మళయాళం దర్శకులకు చిన్న పాయింట్ దొరికితే చాలు మొత్తం కధంతా అల్లుకుపోతారు
ఇంతకుముందు కూడా చాలా సినిమాల్లో వాళ్ళు ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు
ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ హర్రర్ మూవీస్ లో ఈ స్టైల్ కనిపిస్తుంది
గతంలో ఇదే మళయాళ దర్శకులు పేపర్లో వచ్చిన చిన్న మర్డర్ వార్త పట్టుకుని రెండున్నర గంటల సినిమా తీసేసారు
అది కూడా పెద్ద బడ్జెట్ కాదు
ఓ యాభై కోట్లు ఖర్చుపెట్టి 150 కోట్ల వసూళ్లు రాబట్టుకున్నారు
అలా అని తెలుగు దర్శకులకు సినిమాలు తీయడం రాదని అర్ధం కాదు
తెలుగులో కూడా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తీసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన దర్శకులు ఉన్నారు
కాకపోతే ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ లో మళయాళ సస్పెన్స్ మూవీల్లో కొంచం గ్రిప్పింగ్ ఎక్కువగా ఉంటుంది
కాకపోతే తెలుగులో సస్పెన్స్ మూవీలు చకచకా నడిస్తే మళయాళంలో స్లోగా నడుస్తాయి
సస్పెన్స్ టెంపో మెయింటైన్ చేయడం కోసం నిదానంగా ఒకటొకటిగా ట్విస్టులు రివీల్ చేసుకుంటూ పోయి క్లైమాక్సులో అసలు విషయం చెప్తాడు
అదొక్కటి ఓపిగ్గా భరించాలి
సరే ఈ మధ్యన నివిన్ పౌలి అనే హీరో నటించిన సర్వం మాయ మళయాళంలోనే కాదు తెలుగులో కూడా మంచి ఆదరణ పొందింది
అందులో నటించిన నివిన్ పౌలి నటన పరంగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు
అదే నటుడినుంచి వచ్చిన మరో మూవీ బేబీ గర్ల్ కావడంతో సహజంగా ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఏర్పడతాయి
ఎవరిదాకో ఎందుకు ?
నేనే అనుకున్నా
సర్వం మాయ సినిమాలో నితిన్ పౌలి బాగా చేసాడు కదా ? ఈ సినిమా కూడా చూస్తే పోలా అనుకుని సోని లివ్ లో ఈ మళయాళం మూవీని హిందీ ఆడియోలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో చూసా
ఇంతకీ బేబీ గర్ల్ కధేంటి ?
మళయాళం సస్పెన్స్ మూవీల్లో రివ్యూలు రాసేటప్పుడు కథ గురించి రాయడం చాలా కష్టం
ఎందుకంటే ముందే చెప్పినట్టు వాళ్ళు చిన్న పాయింటుని పట్టుకుని సాలీడు గూడు అల్లేస్తారు
అలా అని కథ మొత్తం చెప్తే సస్పెన్స్ ఏమీ ఉండదు
ఇలాంటి సినిమాలు థియేటర్లో చూస్తేనే బాగుంటాయి
వీలుకాని వాళ్ళు ఎలాగూ ఓటిటీ లో చూస్తారు
సింపుల్ గా చెప్పాలంటే బేబీ గర్ల్ కథ మిస్సింగ్ గర్ల్ కేసు
మిస్సింగ్ బేబీ గర్ల్ అనేది కూడా కొత్త పాయింట్ ఏమీ కాదు
నిజ జీవితంలో కూడా గతంలో చాలా హాస్పిటల్స్ లో జరిగాయి
అయినా అదే పాయింటుతో దర్శకుడు సరికొత్తగా ఇన్వెస్టిగేషన్ నడిపించాడు
బేబీ గర్ల్ మాయం వెనుక ఎవరున్నారు అని మనకు రకరకాల క్యారెక్టర్ల మీద అనుమానం వచ్చేలా సన్నివేశాలు నడిపి చివర్లో ట్విస్ట్ రిలీజ్ చేసారు
కాకపోతే మనకు కొన్ని ట్విస్టులు ముందే తెలిసిపోవడమనేదే మైనస్ ట్విస్ట్
సనల్ మాధ్యు ( నివిన్ పౌలి ) ఓ హాస్పిటల్లో అటెండెంట్ గా పనిచేస్తూ ఉంటాడు
అయితే అనుకోని పరిస్థితుల్లో అతడు పనిచేసే హాస్పిటల్ నుంచి మూడు రోజుల వయసున్న బేబీ గర్ల్ మాయం అవుతుంది
ఇక అక్కడ్నుంచి బేబీ గర్ల్ మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలౌతుంది
నిజానికి గర్ల్ మిస్సింగ్ సమయంలో సనల్ మాధ్యు హాస్పిటల్లో ఉండడు
బురఖా ధరించిన ఒక మహిళ మీద తనకు అనుమానం ఉన్నట్టుగా పోలీస్ విచారణలో సనల్ చెప్తాడు
పోలీసులు కూడా బురఖా ధరించిన మహిళ మీదే అనుమానపడి ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు
ఆ మహిళే నిందితురాలు అయితే ఇక కథేముంటుంది ?
అందుకే ఇక్కడో ట్విస్ట్ పెడతారు
అసలు సనల్ మాధ్యునే బేబీ గర్ల్ ను కిడ్నాప్ చేసి ఉండొచ్చు కదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెడతారు
చివరకు ఎవరైతే ఫిర్యాదు చేసారో అతడినే కిడ్నాపర్ గా పోలీసులు భావించే పరిస్థితులు వచ్చాయి
ఈ పరిస్థితుల్లో సనల్ మాధ్యు ఏం చేస్తాడు ?
పోలీసులకు తన మీద అనుమానం రావడంతో మిస్సింగ్ కేసు గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు ?
మూడు రోజుల పసికందు మాయం వెనుక ఎవరున్నారు ?
రీతు , రిషి అనే అక్కచెల్లెళ్లకు పసికందుకు ఉన్న సంబంధం ఏంటి ?
ఈ మిస్టరీలో వాళ్ళ పాత్ర ఏంటి ? అనేది మిగిలిన కథలో తెలుస్తుంది
ఎలా ఉంది ?
కథ పరంగా చెప్పుకోవడానికి బేబీ గర్ల్ మిస్సింగ్ కథ అని సింపుల్గా అనిపించినా ఇందులో కథ కన్నా కథనానికి ఎక్కువ మార్కులు పడతాయి
అదే ఈ సినిమాకి మ్యాజిక్కు
హాస్పిటల్లో పసికందు మాయం , పోలీసుల విచారణ , సిసి ఫుటేజీల పరిశీలన , కొంతమంది నిందితుల మీద అనుమానం , ఫైనల్లీ నిందితుడి అరెస్ట్ అనే వార్తలు గతంలో మీడియాలో చాలా చూసి ఉంటాం
ఇందులో కొత్త పాయింట్ ఏముంది ?
తెలిసిన విషయమేగా అనిపిస్తుంది
కానీ సినిమా చూడటం మొదలుపెట్టిన తర్వాత బేబీ గర్ల్ మిస్సింగుతో మిస్టరీలోకి వెళ్తాము
మరి ఈ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదిస్తారు అనే క్యూరియాసిటీ కలుగుతుంది
అదే సమయంలో ఈ మిస్టరీని ఛేదించడానికి హీరో కూడా రంగంలోకి దిగడంతో కేసు తాలూకు ఇంటెన్సిటీ పెరుగుతుంది
మూవీ చూస్తున్న ప్రేక్షకుడు ఆటోమేటిగ్గా కొంత సస్పెన్స్ థ్రిల్ ఫీల్ అవుతాడు
మొదట్లో మనకు అదే ఫీల్ వస్తుంది
కాకపోతే ఆ ఫీల్ ఎక్కువసేపు నిలబడదు
కొన్ని సన్నివేశాల్లో ట్విస్ట్ మన ఊహకు ముందే అందుతుంది
ఊహించిన విధంగానే జరిగితే ఇక తరువాతి సన్నివేశంలో థ్రిల్ ఏముంటుంది ?
ఈ విషయంలో దర్శకుడు ఇంకొంచం శ్రద్ద పెట్టి ఉండాల్సింది
బేబీ గర్ల్ మిస్సింగ్ కేసులో సనల్ మాధ్యు ఇన్వెస్టిగేషన్ పోలీసుల దర్యాప్తుని మించిపోయింది
మాములుగా మళయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీల్లో చివరివరకు ఆ టెంపో మెయింటైన్ చేస్తారు
కానీ పకడ్బందీ అయిన స్క్రీన్ ప్లే లోపమేమో మూవీలో కొద్దిగా గ్రిప్పింగ్ తగ్గినట్టు అనిపించింది
హీరోతో పాటు మిగిలిన ముఖ్యమైన పాత్రలకు కూడా మరింత స్కోప్ ఉండేవిధంగా కొంచం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది
ఎవరెలా చేసారు ?
సినిమాలో మొత్తమ్మీద నాలుగు క్యారెక్టర్ల చుట్టూనే కథ ఎక్కువగా నడుస్తుంది
సర్వం మాయలో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్న నివిన్ పౌలి ఇందులో కూడా చక్కటి పెర్ఫార్మన్స్ ప్రదర్శించాడు
నిజానికి హాస్పిటల్ అటెండెంట్ పరంగా చూస్తే ఇందులో నివిన్ పౌలీకి ఫేమ్ వచ్చేంత పెద్ద క్యారక్టర్ ఏమీ కాదు
అయినా ఇమేజ్ ఛట్రం లో కూరుకుపోకుండా ఎటువంటి పాత్రలో అయినా నటించగలని నిరూపించుకున్నాడు
మిగిలినవారిలో లిజోమోల్ జోస్ , సంగీత్ ప్రతాప్ ల నటన బాగుంది
బీజీఎమ్ కూడా బాగానే ఉంది
ఫోటోగ్రఫీ మీద ఇంకొంచం శ్రద్ద పెట్టి ఉండాల్సింది
విశ్లేషణ :
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి బేబీ గర్ల్ నిరాశపరచదు. మళయాళంలో బాబీ ,సంజయ్ వంటి ప్రముఖ రైటర్ల కలం నుంచి వచ్చిన కథను తెరకెక్కించడంలో అక్కడక్కడా దర్శకుడు కొంచం తడబడినట్టు అనిపించినా బోర్ కొట్టేంత ఏమీ ఉండదు. బానే ఉంటుంది . కాకపోతే తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఉండి ఉంటే ఇంకాస్త బాగుండేది
నటీనటులు : నివిన్ పౌలి , లిజోమోల్ జోస్ , సంగీత్ ప్రతాప్ తదితరులు
దర్శకత్వం : అరుణ్ వర్మ
విడుదల : సోని లివ్ ఓటిటీ (12 -2 -2026 )
రేటింగ్ : 2 .5 / 5
