ప్రభుత్వాలు చేయలేని సాయం ఒక్కోసారి వ్యక్తులు చేస్తారు
సాయం చెయ్యాలనే మనసు ఉండాలే కానీ ఆచరణలో పెట్టడం పెద్ద కష్టం కాదు
అటువంటి సాయం చెయ్యాలనే పెద్ద మనసు ఉన్న వ్యక్తి ప్రముఖ నవలా రచయిత యండమూరి
గద్దర్ అవార్డ్స్ లో భాగంగా యండమూరి వీరేంద్ర నాథ్ కి రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం ప్రకటించారు
అవార్డ్స్ ఫంక్షన్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకుంటూ ‘ పురస్కారం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన నగదు బహుమతిలో చాలాభాగం స్వచ్ఛంద సంస్థలకు.. ఇతర పేదలకు కాంట్రిబ్యూట్ చేస్తానని ‘ సభా ముఖంగా ప్రకటించారు
చెప్పినట్టుగానే ఈ రోజు కడపలోని ఆర్తి ఫౌండేషన్ కు మూడు లక్షల రూపాయలు , శ్రీకాకుళం జిల్లాలో చిన్న పల్లెటూరిలో పది లక్షల రూపాయల ఖర్చుతో పేద అనాధ విద్యార్ధులకు సాయం చేసే నిమిత్తమై అభయం ఫౌండేషన్ కి లక్ష రూపాయలు డొనేట్ చేసారు
ఇదిలా ఉండగా చాలామందికి తెలియని అసలు విషయం మరొకటి ఉంది
గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో సినీ కళాకారుడు కాంతారావు పేరు మీద కూడా అవార్డులు ఇచ్చారు.. ఈ కార్యక్రమానికి హాజరు కమ్మని కాంతారావు కుటుంబ సభ్యులకు అవార్డ్స్ కమిటీ వారు వెయ్యి రూపాయలు పంపించారు
ఇదిలా ఉండగా కాంతారావు కొడుకు రాజా ఇంటి అద్దె కట్టలేని పరిస్తితిలో ఉన్నాడని తెలుసుకున్న యండమూరి వీరేంద్ర నాథ్ వెంటనే రాజాని తన ఇంటికి పిలిపించి లక్ష రూపాయల చెక్కును అందచేశారు
ఇది కదా అసలైన దాతృత్వం అంటే
కాంతారావు కుటుంబ కష్టాల గురించి గతంలో కూడా వార్తలు వచ్చాయి.. కొంతమంది తోటి కళాకారులు తమకు చేతనైన సాయం చేశారు.. అయితే ప్రభుత్వ పెద్దల నుంచి ఎవరూ ఆ కుటుంబానికి సరైన భరోసా కల్పించలేకపోయారు .. పై పెచ్చు కాంతారావు పేరు మీద ఇచ్చే అవార్డ్స్ ఫంక్షన్ కు రావడానికి కుటుంబ సభ్యులకు వేయి రూపాయలు దారి ఖర్చులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు
కాంతారావు కుటుంబానికి కమిటీ చేయలేని సాయం లక్ష రూపాయలు ఇచ్చి యండమూరి వీరేంద్ర నాథ్ చేశారు
యండమూరి చేసిన సాయానికి సర్వత్రా హర్షాతిరేకం వ్యక్తం అవుతుంది!
పరేష్ తుర్లపాటి ✍️