Home » అభిషేక్ శర్మ సిక్స్-హిట్టింగ్ అలవాటు వెనుక యువరాజ్ సింగ్ నేర్పిన పాఠం ఏంటి ?

అభిషేక్ శర్మ సిక్స్-హిట్టింగ్ అలవాటు వెనుక యువరాజ్ సింగ్ నేర్పిన పాఠం ఏంటి ?

Spread the love

ఆసియా కప్ 2025 సూపర్ 4s గేమ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు అభిషేక్ శర్మ

23 ఏళ్ల ఈ యువకుడు హిట్ గేమ్ ఆడి సిక్సర్లు కొట్టి భారతదేశానికి ఆరు వికెట్ల విజయాన్ని అందించాడు.
అభిషేక్ శర్మ ఆట నైపుణ్యం వెనుక ఇద్దరు క్రికెటర్లు గురువులై అతడికి శిక్షణ ఇచ్చి నేర్పిన పాఠాలు ఉన్నాయ్

అభిషేక్ లోని నైపుణ్యాన్ని గుర్తించిన యువరాజ్ సింగ్ అండ్ బ్రియాన్ లారా క్రికెట్లో అతడికి మరిన్ని మెళుకువలు నేర్పారు

రెండుసార్లు ప్రపంచ కప్ విజేత యువరాజ్ సింగ్ మరియు వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారా వంటి దిగ్గజాల మార్గదర్శకత్వంతో భారత క్రికెట్‌లో అతని ఎదుగుదల , నైపుణ్యాలను పెంచటానికి మరింత ఉపయోగపడింది

లారా ఒకప్పుడు ఈ యువకుడిని తన బ్యాట్-స్వింగ్‌ను మెరుగుపరచుకోవడానికి గోల్ఫ్ కోర్సులోకి తీసుకెళ్లినప్పుడు తనదైన సృజనాత్మకతను జోడించాడు.

గోల్ఫ్ కోర్సు లో ఆడటం ద్వారా క్రికెట్లో ఎలా ఆడాలో మరిన్ని మెళుకువలు తెలుస్తాయని లారా అతడికి ఉద్బోధ చేసాడు

ఇక అభిషేక్ శర్మ క్రికెట్లో ఎదగటానికి యువరాజ్ సింగ్ అందించిన ప్రోత్సాహం కూడా మామూలుది కాదు

అభిషేక్ తండ్రి రాజ్ కుమార్ శర్మ తన కొడుక్కి యువరాజ్‌తో భాగస్వామ్యం ఎలా ప్రారంభమైందో గుర్తు చేసుకున్నారు.

“అభిషేక్ ఎదగటం వెనుక క్రెడిట్స్ అన్నీ యువీకే దక్కుతాయి. లాక్‌డౌన్ సమయంలో, అతను అభిషేక్‌కు ప్రతిరోజూ శిక్షణ ఇచ్చాడు, యువి అందించిన శిక్షణను అభిషేక్ ఇప్పటికీ పాటిస్తాడు . ధ్యానం, క్రమశిక్షణ, కమ్యూనికేషన్ – ఇలా తన ఆట తీరును మెరుగుపరుచుకునేందుకు కఠోర సాధన చేసాడు .”

అంతేకాదు క్రికెట్లో మరిన్ని మెళుకువలను నేర్చుకోవడానికి బ్రియాన్ లారా చెప్పే ప్రతిదాన్ని నోట్ చేసుకోమని యువరాజ్ చెప్పాడు” అని రాజ్ కుమార్ చెప్పాడు

సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో పనిచేసినప్పుడే అభిషేక్‌లో సిక్సర్ల పట్ల ఉన్న వ్యామోహాన్ని లారా గమనించాడు

“సిక్సర్లు బాది బంతిని బౌండరీ లైన్లను దాటించాలనే అభిషేక్ ఆసక్తిని గమనించిన లారా అతన్ని గోల్ఫ్ కోర్సుకు తీసుకెళ్లి ‘ఇక్కడ కూడా నువ్వు ప్రాక్టీస్ చెయ్ . ఈ ఆట నీ బ్యాట్ స్వింగ్‌లో సహాయపడుతుంది’ అని అన్నాడు.

అది అభిషేక్ ఆట తీరులో పెద్ద మార్పును తీసుకొచ్చింది

తరువాత అతను చండీగఢ్‌లో యువీతో కూడా గోల్ఫ్ ఆడాడు

ఆదివారం జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో అభిషేక్ 39 బంతుల్లో 74 పరుగులు చేసిన తర్వాత, గతంలో యువరాజ్‌తో శిక్షణ పొందుతున్న అతని వీడియో వైరల్ అయింది.

ఆ వీడియోలో “తు నా సుధ్రీ… బాస్ చక్కే మారి జాయ్.. తలే నా ఖేలి (నువ్వు వినబోవడం లేదు… నువ్వు సిక్సర్లు మాత్రమే కొడుతున్నావు, నేల వెంట కూడా ప్రయత్నించు) అని యువరాజ్ జోక్ చేస్తూ కనిపించాడు

అలా అభిషేక్ శర్మ బ్యాటింగ్ తీరు మెరుగుపడటం వెనుక ఇద్దరు గురువులు యువరాజ్ సింగ్ అండ్ బ్రియాన్ లారాలు అందించిన శిక్షణ ప్రధాన పాత్ర పోషించింది


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *