారెన్ కొన్ని ఆధునిక ఫీచర్లతో ఆధునీకరించారు

విమాన ప్రమాదానికి ముందు కాక్ పిట్ లో జరిగే సంభాషణలను , శబ్దాలను రికార్డ్ చేసే కీలక పరికరం ఈ బ్లాక్ బాక్స్

మళ్ళీ ఈ బ్లాక్ బాక్సులో రెండు రకాలు ఉంటాయి

మొదటిది డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ కాగా రెండోది కాక్ పిట్ వాయిస్ రికార్డర్

డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ మొత్తం విమాన వ్యవస్థ , వాయుయాన వ్యవస్థలకు సంబందించిన సమాచారాన్ని రికార్డ్ చేస్తుంది

విమానంలో ఎలివేటర్ ,రాడార్ , ఫ్లాప్ లు , ఇంజిన్ పనితీరు ఎలా ఉంది ? విమానం యెంత ఎత్తులో ఉంది ? గాలి పీడనం ఎలా ఉంది ? లాంటి అంశాలను రికార్డ్ చేస్తుంది

ఇక రెండో విభాగం అయిన కాక్ పిట్ రికార్డర్ అనేది విమాన ప్రయాణంలో అత్యంత  కీలకమైన పరికరం

విమాన ప్రమాదానికి కల ఖచ్చితమైన సమాచారం ఈ కాక్ పిట్ రికార్డర్ ద్వారానే తెలుస్తుంది

కాక్ పిట్ కు సంబందించిన ప్రతి శబ్దాన్ని , మాటలను రికార్డ్ చేస్తుంది

బ్లాక్ బాక్స్ ఆరంజ్ కలర్ లో ఉండటం వల్ల విమాన ప్రమాదం జరిగినప్పుడు ఎక్కడున్నా తేలిగ్గా గుర్తుపట్టవచ్చు

ఒకవేళ విమానం సముద్రంలో కూలిపోతే బ్లాక్ బాక్స్ నుంచి వచ్చే శబ్ద తరంగాల ద్వారా గుర్తిస్తారు

ప్రస్తుతం అహ్మదాబాద్ లోని బిజె వైద్య కళాశాల భవనం పై భాగంలో బ్లాక్ బాక్స్ గుర్తించారు

దీనిని డీ కోడ్  చేసేందుకు డీజీసీఏ అనుబంధ ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపించారు

ఈ బ్లాక్ బాక్స్ డీ కోడ్ ప్రక్రియ పూర్తయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కల కారణాలు పూర్తిగా బయటికి వస్తాయి !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!