“స్విచ్ లు ఎందుకు ఆపావు ?” మొదటి పైలట్ ప్రశ్న
” నేను ఆపలేదు ” -రెండో పైలట్ సమాధానం
ఇదీ అహ్మదాబాద్ విమానప్రమాదంలో కాక్ పిట్ వాయిస్ లో రికార్డ్ అయిన సంభాషణలు
యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దుర్ఘటన పై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ( AAIB ) ఇచ్చిన ప్రాధమిక నివేదికలో ముఖ్యమైన అంశం ఇది
కాక్ పిట్ వాయిస్ రికార్డర్ ను డీ కోడ్ చేసిన తర్వాత దుర్ఘటనకు ముందు కాక్ పిట్ లో ఏం జరిగిందనేది ప్రాధమిక నివేదిక లో వెల్లడించింది
AAIB నివేదిక ప్రకారం ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు ఇద్దరు పైలట్ల మధ్య పై విధమైన సంభాషణలు జరిగినట్టు గుర్తించింది
అంతేకాదు విమాన ఇంజన్ల ఇంధన కంట్రోల్ స్విచ్ లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని అంచనాకు వచ్చింది
విమానం సరిగ్గా మధ్యాహ్నం 1 . 37 . 37 నిమిషాలకు టేకాఫ్ అయ్యింది
- 38 . 42 నిమిషాలకు గరిష్ట వేగమైన 180 నాట్స్ ను అందుకుంది
సరిగ్గా ఇదే సమయంలో ఇంధన సరఫరా వ్యవస్థలో అవాంతరం వచ్చింది
ఇంజిన్ 1 , ఇంజిన్ 2 లకు చెందిన ఇంధన స్విచ్ లు రన్ నుంచి కటాఫ్ పొజిషన్ కు మారాయి .
ఒక సెకను తేడాతో ఈ రెండు స్విచ్ లు ఒకదానివెనుక ఒకటి ఆగిపోయాయి
బహుశా పైలట్ ఈ విషయం గుర్తించి ఉంటాడు
అందుకే రెండో పైలట్ ని ఇంధన స్విచ్ లు ఆపావా ? అని ప్రశ్నించి ఉంటాడు
ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడంతో క్రమంగా టేకాఫ్ వేగం కూడా తగ్గింది
ఈ మాటల్లో ఉండగానే ఇంకో ఐదు సెకన్లలో మొదటి ఇంజిన్ ఇంధన స్విచ్ కటాఫ్ నుంచి తిరిగి రన్ కు మారింది .. మరో ఐదు సెకన్లలో రెండో ఇంజిన్ కూడా కటాఫ్ నుంచి రన్ కు మారింది
దానితో విమాన ఇంజిన్ కు ఇంధన సరఫరా పునరుద్ధరణ అయ్యింది
సాంకేతికంగా సమస్య పరిష్కారం అయిందనుకున్న సమయంలోనే ఊహించని అవాంతరం వచ్చిపడింది
ఇంధన సరఫరా పునరుద్ధరణతో ధ్రస్ట్ రికవరీ అవ్వాలి
కానీ మొదటి ఇంజిన్ తిరిగి ఆన్ అయినప్పటికీ రెండో ఇంజిన్ మాత్రం పూర్తిస్థాయిలో ఆన్ కాలేకపోయింది
దానితో విమానం నిర్దిష్ట వేగాన్ని అందుకోలేకపోయింది
ఈ విషయాన్ని గుర్తించిన పైలట్ ఆఖరి ప్రయత్నంగా సరిగ్గా 1. 39. 05 సెకన్లకు మేడే సందేశాన్ని పంపించారు
సరిగ్గా పైలట్ నుంచి మేడే సందేశం వచ్చిన ఆరు సెకన్లకు డేటా రికార్డింగ్ కూడా ఆగిపోయింది
ఇదీ అహ్మదాబాద్ విమాన ప్రమాద దుర్హ్టనపై AAIB ఇచ్చిన ప్రాధమిక నివేదిక సారాంశం
అయితే AAIB ఇచ్చిన ప్రాధమిక నివేదికపై అప్పుడే ఒక నిర్ణయానికి రావడం సరి కాదని పూర్తి నివేదిక వచ్చేవరకు వేచి చూడాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన నాయుడు అన్నారు !