బెజవాడ రుచులు -1

Spread the love

బెజవాడ రుచులు -1

ప్రతి ఊరుకి ఏదో ఒక చరిత్ర ఉంటుంది
ఏదో ఒక రంగంలో ఫేమస్ అవుతుంది

కొన్ని ఊర్లు రాజకీయంగా .. మరికొన్ని ఊర్లు సాంస్కృతికంగా .. గుడులు .. బడులు .. సినిమాలు .. హోటళ్లు ఇలా ఒక్కో రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాయి

అలా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో విజయవాడ రాజకీయ , సాంసృతిక కళలకు జంక్షన్ గా ఉండేది
అందులో భాగంగా బెజవాడ రుచుల గురించి రచ్చబండలో చెప్పుకుందాం

నేను విజయవాడలో చదివేటప్పుడు తరుచూ మిత్రులతో గాంధీ నగర్లో వెల్ కం హోటల్ ఎదురుగా ఉన్న గురు హోటల్ కి వెళ్ళేవాడ్ని
ఎందుకో అనుకుంటున్నారు కదూ
పరోటాలు తినటానికి

వెల్ కం హోటల్ కి కూడా టిఫినీకి వెళ్ళేవాడ్ని కానీ పరోటా మాత్రం గురు హోటల్లోనే బావుండేది..మరీ ముఖ్యంగా చారువా
చారువా వల్ల పరోటాలకు టేస్ట్ వచ్చేది
గురు హోటల్ ఓనర్ కేరళ నుంచి వచ్చినట్టు గుర్తు

అతడి ఫార్ములా ఏంటో కానీ టిఫినీలలో అక్కడ కేవలం పరోటాలే ఎక్కువ నడిచేది
హోటల్ కూడా హైద్రాబాద్ ఇరానీ ఛాయ్ కేఫ్ లా ఉంటుంది
కానీ ఎప్పుడూ ఫుల్లుగా ఉండేది

అలాగే బందరు రోడ్డులో విజయ కృష్ణా సూపర్ బజార్ ఎదురుగా గోల్డెన్ పెవిలియన్ రెస్టారెంట్ ఉండేది
ఇక్కడ బిర్యానీ స్పెషల్

ఎన్వీ కావటం వల్ల నేను తినలేదు కానీ ఓనర్ మజీద్ భాయ్ తో ఉన్న పరిచయం వల్ల తరుచూ వెళ్ళేవాడ్ని
అన్నదమ్ములు హోటల్ మెయింటైన్ చేస్తున్నా కూడా ఫుడ్ ఫార్ములా మాత్రం మజీద్ గారిదే

నేను ఎప్పుడు వెళ్లినా పరేష్ భాయ్ మా బిర్యానీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి అని ఆత్మీయంగా అడిగేవారు
నేను తినను కానీ స్మెల్ బట్టి చెప్పేస్తా మీ బిర్యానీ ఎలా ఉంటుందో అని చెప్పేవాడ్ని

కిచెన్ లో కుక్ లు ఉన్నప్పటికీ ఫస్ట్ మజీద్ స్వయంగా కిచెన్లోకి వెళ్లి కావాల్సిన దినుసులు అవీ ఫార్ములా ప్రకారం వేసి టేస్ట్ చేసిన తర్వాతే ఆర్డర్ సర్వ్ చేయబడేది

పాకిస్తాన్ నుంచో కాశ్మీర్ నుంచో గుర్తులేదు కానీ అల్లం తెప్పిస్తారట
మనకు ఇక్కడ దొరికే అల్లం కన్నా ఆ అల్లం చాలా ఫ్లేవర్ గా ఉంటుందని చెప్పారు

అలా ఆహార పదార్దాల్లో వాడే దినుసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వివిధ చోట్లనుంచి తెప్పిస్తుంటానని అదే ఈ రెస్టారెంట్లో ఫుడ్ విజయ రహస్యమని చెప్పారు

గోల్డెన్ పెవిలియన్ రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్లను చూస్తుంటే ఆయన చెప్పింది నిజమే అనిపించింది

మరీ ముఖ్యంగా ఈ రెస్టారెంట్ కి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు ఇతర అధికారులు ఫ్యామిలలతో సహా వచ్చేవాళ్ళు

ఇందుకు ఫుడ్ బాగుండటం ఒక కారణం అయితే విజయవాడలో థియేటర్లలో నవరంగ్ ఎన్విరాన్మెంట్ ఎంత బాగుంటుందో ఇక్కడ కూడా ఎన్విరాన్మెంట్ అంత బాగుండటం మరో కారణం

విజయవాడలో మరిన్ని రుచుల వడ్డన కోసం చూస్తూనే ఉండండి రచ్చబండ కబుర్లు !
పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!