Home » అంధుడైన అతడ్ని పుట్టుకతోనే చంపేయమన్నారు .. నేడు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయి హేళన చేసినవారికి సవాల్ విసిరాడు శ్రీకాంత్ బొల్లా!

అంధుడైన అతడ్ని పుట్టుకతోనే చంపేయమన్నారు .. నేడు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయి హేళన చేసినవారికి సవాల్ విసిరాడు శ్రీకాంత్ బొల్లా!

Spread the love

అంధుడైన అతడ్ని పుట్టుకతోనే చంపేయమన్నారు .. నేడు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయి హేళన చేసినవారికి సవాల్ విసిరాడు శ్రీకాంత్ బొల్లా

పుట్టుకతో అంధుడైన శ్రీకాంత్ బొల్లాది ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం దగ్గర సీతారామ పురం గ్రామం
1991 లో ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు

పుట్టుకతోనే అంధుడు కావడంతో పెంపకం భారం అవుతుందని ఆ పిల్లవాడ్ని చంపేయమని బంధువులు సలహా ఇచ్చారు

కానీ తల్లితండ్రులు మాత్రం అంధుడైతేనేమి వాడు తమ బిడ్డని కూలీనాలీ చేసైనా పెంచుతామని తెగేసి చెప్పేసారు

తనకోసం తల్లితండ్రులు పడుతున్న శ్రమను పిల్లవాడు గుర్తించాడు

ఊహ తెలిసిన రోజే అతడు నిర్ణయించుకున్నాడు

ఏ నాటికైనా బాగా చదివి తల్లితండ్రులను భోగ భాగ్యాలతో ఏ లోటూ లేకుండా చూసుకోవాలని నిశ్చయించుకున్నాడు

ఆరేళ్ళ వయసులో తల్లి సాయంతో ప్రతిరోజూ కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి స్కూల్ లో చదువుకునేవాడు

చదువు మీద అతడికున్న శ్రద్ద చూసి తల్లి కూడా ఎంతగానో ప్రోత్సహించేది

ఎనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ లో అంధ విద్యార్థులు చదువుకునే బోర్డింగ్ స్కూల్ లో సీట్ వచ్చింది

దాంతో శ్రీకాంత్ గ్రామాన్ని , తల్లితండ్రులను విడిచిపెట్టి హైదరాబాద్ బోర్డింగ్ స్కూల్ లో చేరాడు

అక్కడే చదువుతో పాటు ఈత కొట్టడం , చెస్ ఆడటం వంటి ఆటల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాడు

అలా చదువుకుంటూ టెన్త్ క్లాస్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు

భవిష్యత్తులో ఇంజనీర్ కావాలనేది శ్రీకాంత్ కోరిక

ఇంజనీరింగ్ చదవాలంటే సైన్సు , మాథ్స్ సబ్జక్ట్స్ చదవాలి కాబట్టి కాలేజీ యాజమాన్యం అతడికి సీట్ ఇవ్వడానికి నిరాకరించింది
అయినా శ్రీకాంత్ నిరుత్సాహ పడలేదు

కోర్టులో న్యాయ పోరాటం చేసాడు

6 నెలల విచారణ తర్వాత కోర్ట్ కూడా చదువుకోవాలనే శ్రీకాంత్ పట్టుదల చూసి సైన్సు లో చదువుకోవడానికి అతడికి సీట్ ఇవ్వాల్సిందిగా కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించింది

ఇతడేం చదవగలడులే అనుకున్న వాళ్ళని ఆశర్య పరుస్తూ ఇంటర్లో 98 శాతం మార్కులతో శ్రీకాంత్ కాలేజీ టాపర్ అయ్యాడు

ఐఐటి నుంచి ఇంజనీరింగ్ చదవాలనుకుని దరఖాస్తు చేసుకున్నాడు

కానీ అంధుడైన కారణంగా శ్రీకాంత్ కు సీట్ రాలేదు

అయినా శ్రీకాంత్ నిరాశ పడలేదు

ఏకంగా అమెరికాలోని ఐదు ప్రముఖ యూనివర్సిటీలకు అప్లయ్ చేసాడు

అమెరికాలో టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన మసాచ్యూట్ యూనివర్సిటీలో శ్రీకాంత్ కు సీటొచ్చింది

ఈ యూనివర్సిటీలో సీట్ వచ్చిన మొట్టమొదటి అంతర్జాతీయ అంధ విద్యార్థి శ్రీకాంత్ బొల్లా

అక్కడే మేనేజ్మెంట్ సైన్సు కంప్లీట్ చేసిన శ్రీకాంత్ కు జాబ్ కూడా వచ్చింది

కానీ ఇండియాలో ఏ యూనివర్సిటీ తనకు సీట్ ఇవ్వకపోయినా కూడా అతడు అదేమీ మనసులో పెట్టుకోకుండా మాతృ దేశానికి సేవ చేయాలనుకుని ఇండియాకు తిరిగొచ్చేశాడు

2012 లో ఇండియాకు తిరిగొచ్చేశాడు

ఇండియాలో బొల్లాంట్ అనే పేరుతొ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ స్థాపించాడు

తాటి ఆకులతోనూ , ఇతర పర్యావరణ ఉత్పత్తులతోనూ ప్యాకేజింగ్ మెటీరియల్ తయారుచేయడం ఈ సంస్థ ప్రత్యేకత

ఇందుకోసం తన సంస్థలో మూడొందలమందికి పైగా వికలాంగులకు అవకాశం కల్పించాడు

వారిలో ముప్పై ఏళ్లలోపు వాళ్ళు ముప్పై మంది ఉండటంతో ఫోర్బ్ మ్యాగజైన్ శ్రీకాంత్ స్థాపించిన ఇండస్ట్రీ కవర్ పేజీ గా 2017 లో ఒక ఆర్టికల్ ప్రచురించింది

2022 లో స్వాతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చాడు

శ్రీకాంత్ బొల్లా జీవిత చరిత్ర ఆధారంగా 2024 లో బాలీవుడ్ లో సినిమా కూడా రిలీజ్ అయ్యింది

పుట్టుకతో అంధుడైనా తన లోపానికి కుంగిపోక , అవమానాలను , హేళనలను ఎదుర్కొని పట్టుదలతో చదువుకుని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయినా శ్రీకాంత్ బొల్లా జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *