దైవం మానుష రూపేణా !
దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉండడు .. మనుషుల మధ్య .. మనసుల్లోనే ఉన్నాడు
రైలులో వెళుతున్న గర్భిణికి అకస్మాత్తుగా పురిటినొప్పులు రావడంతో ఓ యువ ఆర్మీ వైద్యుడు అందుబాటులో ఉన్న హెయిర్ క్లిప్పు, పాకెట్ కత్తి సాయంతో రైల్వే ప్లాట్ఫాం మీద ఆమెకు ప్రసవం చేశారు.
ఉత్తరప్రదేశ్లోని ఝూన్సీలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
పన్వేల్ నుంచి గోరఖ్ పురక్కు రైలులో వెళ్తున్న గర్భిణిని అత్యవసర వైద్యసాయం కోసం ఝాన్సీ స్టేషనులో దించారు.
అదే సమయంలో హైదరాబాద్కు వెళ్లేందుకు మరో రైలు కోసం ఎదురుచూస్తున్న ఆర్మీ వైద్యాధికారి మేజర్ డాక్టర్ రోహిత్ బచ్వాలా (31) పరిస్థితిని గమనించి రైల్వే మహిళా సిబ్బంది, స్థానిక మహిళల సాయంతో గర్భిణికి ప్లాట్ఫాంపైనే సురక్షితంగా ప్రసవం చేశారు.
పండంటి ఆడపిల్ల పుట్టింది.
బొడ్డుతాడును బిగించడానికి హెయిర్ క్లిప్పు వాడానని, బిడ్డ ఆరోగ్యం స్థిరంగా ఉందని నిర్ధారించుకున్నాక పాకెట్ కత్తితో దానిని కత్తిరించినట్లు ఆయన వివరించారు.
అవసరం లో ఆదుకోవాలన్న స్పృహ ఉండాలే కానీ అన్ని అలా కలిసొస్తాయి..
ఇంకా భూమ్మీద ఇలాంటి ధర్మాత్ములు ఉన్నారు .. అందుకే ఈ భూమి సురక్షితంగా ఉందేమో.. కదా..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ ట్రెండింగ్ అవుతుంది
డాక్టర్ రోహిత్ బజ్వాలా గారిని వైద్యో నారాయణో హరి అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు !
Sirisha N