Home » సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116 మూవీ చూసారుగా.. నిజ జీవితంలో కూడా మన దేశం కోసం ప్రాణాలకు తెగించి కొంతమంది గూఢచారులు పనిచేసారు .. వారిలో అజిత్ దోవల్ కూడా ఒకరు !

సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116 మూవీ చూసారుగా.. నిజ జీవితంలో కూడా మన దేశం కోసం ప్రాణాలకు తెగించి కొంతమంది గూఢచారులు పనిచేసారు .. వారిలో అజిత్ దోవల్ కూడా ఒకరు !

Spread the love

ఇంగ్లీష్ , హిందీ , తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మనం గూఢచారి వంటి స్పై సినిమాలు చూసాము

తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116 అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది

ఈమధ్య వచ్చిన సీతారామం సినిమాలో కూడా భారత సైన్యంలో పనిచేసిన రామం అనే సైనికుడు పాకిస్తాన్ సైన్యానికి చిక్కి అక్కడే ప్రాణాలు కోల్పోతాడు

పొరపాటున బోర్డర్లో దొరికితే అయినా దౌత్య పరంగా చర్చలు జరిపి వెనక్కి తీసుకు రావచ్చేమో కానీ గూఢచర్యం చేస్తూ దొరికిపోతే మాత్రం ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే

సినిమాల్లో రహస్య గూఢచారులు చేసే అడ్వెంచర్స్ చూస్తుంటేనే మనకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది

అలాంటిది దేశం కోసం అలాంటి సాహసాలు చేసిన గూఢచారుల వాస్తవ గాధలను చదువుతుంటే మనకు ఖచ్చితంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి

మన దేశం కోసం కూడా కొంతమంది ప్రాణాలకు తెగించి శత్రు దేశాల్లో స్పై ఆపరేషన్లు చేసారు

వీరిలో కొందరు శత్రువులకు చిక్కి ప్రాణాలు పోగొట్టుకున్నారు
మరికొంతమంది జైళ్లల్లో మగ్గిపోయారు
ఇంకొంతమంది తప్పించుకుని బయటపడ్డారు

అలా మన దేశం కోసం ప్రాణాలకు తెగించి స్పై ఆపరేషన్లు చేసినవారిలో అజిత్ దోవల్ , రవీంద్ర కౌశిక్ లాంటి వాళ్ళు ఉన్నారు

ప్రస్తుతం భారత జాతీయ భద్రతా సలహాదారుడిగా ఉన్న అజిత్ దోవల్ గతంలో మన దేశం తరపున పాకిస్తాన్లో రహస్య గూఢచారిగా పనిచేసారు

ఇతను RAW తరపున రహస్యంగా పాకిస్తాన్లో ప్రవేశించి ముస్లిం గా తన పేరును మార్చుకుని షుమారు 7 సంవత్సరాలు అక్కడే ఉండి సీక్రెట్ ఆపరేషన్స్ చేసాడు

ఉగ్రవాదుల కదలికలను , పాక్ సైన్యం కుట్రలను ఎప్పటికప్పుడు ముందుగానే ఇండియాకి చేరవేసేవాడు

అజిత్ దోవల్ ప్రాణాలకు రిస్క్ తీసుకుని ఏకంగా ఉగ్రవాదుల స్థావరాల మధ్యే ఉంటూ సీక్రెట్ ఆపరేషన్స్ చేసాడు

అందుకే అతడి ధైర్య సాహసాలకు మెచ్చుకుంటూ అతడ్ని ‘ ఇండియన్ జేమ్స్ బాండ్ ‘ అని పిలుస్తారు

ఇప్పటికీ ఈయన శత్రువుల కదలికలను ముందుగానే పసిగట్టి భారత సైన్యాన్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నాడు
భారత రక్షణ వ్యవహారాలలో అజిత్ దోవల్ దే కీలక పాత్ర
ప్రధానిని నేరుగా కలవగలిగే అతి కొద్దిమంది టాప్ అధికారుల్లో అజిత్ దోవల్ ఒకరు

ఇక రవీంద్ర కౌశిక్ అనే ఇంకో గూఢచారి గురించి కూడా చెప్పుకోవాలి

రవీంద్ర కేవలం 23 సంవత్సరాల వయసులోనే RAW దగ్గర సుశిక్షితమైన శిక్షణ తీసుకుని స్టూడెంట్ అవతారంలో పాకిస్తాన్లో ప్రవేశించాడు

ఇతడైతే ఏకంగా తన పేరు , రూపు మార్చుకుని పాకిస్థాన్లోని కరాచీ విశ్వ విద్యాలయంలో స్టూడెంట్ గా చేరి అక్కడే చదువుకుని అక్కడే పట్టా కూడా పుచ్చుకున్నాడు

పాకిస్తాన్ అధికారులు కూడా అతడు చదువుకోవడానికి వచ్చిన స్టూడెంట్ అనుకున్నారే కానీ భారత దేశం తరపున వచ్చిన రహస్య గూఢచారి అని అస్సలు కనిపెట్టలేకపోయారు

రవీంద్ర కౌశిక్ స్థానికంగా యెంత నమ్మకం సంపాదించుకున్నాడు అంటే ఏకంగా పాకిస్తాన్ ఆర్మీలో చిన్న ఉద్యోగం సాధించాడు

ఆర్మీలో చేరడంతో అతడి పని తేలికైంది
సైనిక రహస్యాలు ఒకటొకటిగా భారత్ కు చేరవేసేవాడు

ఇది అత్యంత రిస్క్ తో కూడుకున్న వ్యవహారం
ఏ మాత్రం దొరికినా ప్రాణాల సంగతి దేవుడెరుగు .. వాళ్ళు పెట్టే చిత్రహింసలు తట్టుకోవడం కష్టం

అలా సంవత్సరాల పాటు పాక్ రక్షణ రహస్యాలు భారత్ కు చేరవేసాడు

కానీ దురదృష్టవశాత్తు 1983 లో పాకిస్తాన్ సైన్యం అతడ్ని ఇండియన్ గూఢచారిగా గుర్తించింది
వెంటనే అరెస్ట్ చేసి అతడినించి నిజాలు రాబట్టడానికి జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టింది

పాకిస్తాన్ ఎన్ని చిత్రహింసలు పెట్టినా రవీంద్ర ఇండియా గురించి ఒక్క రహస్యం బయటపెట్టలేదు
అలా 1983 నుంచి 2001 వరకు చిత్రహింసలు పెడుతూనే ఉన్నారు . ఆఖరికి వాళ్ళ చిత్రహింసలు తట్టుకోలేక జైల్లోనే ప్రాణాలు కోల్పోయాడు

అతని పరాక్రమానికి మెచ్చి అప్పటి ప్రధాని దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన ఓ గొప్ప గూఢచారి రవీంద్ర ‘ ది బ్లాక్ టైగర్’ అని నివాళులు అర్పించారు

వీళ్లే కాకుండా NSG లో కమెండోగా పని చేసిన లక్కీ బిష్ణ్ కూడా దేశం కోసం గూఢచారిగా మారాడు
ఇతను గతంలో ప్రధాని నరేంద్ర మోడీ సెక్యూరిటీ వింగ్ లో NSG కమెండోగా పనిచేసాడు

ఇతడి పరాక్రమాన్ని గుర్తించిన RAW విదేశాల్లో స్పై ఆపరేషన్ల కోసం రహస్య గూఢచారిగా పంపింది .
అయితే ఇతడి గురించి పూర్తి వివరాలు బయటికి రాలేదు

వీళ్ళు ముగ్గురే కాకుండా ప్రాణాలకు తెగించి పాకిస్తాన్లో గూఢాచారం చేస్తూ దొరికిపోయి ఇప్పటికీ జైళ్లలో మగ్గుతున్న గూఢచారులు కొందరున్నారు

భారత ప్రభుత్వం చొరవతో చాలామంది ఇండియాకి సురక్షితంగా చేరుకొని ప్రస్తుతం అజ్ఞాత జీవితం గడుపుతున్నారు

చూసారుగా , నిజ జీవితంలో దేశం కోసం గూఢచర్యం చేయడం సినిమాల్లో చూపించినంత ఈజీ కాదు
ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాలే పోతాయి !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *