గోవా గవర్నర్ గా అశోకగజపతి రాజు శనివారం ప్రమాణస్వీకారం చేసారు .. అయితే ఓ దృశ్యం అందర్నీ ఆకర్శించింది !
కేంద్రమాజీ మంత్రి పూసపాటి అశోకగజపతి రాజు గోవా గవర్నర్ గా శనివారం ప్రమాణ స్వీకారం చేసారు
పనాజీలో రాజ్ భవన్ లో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు
ఇది మాములు వార్తే
అయితే ఈ క్రమంలో ఓ దృశ్యం చూపరులను ఆకర్శించింది
గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు అశోకగజపతి రాజు తన బంగ్లాలో ఆశీనులై ఉండగా చుట్టూ ఆయన అభిమానులు కుర్చీలలో కూర్చున్నారు
అశోకగజపతి రాజు చాలా సింపుల్ గా ఉన్నారు
అందరిలానే మొబైల్ ఫోన్ లో సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో యేవో చూస్తున్నారు
ఆ సమయంలో ఆయన్ని చూస్తే మరికాసేపట్లో గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయబోయే వ్యక్తి ఈయనేనా అని అనుమానం కలుగుతుంది
ఎటువంటి హడావుడి లేకుండా మాములుగా ఉన్నారు
ఇంతలో ఆయన్ని అధికార లాంఛనాలతో రాజ్ భవన్ కు తీసుకెళ్లటానికి గవర్నర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి సెల్యూట్ చేసాడు
రాజు గారు యధాలాపంగా ఆయనని చూసి ‘ వెల్ కం .. వెల్ కం ‘ అని సాదరంగా ఆహ్వానించడంతో ఆయన ముఖంలో ఆశర్యం కనిపించింది
గవర్నర్ అంటే పొలైట్ గా గంభీరంగా ఉంటారనుకుంటే ఈయనేంటి ఇంత సింపుల్ గా క్యాజువల్ గా ఉన్నాడు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు
ఆ సెక్యూరిటీ అధికారి యువకుడు కావడంతో రాజు గారు ఆయన్ని దగ్గరికి పిలిచి తన కుటుంబ సభ్యులను పరిచయం చేసారు
అనంతరం ఆ అధికారితో కారు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా తన అభిమానులను సైతం ఆయనకు పరిచయం చేయడం ఆశర్యం కలిగించింది
మాములుగా గవర్నర్లు ప్రోటోకాల్ మర్యాదలు పాటిస్తారు
సెక్యూరిటీ అధికారి డోర్ ఓపెన్ చేసిన తర్వాతనే కారులో కూర్చుంటారు
అది కూడా గవర్నర్ వెనుక సీట్లో కూర్చుంటే సెక్యూరిటీ అధికారి ముందు సీట్లో కూర్చుంటాడు
కానీ రాజు గారి స్టైలే వేరు
సింపుల్ గా కారు డోర్ తానే తీసుకుని ముందు సీటులో కూర్చున్నారు
ఇంత సింపుల్ గా ఉండే గవర్నర్ ను బహుశా ఆ సెక్యూరిటీ అధికారి ఇంతవరకు చూసి ఉండడు !
పరేష్ తుర్లపాటి