Home » ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ సెమి ఫైనల్స్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు గెలవడం వెనుక ప్రేరణ ఇచ్చిన నాలుగు నెలల పసికందు !

ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ సెమి ఫైనల్స్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు గెలవడం వెనుక ప్రేరణ ఇచ్చిన నాలుగు నెలల పసికందు !

Spread the love

ప్రపంచ కప్ మహిళా క్రికెట్ టోర్నమెంటులో భారత్ సెమి ఫైనల్స్ లో ఆస్ట్రేలియాతో తలపడి గెలవడం వెనుక జట్టు సభ్యులకు స్ఫూర్తినిచ్చింది ఎవరో తెలుసా ?

నాలుగు నెలల పసికందు
ఆశర్యంగా అనిపించినా ఇది నిజం

యుద్ధంలో కానివ్వండి , క్రీడల్లో కానివ్వండి , కెరీర్ లో కానివ్వండి , లేదా ఏ రంగంలో అయినా కానివ్వండి ఉన్నత స్థానాలకు చేరుకున్నవాళ్లకు , విజయ తీరాలకు చేరుకున్నవాళ్లకు ఏదో ఒక ప్రేరణ ఉండే ఉంటుంది

ఆ ప్రేరణే వారిని జీవితంలో అత్యున్నత స్థానాలకు తీసుకెళ్తుంది
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న చాలామంది గతంలో ఈ విషయం చెప్పారు

ఆస్ట్రేలియాతో సెమి ఫైనల్స్ మ్యాచ్ ముందు భారత మహిళా క్రికెటర్లకు ఆశర్యకరంగా అటువంటి ప్రేరణ లభించింది

అది కూడా ఒక దేవాలయంలో ఒక మాతృమూర్తి , ఆమె నాలుగు నెలల పసికందు నుంచి
భారత్ జట్టుకు ఊహించని అద్భుతమైన ప్రేరణ లభించింది

ఈ విషయాలను భారత్ మహిళా క్రికెటర్ క్రాంతి గౌడ్ ఓ మీడియా న్యూస్ ఛానెల్ తో పంచుకున్నారు

సరిగ్గా ఆస్ట్రేలియాతో సెమి ఫైనల్స్ మ్యాచ్ ముందు రోజు భారత మహిళా క్రికెటర్లు దేవాలయాల సందర్శనకు వెళ్లారు

అలా ఓ దేవాలయానికి వెళ్లి భారత్ గెలుపుకోసం పూజలు చేయించి ప్రాంగణంలో ప్రదక్షిణలు చేస్తుండగా నాలుగు నెలల పసికందుని ఒళ్ళో పెట్టుకుని ధ్యానం చేసుకుంటున్న మాతృమూర్తి వీరికి కనిపించింది

ఆమెను చూసిన క్రికెటర్లకు అక్కడ ఏదో తేజస్సు ఉన్నట్టు అనిపించింది

ధ్యానంలోనుంచి కళ్ళు తెరిచిన ఆ మాతృమూర్తి క్రికెటర్ల వంక చూసి చిరునవ్వుతో ” మీరు ప్రపంచ కప్ గెలవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను అని అంటూ తన ఒళ్ళో ఉన్న పసికందుని చూపిస్తూ ఏదో ఒక రోజు నా కూతురు కూడా మీలాగే దేశం కోసం ఆడే గొప్ప క్రికెటర్ కావాలని కోరుకుంటున్నాను ” అంది

ఎందుకో ఆమె మాటలు క్రికెటర్లలో బలంగా నాటుకుపోయింది

ఆ రాత్రి హోటల్లో కలుసుకున్న జట్టు సభ్యులందరికీ ఏదో ప్రేరణ వచ్చినట్టైంది

తన నాలుగు నెలల కూతురు పెద్దయ్యాక గొప్ప క్రికెటర్ కావాలని ఆ మాతృమూర్తి కోరుకోవడం జట్టుకి గొప్ప ఇన్స్పిరేషన్ ఇచ్చింది

సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన తాము నిజంగా భారత దేశం తరపున ఆడే స్థాయికి చేరుకోవడం వెనుక ఇటువంటి ఎందరో మాతృమూర్తుల కలలు ఉన్నాయని జట్టు సభ్యులు భావించారు

ఆ క్షణాన అందరికీ గర్వంగా అనిపించింది

ఎలాగైనా సరే తాము గెలిచి భవిష్యత్తులో ఆ నాలుగు నెలల కూతురితో పాటు ఎందరో ఆడపిల్లలకు స్ఫూర్తినివ్వాలని ఆ రాత్రే నిర్ణయించుకున్నారు

ఆ స్పూర్తితో మర్నాడు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో ఒక్కొక్కరు ఒక్కో శివంగులై విజృంభించి ఆడి గెలిచారు

చూసారా .. కధలా అనిపించినా .. కలలా అనిపించినా వాస్తవం యెంత గొప్పగా ఉందొ !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!