అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని మొత్తం లైవ్ లో వీడియో తీసింది ఈ కుర్రాడే.. అసలు సరిగ్గా అదే టైములో ఆ కుర్రాడు అక్కడెందుకున్నాడు ?

Spread the love

గురువారం అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దృశ్యాలు యావత్తు చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది

దాంతో విమానం టేకాఫ్ నుంచి కూలిపోయే వరకు యావత్తు దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించారు అంటే విమానం  కూలిపోతుందని ముందే తెలిసిన ఎవరో  ఆగంతకుడు వీడియో మొత్తం చిత్రీకరించి ఉంటాడని భావించి కుట్ర కోణం దిశగా  దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తే 17 ఏళ్ళ బాలుడు దొరికాడు

12 వ తరగతి చదువుతున్న 17 ఏళ్ళ ఆర్యన్ ఆ వీడియో తీసినట్టు తెలిసింది

అంతకుముందు రెండు రోజుల క్రితమే ఆర్యన్ తన స్వగ్రామం  నుంచి అహ్మదాబాద్ లో తండ్రి ఉంటున్న లక్ష్మి నగర్ కు వచ్చాడు

 రోజూ తండ్రి ఉంటున్న అపార్ట్మెంట్ పైకి వెళ్లి  విమానాల రాకపోకల వీడియోలు తీసి గ్రామంలో ఉన్న స్నేహితులకు షేర్ చేసేవాడు

అలా యధాప్రకారంగా ఆ రోజు కూడా అపార్ట్మెంట్ పైకి వెళ్లి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే విమాన దృశ్యాలను వీడియో తీయడం ప్రారంభించాడు

కానీ ఆ కుర్రాడు వీడియో తీస్తున్నప్పుడే ఆ  విమానం మెడికల్ కాలేజ్ బిల్డింగును ఢీ కొట్టి కూలిపోవడంతో షాక్ అయ్యాడు

భయంతో వణికిపోయి తిండి కూడా తినకుండా గ్రామానికి పారిపోదాం  అనుకున్నాడు

అతడు భయంతో వణికి పోవడం గమనించిన సోదరి అసలు విషయం తెలుసుకుని ఆ వీడియోని తండ్రికి షేర్ చేసింది

అక్కడే మెట్రోలో పనిచేస్తున్న అతడి తండ్రి ఆ వీడియోని పోలీసులకు అందచేయడంతో అసలు కథ  వెలుగులోకి వచ్చింది

అయితే దర్యాప్తు సంస్థలకు ప్రస్తుతం ఆర్యన్ తీసిన వీడియో  ముఖ్యమైన క్లూ గా మారింది

విచారణలో ఆ కుర్రాడు ఉద్దేశ్య పూర్వకంగా వీడియో తీసినట్టు తేలకపోవడంతో ఆర్యన్ ను వదిలేసినట్టు పోలీసులు తెలిపారు

ఏదైతేనేమి 17 ఏళ్ళ కుర్రాడు ఆర్యన్  సరదాగా తీసిన విమాన ప్రమాదం వీడియో వైరల్ అవడమే కాకుండా దర్యాప్తు సంస్థలకు కీలక ఆధారంగా మారింది !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!