గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానం బయలుదేరటానికి సిద్ధంగా ఉంది
విమానంలో కూర్చున్న రాజస్థాన్ కు చెందిన భార్య , భర్త ముగ్గురు పిల్లలతో కలిసి సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీ దిగారు
కానీ వారి జీవితంలో అదే ఆఖరి సెల్ఫీ అవుతుందని ఆ క్షణాన వారికి తెలీదు
అందరి ముఖాల్లో సంతోషం వెలిగిపోతుంది
ఆ సంతోషాలకు కారణం ఉంది
రాజస్థాన్ కు చెందిన డాక్టర్ కోమి వ్యాస్ , డాక్టర్ ప్రతీక్ జోషికి పదేళ్ల క్రితం పెళ్లయింది
భార్యా భర్తలు రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఓ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు
ఎనిమిదేళ్ల కూతురు.. ఐదేళ్ల కొడుకులు (కవలలు ) లతో చక్కటి సంసారం హాయిగా నడుస్తుంది
అయితే కొంతకాలం క్రితం జోషి లండన్ వెళ్లారు
అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుని భార్యా పిల్లలను కూడా లండన్ తీసుకెళదామని రెండు రోజుల క్రితమే ఇండియా వచ్చాడు
గురువారం మధ్యాహ్నం లండన్ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకుని సంతోషంగా విమానం ఎక్కారు
హాయిగా నవ్వుతూ సెల్ఫీ దిగారు
అందరి ముఖాల్లో సంతోషానికి ఇదే కారణం
లండన్ లో కొత్త జీవితం .. కోటి ఆశలు
కానీ విధి రాత ఇంకోలా ఉందని ఆ కుటుంబానికి తెలీదు
నవ్వుతూ సెల్ఫీ దిగిన కాసేపటికే మృత్యు ఒడిలో వాలిపోయారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఫ్యామిలీ పిక్స్ వైరల్ అవుతున్నాయి
అందమైన ఆ కుటుంబ ఆఖరి సెల్ఫీ చూసి కంట తడి పెట్టని వారు లేరు !
పరేష్ తుర్లపాటి