అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి పక్షి ఢీ కొట్టడమే కారణమా ? పైలట్ మేడే కాల్ ద్వారా ప్రమాద ఘంటికను ముందే అధికారులకు చేరవేసే ప్రయత్నం చేశాడా ? అసలు మేడే కాల్ అంటే ఏంటి ?

Spread the love

గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా A I 171 విమానం టేకాఫ్ అయినా కొద్దీ క్షణాలకే కూలిపోయి అందులో ఉన్న 241 మంది ప్రయాణీకులతో పాటు 12 మంది విమాన సిబ్బంది కూడా దుర్మరణం పాలయ్యారు

దుర్మరణం పాలయిన ప్రయాణీకులలో  రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన  గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు

సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటా ముఫైఎనిమిది నిమిషాల  ప్రాంతంలో విమానం కూలిపోయింది

విమానం కూలిపోవటానికి పక్షి కారణం అయ్యుండొచ్చని అధికారులు ప్రాధమిక అంచనా వేశారు .. అయితే పూర్తీ దర్యాప్తులోనే  అసలు కారణం తెలుస్తుందని అధికారులు చెప్తున్నారు

ఈ విమాన ప్రమాదంలో ఇంకో దురదృష్టం ఏంటంటే విమానం పక్కనే ఉన్న మెడికల్ కాలేజీ బిల్డింగ్ మీద కూలటంతో భోజనాలు చేస్తున్న 50 మంది విద్యార్థులకు పైగా గాయాలు అయ్యాయి .. ఇంకో ఇరవై మంది విద్యార్థులు మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు

ఈ విమానం 11 ఏళ్ళ క్రితమే తయారైందని కాబట్టి సాంకేతికంగా కండీషన్లోనే ఉన్నట్టు భావిస్తామని అహమ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు చెప్పారు

ఇదిలా ఉండగా విమాన ప్రమాదానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ఎయిర్ ఇండియా సంస్థ  నిపుణులు .. కేంద్ర విమానయాన సంస్థ అధికారులు దర్యాప్తు  ప్రారంభించారు

మరోపక్క మాజీ పైలట్ ఖలీద్  ఒక టీవీ చర్చలో మాట్లాడుతూ పైలట్ మేడే కాల్ ఇచ్చాడంటే విమాన ప్రమాదానికి పక్షిఢీ  కొనడం కారణం అయ్యుండదని  చెప్పారు .. మేడే కాల్ అంటే కాక్ పిట్  లో వైఫల్యం ఉందని అర్ధం .. పైలట్ మేడే కాల్ ఇచ్చిన వెంటనే  ATC  కి కనెక్షన్స్ కట్ అయిపోయాయి ..కాబట్టి ఈ ప్రమాదం ఖచ్చితంగా కాకిపిట్ వైఫల్యమే అని ఆయన అభిప్రాయపడ్డారు

ఒకవేళ పైలట్ వైఫల్యమా అనుకుంటే విమానం నడపడంలో కెప్టెన్ సుమిత్ సభర్వాల్ కు 8,200 గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది

ఇదిలా ఉండగా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు ఇదే విమానంలో ప్రయాణించిన ఆకాష్ అనే ప్రయాణీకుడు ఎయిర్ ఇండియా ను ట్యాగ్ చేస్తూ విమానంలో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని .. ఏసీలు  పనిచేయడం లేదని  ఫోటోలు , వీడియోలతో సహా X లో ట్వీట్ పెట్టాడు

కారణాలు ఏమైనా జరిగిన విమాన ప్రమాదం భారతీయ విమానయాన చరితేరలోనే ఘోరం

అధికారుల దర్యాప్తులో  పూర్తి  వివరాలు తెలిసే అవకాశం ఉంది

ముగింపు : విమాన ప్రమాదంలో ప్రయాణీకులు అందరూ దుర్మరణం పాలవగా CP 11 A  సీటులో ప్రయాణిస్తున్న 38 ఏళ్ళ రమేష్ విస్వాస కుమార్ అనే ఒకే ఒక్క  వ్యక్తి మృత్యుంజయుడై ప్రాణాలతో మిగిలాడు .. విమానం క్రాష్ అవుతున్న సమయంలోనే కిందకి దూకేశానని అందుకే ప్రాణాలతో బయటపడ్డానని ఆయన చెప్పాడు .. అయితే ఎత్తునుంచి దూకటం  వల్ల  అయిన గాయాలకు ప్రస్తుతం వైద్య చికిత్స తీసుకుంటున్నాడు

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!