
“రేయ్ ! యెవర్రా మీరంతా ? కారులో ప్రకాశం పంతులు గారు ఉన్నారు వెళ్లిపోండి” అని అరిచారు బులుసు సాంబమూర్తి గారు
ఒకసారి ప్రకాశం పంతులు గారు బులుసు సాంబమూర్తి గారితో కలిసి పనిమీద కారులో మద్రాస్ బయలుదేరారు ముందు సీట్లో డ్రైవర్ పక్కన గుమస్తా కూర్చోగా వెనుక ప్రకాశం గారు..సాంబమూర్తి గారు కూర్చున్నారు ప్రయాణం రాత్రి పూట కావటంతో వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరూ నిద్రలో కునికిపాట్లు పడుతున్నారు ఇంతలో దారిలో సడెన్ గా దోపిడీ దొంగలు రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి కారును ఆపారు డ్రైవర్ సడెన్ గా కారును ఆపటంతో మెలుకువ వచ్చిన సాంబమూర్తి గారు…