ఏషియ‌న్ మ‌స్క్యూలో స్కెలిట‌ల్ సొసైటీ అధ్య‌క్షునిగా ప్ర‌ముఖ రేడియాల‌జిస్టు డాక్ట‌ర్ వి.ఎన్‌.వ‌రప్ర‌సాద్

Spread the love

ఏషియ‌న్ మ‌స్క్యూలో స్కెలిట‌ల్ సొసైటీ అధ్య‌క్షునిగా ప్ర‌ముఖ రేడియాల‌జిస్టు డాక్ట‌ర్ వి.ఎన్‌.వ‌రప్ర‌సాద్

ఇటీవ‌ల సింగ‌పూర్‌లో జ‌రిగిన 27వ వార్షిక స‌మావేశంలో బాధ్య‌త‌లు స్వీక‌రణ‌

అభినందించిన వ‌ర ప్ర‌సాద్ మిత్రులు, శ్రేయోభిలాషులు

విజ‌య‌వాడ‌:- ఏషియ‌న్ మ‌స్క్యూలో స్కెలిట‌ల్ సొసైటీ అధ్య‌క్షునిగా ప్ర‌ముఖ రేడియాల‌జిస్టు డాక్ట‌ర్ వి.ఎన్‌. వ‌రప్ర‌సాద్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం శుభ‌ప‌రిణామం అని ప‌లువురు వ‌క్త‌లు ప్ర‌శంసించారు.

డాక్ట‌ర్ వేమూరి నాగ వ‌రప్ర‌సాద్ ఏషియ‌న్ మ‌స్క్యూలో స్కెలిట‌ల్ సొసైటీ నూతన అధ్య‌క్షునిగా నియామ‌కం కావ‌డం, బాధ్య‌త‌లు స్వీక‌రించిన సంద‌ర్భంగా ఇండియ‌న్ రేడియాల‌జి అండ్ ఇమేజింగ్ అసోసియేష‌న్ జాతీయ ఉపాధ్య‌క్షులు డాక్ట‌ర్ జి.వి.మోహ‌న్ ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో మ‌హాత్మాగాంధీ రోడ్డులోని హోట‌ల్ మిన‌ర్వాలో బుధ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో డాక్ట‌ర్ వ‌ర ప్ర‌సాద్‌ను ఘ‌నంగా స‌త్క‌రించి అభినంద‌న‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ జి.వి.మోహ‌న్ ప్ర‌సాద్ మాట్లాడుతూ” డాక్ట‌ర్ వేమూరి నాగ వ‌రప్ర‌సాద్ గ‌తంలో ఇండియ‌న్ కాలేజ్ ఆఫ్ రేడియాల‌జీ అండ్ ఇమేజింగ్ (ఐసీఆర్ఐ) అధ్య‌క్షునిగా మ‌రియు ఇండియ‌న్ రేడియాల‌జీ అండ్ ఇమేజింగ్ అధ్య‌క్షులుగా కూడా ప‌ద‌వీ బాధ్య‌త‌లు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు.
అదేవిధంగా ఏషియ‌న్ మ‌స్క్యూలో స్కెలిట‌ల్ సొసైటీ అధ్య‌క్షునిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌క ముందు ఈ సంఘానికి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌గాను మ‌రియు ప్రెసిడెంట్ ఎల‌క్ట్‌గా కూడా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు పేర్కొన్నారు.
ఈ ప‌ద‌వి నిర్వ‌హిస్తున్న మొట్ట‌మొద‌టి భార‌తీయ రేడియాల‌జిస్టుగా డాక్ట‌ర్ వి.ఎన్‌.వ‌ర‌ప్ర‌సాద్ ఎంపిక కావ‌డం దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు.

డాక్ట‌ర్ వి.ఎన్‌.వ‌ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ” వివిధ దేశాల‌లో గ‌ల సొసైటీలు మ‌రియు రేడియాల‌జీలోని మ‌స్క్యూలో స్కెలిట‌ల్ విభాగంలో ఉన్న ప‌ద్ద‌తుల మ‌ధ్య‌లో అంత‌రాల‌ను స‌రిచేస్తూ వాటిని అనుసంధానం చేయ‌డం అనే నినాదంతో సింగ‌పూర్‌లో నిర్వ‌హించిన 27వ వార్షిక స‌మావేశంలో ఎన్నికైన తాను, వ‌చ్చే రెండేళ్ళ‌లో ఈ థీమ్ ల‌క్ష్యాన్ని నెర‌వేరుస్తాన‌ని తెలిపారు.

వివిధ వ్యాధి నిర్ధార‌ణ ప‌ద్ద‌తుల మ‌ధ్య‌న ఉన్న హ‌ద్దుల‌ను తొల‌గిస్తూ ఒక నిర్ణ‌యానికి రావ‌డం దీనిపై ప్ర‌పంచ స్థాయిలో అవ‌గాహ‌న పెంపొందించేందుకు ఆసియా ఖండంలోని వివిధ దేశాల మ‌స్క్యూలో స్కెలిట‌ల్ రేడియాల‌జీ సంఘాల మ‌ధ్య అనుసంధాన క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించేందుకు తాను నిరంత‌రం కృషి చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

శ‌రీరంలోని కీళ్లు, కండ‌రాలు, ఎముక‌లతో కూడిన ఈ మ‌స్క్యూలో స్కెలిట‌ల్ విభాగం వ్యాధి నిర్థార‌ణ‌లో ఆధునిక ప‌ద్ద‌తులైన ఆర్టిషిఫీయ‌ల్ ఇంటిలిజెన్స్ (కృత్రిమ మేథ‌)తో నూత‌నంగా రూపొందించిన సిటీస్కాన్‌, ఎమ్మారై, అల్ట్రాసౌండ్ వంటి ప‌రిక‌రాలు మ‌స్క్యూలో స్కెలిట‌ల్ రేడియాల‌జీ వైద్యంలో కీల‌క పాత్ర వ‌హిస్తాయ‌ని తెలిపారు.

ఈ విధానాల‌పై స‌మావేశంలో వివిధ దేశాలు నుండి హాజ‌రైన నిష్ణాతులు చ‌ర్చించార‌ని పేర్కొన్నారు. సింగపూర్‌లో జరిగిన 27వ వార్షిక సమావేశంలో తాను ఏషియ‌న్ మ‌స్క్యూలో స్కెలిట‌ల్ సొసైటీ అధ్య‌క్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన‌ట్లు తెలిపారు.

పదవీకాలం రెండు సంవత్సరాలు పాటు ఉంటుంద‌ని, 2027 ఆగష్టు నెల వరకు తాను ఈ ప‌ద‌విలో కొన‌సాగుతాన‌ని పేర్కొన్నారు.

సమావేశంలో ఐఆర్ ఐఏ , సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ చలసాని కులదీప్, ఐఆర్ఐ ఏ విజయవాడ చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ బి. రాజ్ కుమార్ పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!