నరేంద్ర మోడీ దశావతారాల వెనుక రహస్యం ఏంటి ?

Spread the love

అది 1975 వ సంవత్సరం
ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన సమయం

ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్న లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ .. బీజేపీ అగ్రనేతలు వాజ్ పేయి , అద్వానీ వంటి అగ్రనాయకులను అరెస్ట్ చేసి జైళ్లలో వేసిన సమయం

ఆఖరికి ఆరెస్సెస్ నేతలను కూడా అరెస్ట్ చేసి ఏకంగా ఆరెస్సెస్ ను నిషేధించిన సమయం

కట్ చేస్తే ,

గుజరాత్ లోని ఓ గ్రామంలో తెల్లవారి వెలుగు రేఖలు పరుచుకుంటున్న ప్రభాత సమయంలో ఓ పాతికేళ్ల యువకుడు నిశ్శబ్దంగా లేచి యోగా చేసుకోవడం మొదలెట్టాడు

యోగా పూర్తి కాగానే గదిలో ఉన్న సిక్కుల వస్త్ర ధారణతో సర్దార్జీగా మారు వేషం వేసుకుని బైక్ మీద పట్టణానికి బయలుదేరాడు

దారిలో చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఆపారు

“ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావ్ ?” అనుమానంగా అడిగారు

“గురుద్వారాకు వెళ్తున్నా ” అని ఆ యువకుడు సమాధానం చెప్పడంతో పోలీసులు ఆ యువకుడికి దారి ఇచ్చారు

ఆ యువకుడు నేరుగా పట్టణంలో ఉన్న సంఘ పరివార్ సభ్యుల ఇళ్లకు వెళ్ళాడు
కానీ వారెవరూ ఆ యువకుడ్ని గుర్తుపట్టలేదు

అప్పుడు ఆ యువకుడు వాళ్లకు తన పేరు చెప్పి ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా చెయ్యాల్సిన పోరాటానికి కర్తవ్య నిర్దేశం చేసి వెళ్ళిపోయాడు
ఆ యువకుడి పేరు తెలుసుకున్న సంఘ పరివార్ సభ్యులు ఆనందంతోనూ .. ఆశర్యంతోనూ నోరు తెరిచారు

కట్ చేస్తే ,

మర్నాడు ఉదయం అదే వ్యక్తి సాధువుగా మారి ఆరెస్సెస్ తరపున రహస్యంగా ప్రచారం చేసాడు

కట్ చేస్తే ,

మర్నాడు ఉదయం అదే యువకుడు పేపర్ బాయ్ అవతారం ఎత్తాడు
పేపర్లు అమ్ముతున్న వాడిలా ఇంటింటికి తిరుగుతూ పేపర్ల మధ్యలో ఆరెస్సెస్ కార్యకర్తలు చేయాల్సిన పోరాట వ్యూహాలను చిన్న కాగితంలో రాసి పెట్టి ముఖ్యమైన వాళ్లకు పంచాడు

కట్ చేస్తే ,

మర్నాడు ఆ యువకుడు ఛాయ్ వాలా రూపం ఎత్తి ఆరెస్సెస్ తరపున ప్రచారం చేసాడు

కట్ చేస్తే ,

మర్నాడు ఆ యువకుడు సాంబ్రాణీ అమ్మే వ్యక్తి అవతారం ఎత్తి ఊర్లు తిరుగుతూ ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా ఆరెస్సెస్ తరపున ప్రచారం చేసాడు

ఇలా ఒకే వ్యక్తి దశావతారాలు ఎత్తి ఒకసారి సాధువుగా , ఒకసారి సర్దార్జీగా , పేపర్ బాయ్ గా , ఛాయ్ వాలాగా , సాంబ్రాణి అమ్మే వ్యక్తిగా , హిప్పీ జుట్టుతో ఒకసారి ,తలపాగాతో మరొకసారి ఇంకా రకరకాల మారు వేషాలతో ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా ఆరెస్సెస్ తరపున చెయ్యాల్సిన పోరాట వ్యూహాలను 19 నెలల పాటు రహస్యంగా అమలు చేస్తూ పాల్గొన్నారు

ఆగండాగండి ,

ఇదేదో హాలీవుడ్ సినిమా స్టోర్ మాదిరి ఉంది అనుకుంటున్నారు కదూ ?
కానేకాదు .. యదార్ధంగా జరిగిన సంఘటన

ఆ యువకుడి పేరు నరేంద్ర దామోదర దాస్ మోడీ

ఎస్ .. మన ప్రధాని మోదీనే

ఈ విషయాలన్నీ మోడీ మూడోసారి ప్రధాని పదవిని చేపట్టి 11 సంవత్సరాలు అయిన సందర్భంగా బ్లూ క్రాఫ్ట్స్ అనే సంస్థ ఎమర్జెన్సీ సమయంలో మోడీ అనుభవాలను ‘ ది ఎమర్జెన్సీ డైరీస్ ‘ అనే పుస్తకం ద్వారా వెలుగులోకి తెచ్చింది

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బుధవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు
ఈ పుస్తకానికి మాజీ ప్రధాని దేవెగౌడ ముందు మాట రాసారు

అమిత్ షా మాట్లాడుతూ ‘ మోడీ అప్పట్లోనే రిస్క్ తీసుకుని ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి మారు వేషాలలో ఆరెస్సెస్ తరపున షుమారు 19 నెలల పాటు రహస్యంగా ప్రచారం చేసారని .. పౌరుల హక్కులకు భంగం కలిగినప్పుడు మోడీ చూస్తూ ఊరుకోరని ఈ సంఘటన ద్వారా మనకు అర్ధమౌతుంది ‘ అన్నారు

ప్రధాని మోడీ కూడా ఎమర్జెన్సీ సమయంలో తన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ‘ ఈ పుస్తకంలో రాసిన తన అనుభవాలను సోషల్ మీడియా వేది కలలో కూడా పంచుకోవాలని తద్వారా ఎమర్జెన్సీ కాలంలో అక్రమ చట్టాల వల్ల పౌరులు , సామజిక కార్యకర్తలు , రాజకీయ నాయకులూ , విద్యార్థులు పడిన కష్టాలు ప్రజలకు తెలుస్తాయి అని ట్విట్టర్ (X ) వేదికగా స్పందించారు

ఎమర్జెన్సీ సమయంలో అక్రమ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటానికి ఆరెస్సెస్ తరపున తమకు మార్గనిర్దేశం చేసిన వ్యక్తిగా మోడీతో తమ అనుభవాలు పేరిట కొంతమంది సంఘ పరివార్ సభ్యులు పరిచయ వాక్యాలు చెప్పారు .. పైన చెప్పిన సన్నివేశాలన్నిటికీ ప్రత్యక్ష సాక్షులు వీరే

ఏదిఏమైనా ది ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకం పూర్తిగా అందుబాటులోకి వస్తే ఎమర్జెన్సీ కాలంలోని మరిన్ని సంచలన విషయాలు తెలుస్తాయి !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!