బాలీవుడ్ ను కొన్ని దశాబ్దాల పాటు ఏకచత్రాధిపత్యంగా ఏలిన ఫ్యామిలీలలో కపూర్ ఫ్యామిలీ ఒకటి !
చిత్ర నిర్మాణం , నటన , దర్శకత్వాలలో కపూర్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి
కపూర్ ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలంటే మొదటగా రాజ్ కపూర్ గురించి చెప్పుకోవాలి
బాలీవుడ్ లో కొన్నేళ్లు రాజ్ కపూర్ శకం నడిచింది
చిత్ర నిర్మాతగా , దర్శకుడిగా , నటుడిగా విభిన్న రంగాల్లో రాజ్ కపూర్ సక్సెస్ అయ్యారు
ఆ రాజ్ కపూర్ కొడుకులే రణధీర్ కపూర్ , రిషి కపూర్ , రాజీవ్ కపూర్
ప్రేమ కథా చిత్రాలకు పెట్టింది పేరు కపూర్ సినిమాలు
లవ్ స్టోరీ సినిమాల్లో హీరోగా నటించి సక్సెస్ అయిన రణధీర్ కపూర్ కు నిజ జీవితంలో కూడా ఓ లవ్ స్టోరీ ఉంది
రాజ్ కపూర్ సినిమా సంగమ్ షూటింగ్ లోనే రణధీర్ కపూర్ బబితను చూసి ప్రేమించాడు
ఆ ప్రేమ పార్కులు పాటలు షికార్లు తిరిగి ఫైనల్ గా పెద్దల ఆమోదంతో పెళ్లి దాకా వచ్చింది
ఇరువైపులా పెద్దలు అంగీకరించడంతో 1971 నవంబర్ లో వారిద్దరి వివాహం జరిగింది
వీరికి ఇద్దరు ఆడపిల్లలు కరీనా కపూర్ , కరిష్మా కపూర్
కొంతకాలం అన్యోన్యంగా గడిచిన రణధీర్ కాపురంలో క్రమేపీ కలతలు మొదలయ్యాయి
ఆఖరికి 1988 లో రణధీర్ కపూర్ బబిత నుంచి విడిపోయాడు
అయితే అధికారికంగా విడాకులు మాత్రం ఇవ్వలేదు
కరీనా , కరిష్మాలు తల్లి దగ్గరే పెరిగి బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్లుగా నిలదొక్కుకున్నారు
తిరిగి ఇన్నేళ్లకు పిల్లల చొరవతో రణధీర్ దంపతులు కలిసిపోయారు
ఈ నేపథ్యంలో కరీనా బార్ఖాదత్ లో మాట్లాడుతూ ‘ 35 సంవత్సరాల తర్వాత తమ తల్లితండ్రులు తిరిగి కలిసిపోవడం ఆనందంగా ఉందని .. వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడు అవసరమని అన్నారు . తాము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మగ తోడు లేకపోయినా తమ తల్లి ధైర్యంగా తమను పెంచి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి బాట వేశారని ‘ ఆమె చెప్పారు
రణధీర్ కపూర్ కూడా బబితతో తిరిగి తన కలయిక గురించి మాట్లాడుతూ ‘ తిరిగి బబిత .. నేనూ కలవడం సంతోషంగా ఉంది .. మొదట్లో మా సంసారం అన్యోన్యంగా గడిచినా నేను తాగి వస్తానని బబిత నా మీద కోపం తో దూరం అయ్యింది .. మళ్ళీ ఇన్నాళ్లకు పిల్లలు మా ఇద్దర్నీ కలిపారు ‘ అని సంతోషం వ్యక్తం చేసారు
ఏదిఏమైనా 35 సంవత్సరాల ఎడబాటు తర్వాత రణధీర్ కపూర్ దంపతులు తిరిగి కలిసిపోవడం పట్ల ఆయన అభిమానులు హర్షం వెలిబుచ్చుతున్నారు
ప్రస్తుతం రణధీర్ కపూర్ వయసు 78 సంవత్సరాలు !
పరేష్ తుర్లపాటి