మంచు చేస్తే చెడ్డదాయే..తిన్నడి కష్టాలు.. మంచుకు బ్రాహ్మణ సంఘాల సెగ!

Spread the love

కన్నప్ప సినిమా విడుదలై కలెక్షన్ల పరంగా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో తెలీదు కానీ విడుదలకు ముందే వివాదాలతో బోలెడు రికార్డులు సృష్టిస్తుంది!

ఆ మధ్య కన్నప్ప సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్క్ దొంగతనం చేశారని మంచు విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేశారు

అదలా ఉండగానే కన్నప్ప సినిమాలో హిందూ సంప్రదాయాలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని.. బ్రహ్మానందం.. సప్తగిరులకు పిలక గిలక పాత్రలు ఇచ్చి బ్రాహ్మణులను కించపరిచే విధంగా సన్నివేశాలు చిత్రీకరించారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర శర్మ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.. ఈ కేసులో సెన్సార్ బోర్డు రీజినల్ ఆఫీసర్ , నిర్మాత మోహన్ బాబు, మంచు విష్ణు, బ్రహ్మానందం , సప్తగిరి తదితరులను ప్రతివాదులుగా చేరుస్తూ నోటీసులు జారీ చేశారు

ఈ నేపధ్యంలో ఆదివారం కన్నప్ప సినిమా చూసిన రివిజన్ కమిటీ అందులో 13 సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. వాటిని తొలగించి తిరిగి ప్రివ్యూ ఏర్పాటు చేయాలని ఆదేశించింది..ఆ సన్నివేశాలు తొలగించిన తర్వాత తిరిగి ప్రివ్యూ చూసిన తర్వాతనే సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసే అవకాశం ఉంది.. దాంతో ఈ సినిమాకు తాత్కాలికంగా సెన్సార్ బ్రేకులు పడ్డాయి

మరోపక్క ఈ సినిమాను ఈ నెల 27 న విడుదల చేయడానికి మంచు విష్ణు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో ఇందులో 13 సన్నివేశాలు తీసెయ్యాలని రివిజన్ కమిటీ ఇచ్చిన ఆదేశాల వల్ల సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి

మొత్తానికి కన్నప్ప సినిమా రిలీజుకు ముందే వివాదాల్లో ఇరుక్కుంటూ రికార్డులు సృష్టిస్తుంది .. ఫైనల్ గా 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న కన్నప్ప ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుందా? లేదా? అనేది సన్నివేశాలు తొలగించిన తర్వాత థియేటర్లలో సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!