
ఆదివారం పొద్దున్నే విజయవాడ అలంకార్ సెంటర్లో జరిగే గారడీలు చూసారా ? దీన్నే కూటి కోసం కోటి విద్యలు అంటారేమో ?
ఆదివారం వస్తే చాలు విజయవాడ వాసులు అలంకార్ థియేటర్ సెంటర్లో గుమిగూడుతారుఅలా గుమిగూడిన జనంలో నేను కూడా ఉండేవాడినిజనం అలా గుమిగుడటానికి ఓ కారణం ఉంది పొద్దున్నే అలంకార్ థియేటర్ సెంటర్లో ఓ మూల మీద పాముల బుట్టతో ఓ కుటుంబం చేసే చిత్ర విచిత్ర టక్కుటమార గారడీలు మొదలౌతాయి భార్యా భర్త ఇద్దరు పిల్లలు గారడీ విద్యలను ప్రదర్శిస్తారు ఈ గారడీ ప్రదర్శనలో భాగంగా మొదట బుట్టలో పాములను బయటికి తీసి నాగ స్వరం ఊది…