Home » టీమిండియా ప్రపంచ కప్ గెలవడానికి ముందు కోచ్ అమోల్ మజుందార్ జట్టు సభ్యులతో ఏం మాట్లాడాడు ? – ఆచార్య దేవో భవ !

టీమిండియా ప్రపంచ కప్ గెలవడానికి ముందు కోచ్ అమోల్ మజుందార్ జట్టు సభ్యులతో ఏం మాట్లాడాడు ? – ఆచార్య దేవో భవ !

Spread the love

మహిళా ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో భారత్ గెలవడం వెనుక ఓ గురుదేవుని శిక్షణ ఉంది

ఆ గురువుకి చిన్నప్పట్నుంచి క్రికెట్ అంటే ప్రాణం

స్కూలు రోజుల్లోనే చేతిలో బ్యాటు పట్టుకుని మైదానంలో పరుగులు తీసేవాడు

శారదాశ్రమమ్ స్కూల్ లో స్టార్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ , వినోద్ కాంబ్లీ లు ఇతడి సహచర విద్యార్థులే

ఓసారి ఆ స్కూల్ తరపున క్రికెట్ ఆడే అవకాశం ఈ ముగ్గురికీ వచ్చింది

ఆ మ్యాచుల్లో సచిన్ టెండూల్కర్ , వినోద్ కాంబ్లీ లు 664 పరుగులు సాధించి వరల్డ్ రికార్డ్ నెలకొల్పటమే కాకుండా జట్టును గెలిపించడంతో కాళ్ళకు ప్యాడ్స్ కట్టుకుని పెవిలియన్ లో కూర్చున్న ఈ కుర్రాడికి ఆడే అవకాశం రాలేదు

క్రికెట్ కెరీర్లో దురదృష్టం అతడ్ని మొదటిసారి అలా పలకరించింది
ఆ రోజు కనుక ఇతడికి ఆడే అవకాశం వచ్చి ఉంటే కథ మరోలా ఉండేది

అయినా ఆ కుర్రాడు నిరుత్సాహపడలేదు
వీలైంతసేపు మైదానంలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండేవాడు

టీమిండియా తరపున ఆడాలని కలలు కని కఠోర శ్రమ చేసి 21 సంవత్సరాల పాటు దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ఆట తీరును కనపర్చినా దురదృష్టవశాత్తు భారత జట్టులో చోటు దొరకక రిటైర్ అయి భారత మహిళా క్రికెట్ టీమ్ కు కోచ్ గా సెలెక్ట్ అయి ప్రపంచ కప్ ను గెలిపించిన ఆ కుర్రాడే అమోల్ మజుందార్

దేశవాళీ క్రికెట్లో మజుందార్ కు 1993-94 లో ముంబై రంజీ జట్టు తరపున ఆడే ఛాన్స్ రావడంతో వచ్చింది
అతడి మొదటి మ్యాచే ఫరిదాబాదులో హరియాణా తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో పాల్గొనే రూపంలో వచ్చింది

తనకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోదల్చుకోలేదు మజుందార్
ఆ ఇన్నింగ్స్ లో 260 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు

అయితే తనకు ఈ అవకాశం రావడం వెనుక కూడా ఒక కారణం ఉందని ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు విషయాన్ని రివీల్ చేసాడు మజుందార్

ఆ టైం లో సచిన్ టెండూల్కర్ , వినోద్ కాంబ్లీ , సంజయ్ మంజ్రేకర్ లాంటి ప్లేయర్లు టీమిండియా తరపున న్యూజీలాండ్ తో మ్యాచులు ఆడటానికి వెళ్లడంతో తనకు ఈ అవకాశం వచ్చిందని చెప్పాడు

1994 లో అండర్ 19 జట్టుకు వైస్ క్యాప్టెన్ గా ఇతర టీములతో ఆడాడు

2006-07 లో రంజీలో ముంబై జట్టుకి క్యాప్టెన్ అవడమే కాకుండా ఓడిపోతుంది అనుకున్న జట్టును విజయం వైపు నడిపించాడు

ముంబై జట్టు తర్వాత ఆంధ్రా జట్టు , అస్సాం జట్టు లలో కూడా కొంతకాలం ఆడి టీమిండియా తరపున ఆడాలనే కోరిక నెరవేరకుండానే 2014 లో దేశవాళీ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు

క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడన్నమాటే కానీ క్రికెట్ మీద ప్యాషన్ ను చంపుకోలేకపోయాడు

నేషనల్ క్రికెట్ అకాడెమీ లో కోచ్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు

ముంబై జట్టుకు , ఐపీఎల్ రాయల్ రాజస్థాన్ జట్లకు కోచ్ బాధ్యతలు నిర్వహించాడు

టీమిండియా మహిళల క్రికెట్ కోచ్ అవకాశం కూడా ఇతడికి నేరుగా రాలేదు

2022 లో అప్పటి కోచ్ రమేష్ పవార్ ను బీసీసీఐ పదవి నుంచి తొలగించింది
అలా ఆ పదవి కొద్దినెలల పాటు ఖాళీగానే ఉంది

2023 లో సెలెక్టర్ల దృష్టిలో దేశవాళీ క్రికెట్ జట్లకు శిక్షణ ఇస్తున్న అమోల్ మజుందార్ పడ్డాడు
అలా అతడు టీమిండియా మహిళా క్రికెట్ కోచ్ గా ఎంపిక కాబడ్డాడు

భారత మహిళా జట్టు ప్రపంచ కప్ సాధించడానికి కొద్ది రోజుల ముందు ఏం జరిగింది ?

వరల్డ్ కప్ లో వరుసగా మూడుసార్లు ఓడిపోయి ఒక దశలో సెమిస్ అవకాశాలను కోల్పోయే పరిస్థితి వచ్చింది

అప్పుడు ఇండియన్ టీమ్ క్యాప్టెన్ హర్మన్ ప్రీత్ తో సహా జట్టు సభ్యులందరూ నిరాశలో మునిగిపోయి ఉన్నారు

సరిగ్గా ఆ సమయంలో కోచ్ అమోల్ మజుందార్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చి టీమిండియా సభ్యులకు దైర్యం చెప్పి దిశా నిర్దేశం చేసాడు.. గతంలో ముంబై రంజీ జట్టు తరపున క్యాప్టెన్ గా ఆడి ఓడిపోతుందనుకున్న మ్యాచును పట్టుదలతో ఆడి గెలిపించానని, అందువల్ల నిరాశను దరి చేరనివ్వకండి .. గెలుపు లక్ష్యంగా మైదానంలో దిగండి అని హితబోధ చేసాడు

టీమిండియా గెలుపు వెనుక ఆయన మాటలు తారక మంత్రంలా పనిచేసాయి

అంతే నిరాశను పక్కనబెట్టి రెట్టించిన ఉత్సాహంతో ఆడి ప్రపంచ కప్ ను సాధించారు

కప్ గెలవగానే హర్మన్ ప్రీత్ గురూజీ అంటూ పరుగున వెళ్లి మొదట తన కోచ్ పాదాలను కన్నీటితో అభిషేకించింది
మజుందార్ కూడా ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు

టీమిండియా జట్టు జెర్సి వేసుకోవాలనే తన కోరిక నెరవేరకపోయినా తన శిష్యురాలు కప్ గెలిచి చేతిలో పెట్టడంతో గర్వంగా తల పైకెత్తాడు అమోల్ మజుందార్ !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *