ఆదివారం ఇండియా , పాకిస్తాన్ ల మధ్య జరిగిన ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో భారత్ గెలవగానే సంబరాలు చేసుకుంటూ అమితాబ్ బచ్చన్ పెట్టిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
పాకిస్తాన్ మీద ఇండియా గెలగవగానే అమితాబ్ తన కొడుకు అభిషేక్ బచ్చన్ ను హాగ్ చేసుకుని ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ ‘ బాగా అడావ్ అభిషేక్ బచ్చన్ ‘ అనే క్యాప్షన్ కి తమ ఫోటో జత చేస్తూ ట్వీట్ వదిలారు
ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయి సామాన్యుడి నుంచి సెలెబ్రిటీ వరకు నవ్వులు పూయిస్తుంది
ఇంతకీ అమితాబ్ పాకిస్తాన్ కు కౌంటర్ గా ఈ ట్వీట్ పెట్టడం వెనుక చిన్న నేపధ్యం ఉంది
ఇండియా , పాకిస్తాన్ ఫైనల్స్ కు ముందు ఓ స్పోర్ట్స్ షో లో ఇరుదేశాల క్రికెట్ గెలుపోటముల గురించి చర్చిస్తున్నప్పుడు పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ అక్తర్ అభిషేక్ శర్మ పేరుకు బదులు అభిషేక్ బచ్చన్ పేరును మెన్షన్ చేస్తూ ” ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ అభిషేక్ బచ్చన్ ను అవుట్ చేస్తే మిగిలిన మిడిల్ ఆర్డర్ ఏం చేయగలదు ? “అని హేళనగా మాట్లాడాడు
షోయబ్ అక్తర్ తడబాటులో నోరు జారడం .. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగిపోయింది
షోయబ్ వ్యాఖ్యలకు కౌంటర్ గా ” సార్ ! ఆ వ్యూహాల సంగతి మా కెప్టెన్ చూసుకుంటాడు .. అయినా క్రికెట్లో నేను మీరనుకున్నంత మంచి ప్లేయర్ను కాదు ” అని నవ్వుల ఎమోజీతో అభిషేక్ బచ్చన్ ట్వీట్ వదిలాడు
ఇదిలా ఉండగా ఆదివారం ఫైనల్స్ లో ఇండియా గెలవడంతో అమితాబ్ బచ్చన్ పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ ముఖం పగిలిపోయే ఫైనల్ పంచ్ ఇవ్వడంతో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది !
