షాడో …ఈ పేరు కొన్ని దశాబ్దాలపాటు తెలుగు పాఠకులని ముఖ్యంగా కుర్రకారును ఉర్రుతలుగించిన పేరు !
పాఠకుల డ్రీమ్ హీరో షాడో కి ఊపిరి పోసింది రచయిత మధుబాబు గారు
అక్షరం అక్షరానికి కన్నార్పకుండా ఏకబిగిన చదివించే శైలి షాడో సృష్టికర్త మధుబాబు గారిది
పేజీ తిప్పితే తరువాత ఏం జరుగుతుందో అని పాఠకుడిచే ఊపిరి బిగపట్టి కధ చదివించే అద్భుత కథనం మధుబాబు గారిది !
సస్పెన్సు
ఉత్కంఠ
కథలో మెరుపు వేగం
షాడో యాక్షన్ థ్రిల్లర్
గంగారాం కామెడీ ట్రాక్
కులకర్ణి అస్సైన్మెంట్లు
ఒకటేమిటి ,
మొదటి పేజీ మొదలు చివరి పేజీ వరకు ప్రతి అక్షరం వెంట పాఠకులను పరుగులు పెట్టిస్తుంది
మధుబాబు గారి షాడో డిటెక్టివ్ నవల రిలీజ్ అయినరోజే పొద్దునే విజయవాడ అలంకార్ సెంటర్ లో బుక్ కోసం పడిగాపులు కాసినవాళ్ళలో నేనూ ఒకడిని
నాటికీ
ఈనాటికీ
ఏనాటికీ
తెలుగు పాఠకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే పేరు
షాడో
షాడో
షాడో
అటువంటి షాడో ని సృష్టించిన సృష్టికర్త మధుబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు !
పరేష్ తుర్లపాటి