ఏజ్ రివర్స్ సాధ్యమే
ఇంకో పదేళ్లు ఆరోగ్యంగా జీవించండి. ప్రాణాంతక వ్యాధులన్నిటికి వైద్య పరమైన పరిష్కారాలు దొరుకుతాయి. జీన్స్ ను ఎడిట్ చేసి కొన్ని క్యాన్సర్లు, గుండె సమస్యలు రాకుండా చేయగలుగుతారు వైద్య పరిశోధకులు.
- కొలెస్టరాల్ దుష్ప్రభావాలు మరో రెండు మూడేళ్లలో సాల్వ్ అవుతాయి. బలహీనమైన గుండె కండరాలను కూడా స్టెమ్ సెల్ థెరపీతో ఇంప్రూవ్ చేయవచ్చు.
- పక్షవాతం, వెన్నుపూస గాయాల వల్ల మంచాల పాలైన వారు కూడా స్టెమ్ సెల్ థెరపీతో కోలుకుంటారు. అదీ సాధ్యం కాని పక్షంలో ఎక్సో స్కెలెటన్స్ (Exo Skeleton) అనే సపోర్టివ్ స్ట్రక్షర్ ద్వారా నడవగలుగుతారు. పోలియో వ్యాథి గ్రస్తులు వాడుతున్న తేలికపాటి క్రెషెష్ లాగా ఉంటాయివి.
- మెదడులోని న్యూరాన్స్ ను కూడా స్టెమ్ స్టెల్స్త్ తో చురుకుగా చేయొచ్చు. కంటి చూపు కోల్పోయిన వారు, అసలు కన్నునే కోల్పోయిన వారికి బయోనిక్ ఐ(Bionic Eyes) లు తిరిగి దృష్టిని అందిస్తాయి.
- శరీరంలోని అన్ని అవయవాలను మార్పిడి చేసుకోవచ్చు. దాతలు లేకపోతే లేబరేటరీలోనే స్టెమ్ స్టెల్స్ ద్వారా కావాల్సిన అవయవాన్ని డిజైన్ చేసుకుని అమర్చడం సాధ్యం అవుతుంది.
- అల్జైమెర్స్, మతిమరుపు లాంటి మెదడు సమస్యలకు వచ్చే మూడు నాలుగేండ్లలో ట్రీట్ మెంటు దొరుకుతుంది.
- డయాబెటిస్ -1, డయాబెటిస్ 2 లను రివర్స్ చేయడం ఇప్పటికే మొదలైంది.
- జుట్టు కోల్పోయిన వారికి బ్రెయిన్ డెడ్ అయిన వారి (cadaver) నుంచి సేకరించిన వెంట్రుకలను నాటే సాంకేతిక వస్తుంది. బయటి వెంట్రుకలను శరీరం తిరస్కరించకుండా రోగ నిరోధక వ్యవస్థను టేమ్ చేసే పద్ధతులపై పరిశోధనలు జరుగుతున్నాయి.
- ఊడిపోయిన పళ్ల స్థానంలో దవడ ఎముక నుంచి కొత్త దంతాలు సహజంగా పెరిగే వైద్య సాంకేతికను జపాన్ డెవలప్ చేసింది. మరో రెండు మూడోళ్లలో మార్కెట్లోకి వస్తుంది.
*ఊబకాయాన్ని తగ్గించే ‘ఒజెంపిక్ ‘ (Ozempic) లాంటి పలు ఇంజక్షన్ల పేటెంట్ గడువు మరో రెండేళ్లలో ముగుస్తుంది. దీనితో అన్ని ఔషధ కంపెనీలు జెనెరిక్స్ ను తయారు చేస్తాయి. ఫలితంగా ధరలు బాగా తగ్గి అందరికీ అందుబాటులోకి వస్తాయి.
*ఊబకాయం నుంచి బయటపెడితే మోకాళ్ల అరుగుదల, వెన్నుపూస సమస్యలు అదుపులోకి వస్తాయి. మధుమేహం నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
కిడ్నీ, లివర్ లను స్టెమ్ సెల్స్ తో ల్యాబ్ లో తయారు చేసే ప్రయోగాలు ఆశాజనకంగా ఉన్నాయి. కోల్పోయిన నోటి రుచి, ముక్కు వాసనలను మెరుగుపర్చే ప్రయత్నాలు జరగుతున్నాయి.
- మనం చేయాల్సింది ఏమిటంటే…మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. పాజిటివ్ ధృక్ఫథం అలవర్చుకోవాలి.
B T Govinda Reddy