బెజవాడ అప్పడాల పిండి ఉండల రుచి టేస్ట్ చేసి చూడండి ? రంభ , ఊర్వశి, మేనకలు ఒకేసారి కనిపిస్తారు ! బెజవాడ రుచులు – 8

Spread the love

బెజవాడ రుచులు – 8

బెజవాడ అప్పడాల పిండి ఉండల రుచి టేస్ట్ చేసి చూడండి ? రంభ , ఊర్వశి, మేనకలు ఒకేసారి కనిపిస్తారు !

ఇదేంటి అప్పడాల సంగతి తెలుసు గానీ ఈ అప్పడాల పిండి స్టోరీ ఏంటా ? అని ఆశర్యపోతున్నారా ?

అయితే చదవండి

నాన్న భోజనప్రియులు.. ఆ మాటకొస్తే నేను కూడా భోజనప్రియుడినే !

భోజన ప్రియులంటే గుండిగలు గుండిగలు లాగించేవాళ్ళని కాదు అర్థం
విభిన్న రుచులతో కనెక్ట్ కావటం !

వంకాయ ముక్కలు తరిగి బ్యాండీన్ లో వేసి అంత ఉప్పు కారం చల్లి దింపితే వంకాయ కూర అయిపోతుంది .అందులో పెద్ద డిష్ అంటూ ఏమీ లేదు

తిన్నామా అంటే తిన్నాము మమ అనుకోవటమే

కానీ అదే వంకాయను కోసి ఉల్లికారం పెడితే ఒకరకంగానూ.. అల్లం పర్చిమిర్చి దట్టించి కొడితే ఇంకొరకమైన టేస్ట్ వస్తుంది

అప్పుడు ,

‘ ఎంతో రుచిరా..తినరా మైమరచి…’
అంటూ రకరకాల పాటలు వస్తాయి !

సరే ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ,

ఓసారి భోజనం చేస్తుంటే నాన్న ఓ పొట్లంలోనుంచి రెండు ఉండలు తీసిచ్చి ‘ అన్నంలో నంచుకుని తిని ఎలా ఉందో చెప్పరా ? అన్నారు
వేడి వేడి కూర అన్నంతో పాటు పిండి ఉండనొకదాన్ని కడుపులోకి పంపించా

కొంచెం పిండిని నేరుగా కసుక్కున కొరికా
అంతే ,

మళ్లీ పాటలు వచ్చేసాయి

అద్భుతః ! ఏమి రుచి !

” కారం కారంగా.. ఏంటి నాన్నా ఇవి అని భలే టేస్టీ గా ఉన్నాయ్ ” అని అడిగా

నాన్న నవ్వి ‘ నువ్వు రోజూ ముక్కల పులుసులోనూ సాంబార్ లోనూ ఏవేసుకుని తింటావ్రా ?’ అన్నారు

“మద్రాస్ వారి అప్పడాలు నాన్నా “అన్నా

నాన్న మళ్లీ నవ్వి ( నవ్వటం కొందరికి దేవుడిచ్చిన వరం ) “అవి మద్రాస్ వారి అప్పడాలు అయితే ఇవి విజయవాడ వారి అప్పడాల పిండి ఉండలురా..సత్యనారాయణ పురంలో రమా ఆయిల్ మిల్ లో తీసుకువచ్చా ” అన్నారు

నాకు ఆశర్యం వేసింది !

అప్పడాలు తింటారని తెలుసుకానీ అప్పడాల పిండి కూడా తింటారని మొదటిసారి అప్పుడే అర్థం అయ్యింది

అలా నాన్న పరిచయం చేసిన అప్పడాల పిండి ఉండలు ఆ రోజునుంచి నా ఫేవరేట్ అయ్యాయి

ఎప్పుడు విజయవాడ వెళ్లినా సత్యనారాయణ పురం రమా ఆయిల్ మిల్ కొట్టుకు వెళ్లి అప్పడాల పిండి ఉండ ప్యాకెట్లు తెచ్చుకోవడం అలవాటు అయ్యింది

ఇప్పటిదాకా అప్పడాల పిండి ఉండలు తినని వాళ్ళుంటే ఒకసారి ట్రై చెయ్యండి
పాట పాడకుండా ఉండలేరు .. నాది గ్యారంటీ !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!