కింగ్డమ్ సినిమాకి అండాదండా అంతా ఆ కొండే !

Spread the love

కింగ్డమ్ సినిమాకి అండాదండా అంతా ఆ కొండే !

కింగ్డమ్ సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందు మనం విజయ్ దేవరకొండ గురించి చెప్పుకోవాలి

విజయ దేవర కొండ అనగానే ముఖం మీదకు వేలాడే జుట్టుతో దట్టంగా పెరిగిన గుబురు గడ్డంతో ఊహించుకునే ప్రేక్షకులకు ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకున్నాడు

అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా స్పై పాత్ర పోషించిన విజయ్ అందులో ఒదిగిపోయాడు

ఈ సినిమాలో మనకు విజయ్ కనిపించడు .. సూరి మాత్రమే కనిపిస్తాడు

అంతగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించాడు

పాత్రకు తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్ ను కూడా మార్చుకోవడంలో విజయ్ సక్సెస్ అయ్యాడు

ఇక కథ విషయానికి వస్తే గతంలో కూడా అండర్ కవర్ ఆపరేషన్లలో కూడిన స్పై కథలతో సినిమాలు వచ్చాయి
దానికే కొద్దిగా మసాలా జల్లి కొత్తగా చెప్పటానికి ప్రయత్నించాడు దర్శకుడు గౌతమ్

అంకాపూర్ లో ఒక చిన్న కానిస్టేబుల్ సూరి ( విజయ్ దేవరకొండ )

అయితే చిన్ననాడే తప్పిపోయిన తన అన్న శివ ( సత్యదేవ్ ) కోసం వెతుకుతుంటాడు సూరి

ఈ నేపథ్యంలో ఓ పోలీస్ అధికారి శివ చూకీ గురించి సూరికి చెప్తూ శ్రీలంకలో ఒక అండర్ కవర్ ఆపరేషన్ బాధ్యతలు అప్పగిస్తాడు

ఈ ఆపరేషన్ లో పాల్గొనటం సూరికి ఇష్టం లేకపోయినా తన అన్న ఆచూకీ తెలుస్తుందని అందుకు ఒప్పుకుంటాడు

ఇక అక్కడ్నించి కథ శ్రీలంకకు షిఫ్ట్ అవుతుంది

స్పై ఆపరేషన్ లో భాగంగా శ్రీలంక చేరిన సూరికి అక్కడి మాఫియా డాన్ మురుగన్ (వెంకటేష్ ) నుంచి అడ్డంకులు ఎదురౌతాయి

సూరి తన అన్న ఆచూకీ వెతుక్కుంటూ మాఫియా డాన్ ఉండే దీవిలోకి ఎలా ఎంటర్ అవుతాడు ? అక్కడ అతడి ఆచూకీ దొరుకుతుందా ? అక్క్కడ సూరి అన్న శివ ఏం చేస్తుంటాడు ? అనేది మిగిలిన సినిమా లో తెలుస్తుంది

ఎవరెలా చేసారు ?

ఈ సినిమాలో ఎవరెలా చేసారంటే పైన చెప్పినట్టుగా హీరో విజయ్ దేవర కొండ గురించే చెప్పుకోవాలి

తనకిచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు

ఇక శివ పాత్రలో నటించిన సత్యదేవ్ విలక్షణ నటుడు
గతంలో కూడా చక్కటి నటనతో ప్రేక్షకుల గుర్తింపు పొందాడు

కానీ ఈ సినిమాలో దర్శకుడు అతడ్ని పూర్తిగా వాడుకోలేదు అనిపిస్తుంది

కధానాయిక భాగ్యశ్రీ బొర్సేకి కి పెద్ద ప్రాధాన్యత లేదు

మురుగన్ పాత్రలో నటించి మళయాళ నటుడు వెంకటేష్ నటన బావుంది

సాంకేతికత గురించి మాట్లాడుకోవాలంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా కేజిఎఫ్ సినిమా గుర్తుకొస్తుంది

ఈ ఒక్క విషయంలో దర్శకుడు తనదైన సొంతముద్ర నుంచి పక్కకు జరిగాడు

అనిరుద్ సంగీతం పర్లేదు
కానీ సినిమాలో సన్నివేశాలకు ఇంకాస్త అదిరిపోయే బీజీఎమ్ స్కోర్ ఇవ్వొచ్చు

ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి మీద కూడా ప్రేక్షకులకు కొన్ని అంచనాలు ఉన్నాయి

జెర్సీ సినిమాలో చక్కటి భావోద్వేగాలను పండించాడు
కానీ కింగ్డమ్ లో మాత్రం ఆ విషయంలో వెనకబడ్డాడు

అన్నదమ్ముల మధ్య భావోద్వేగాలను సరిగా ఎలివేట్ చేయలేకపోయాడు

ఎంత అండర్ కవర్ ఆపరేషన్ స్టోరీ అయినా కథలో భాగంగా భావోద్వేగాలను జొప్పించినప్పుడే కథనం మరింత పండుతుంది

ముఖ్యంగా కింగ్డమ్ సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి మధ్యలో చప్పున ఇంకో సినిమా గుర్తుకు రాకూడదు
కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు కొన్నిసార్లు అలాంటి ఫీలింగ్ వచ్చింది
అది పూర్తిగా దర్శకత్వ లోపం

నిర్మాత సూర్యదేవర నాగ వంశీ పెట్టిన పెట్టుబడి సినిమాలో కనిపించింది
నిర్మాణ విలువలు బానే ఉన్నాయి

ఇక టోటల్ గా సినిమా విషయానికి వస్తే , అదేంటో ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు అన్నీ దాదాపు ఫస్టాఫ్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోగా సెకండాఫ్ మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది

అలాగీ కింగ్డమ్ కూడా ఫస్టాఫ్ లో చకచకా సాగిపోయి సెకండాఫ్ లో కొద్దిగా తడబడినట్టు అనిపించింది

ఓవరాల్ గా కింగ్డమ్ సినిమాకి రాజు , మంత్రీ విజయ్ దేవర కొండనే !

రేటింగ్ : 3 / 5
పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!