‘జగమే మాయ బతుకే మాయ’ .. ఈ పాట వింటే ఇప్పటికీ దేవదాసు గుర్తుకొస్తాడు
ఈ పాటకు .. దేవదాసు భగ్న ప్రేమకు అప్పుడే 72 ఏళ్ళు నిండింది
అయితేనేమి దేవదాసు ప్రేమకు మరణం లేదు .. ప్రేమ చరిత్రలో దేవదాసు .. పార్వతిలు సజీవంగా నిలిచిపోతారు
సరిగ్గా 72 సంవత్సరాల క్రితం 1953 జూన్ 26 న వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర రావు .. సావిత్రి నాయికా నాయకులుగా డిఎల్ నారాయణ నిర్మించిన దేవదాసు సినిమా క్లాసికల్ మూవీస్ లలో చరిత్ర సృష్టించింది
ఇనేళ్లయినా కూడా ఇప్పటికీ ఘంటసాల వారు గాత్రం అందించిన దేవదాసు సినిమాలో పాటలు తెలుగు ప్రేక్షకుల చెవుల్లో మారుమోగుతూ ఉంటాయి
ముఖ్యంగా జగమే మాయ .. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ లాంటి పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్టులో ఉంటాయి
బెంగాలీలో శరత్ చంద్ర ఛటోపాధ్యాయ రాసిన దేవదాసు నవలను తెలుగులోకి అనువదించి డిఎల్ నారాయణ దేవదాసు సినిమా నిర్మించారు
దేవదాసు సినిమాలో పాత్ర పరంగా అక్కినేని భగ్న ప్రేమికుడిలా కన్పించాలి
అందుకు తగ్గట్టుగా ఆ రోజుల్లోనే అక్కినేని తన ఆహార్యాన్ని మలుచుకున్నారు
ఈ సినిమా కోసం అక్కినేనితో పటు దర్శకుడు వేదాంతం రాఘవయ్య కూడా మనసు పెట్టి పనిచేసారు
వేదాంతం రాఘవయ్య అయితే ఏకంగా ఓ అడుగు ముందుకు వేసి షూటింగ్ రాత్రి వేళల్లో చేసేవారు
అందుకో కారణం ఉంది
భగ్న ప్రేమికుడు దేవదాసు తాగుడికి బానిస అవుతాడు .. దేవదాసు తాగి సంబాషణలు చెప్పే సన్నివేశాలకు నాచురల్ ఎఫెక్ట్ కోసం రాత్రి వేళల్లో షూటింగ్ చేసారు
షూటింగ్ సమయంలో అక్కినేని నటన చూసి ఈయన నిజంగా తాగి షూటింగ్ కు వచ్చాడా ? అని యూనిట్ వాళ్ళు ఆశర్యపోయేవాళ్లట
అంతలా ముఖంలో తాగుబోతు కళను ప్రదర్శించాడు కాబట్టే దేవదాసు పాత్ర రక్తి కట్టింది
అప్పట్లో ఇదే పాత్రను హిందీలో చేసిన దిలీప్ కుమార్ కూడా దేవదాసు పాత్రకు తనకన్నా అక్కినేనే పూర్తి న్యాయం చేసాడని.. ముఖంలో భావాలూ పలికించడంలోనూ .. దగ్గడంలోనూ అక్కినేని దేవదాసు పాత్రకు పూర్తి న్యాయం చేసాడని మెచ్చుకున్నారు
పారు గా నటించిన సావిత్రి కూడా ఈ సినిమాలో అత్యుత్తమ నటన ప్రదర్శించింది
ఒకరకంగా అక్కినేని నాగేశ్వర రావు .. సావిత్రిల సినిమా కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా దేవదాసు
దేవదాసు రిలీజ్ అయి జూన్ 26 కు 72 సంవత్సరాలు నిండిన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో వారు ఒక వీడియో రిలీజ్ చేసారు
ఆ వీడియోలో దేవదాసు పాటలు .. కొన్ని ముఖ్యమైన సంబాషణలు .. అక్కినేని సన్నివేశాలు ఉన్నాయి !
పరేష్ తుర్లపాటి