మొదటి ఫొటో “రెండు రెళ్ళు ఆరు” సినిమా శతదినోత్సవ సభలో మాట్లాడుతున్నప్పటిది, పక్కనే చేతులు కట్టుకుని నిలబడింది యస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు
రెండవది రెండు రెళ్ళు ఆరు సినిమాలో హిప్నాటిస్టు పట్టాభిరామ్ గా ఆయన నిజజీవిత పాత్రను పోషిస్తున్న సందర్భలోనిది, పక్కనే సుత్తి వీరభద్రరావు గారు ఉన్నారు, పట్టాభిరామ్ గారికి సీన్ వివరిస్తున్నారు దర్శకులు జంధ్యాల గారు
రెండు రెళ్ళు ఆరు (1986) సినిమాలో ఐరావతం (సుత్తి వీరభద్రరావు) భార్య లలితకు ఎప్పటికైనా గొప్ప గాయని కావాలనే కోరిక ఉంటుంది, కానీ ఆమె గాత్రం మాత్రం డబ్బాలో కంకర రాళ్ళను వేసినట్టుగా ఉంటుంది, రోజూ ఆమె చేసే సాధనతో విసిగి వేసారిపోయిన ఐరావతం హిప్నాటిజం ద్వారా తన భార్యకు నయం చేయిస్తాడు
జంధ్యాల గారి ఆలోచనో మరి ఎవరి ఐడియానో తెలియదు గానీ హిప్నాటిస్టు పాత్రకు వేరే వారిని తీసుకోకుండా, నిజజీవితంలో హిప్నాటిస్ట్ అయిన పట్టాభిరామ్ గారితోనే ఆ క్యారెక్టర్ చేయించారు
ఈ సినిమా చూసే వయసు నాటికి హిప్నాటిజం అంటే ఏంటో తెలీదు, పట్టాభిరామ్ అనే వ్యక్తి గురించి తెలియదు, ఈ సినిమా ద్వారానే నాకు తెలిసింది ఆయన ప్రఖ్యాత ఇంద్రజాలికుడు మరియు వ్యక్తిత్వ వికాస నిపుణులు అని, అన్నట్టు ఆయన వాయిస్ చాలా విభిన్నంగా ఉంటుంది
విచిత్రం ఏంటంటే పై ఫోటోలో ఉన్నవారు కింది ఫొటోలో ఉన్నవారు ఇప్పుడు మన మధ్యలేరు, జీవించి లేరు, కానీ ఇలాంటి లెజెండ్స్ కి ఎప్పటికీ మరణం లేదు, వీళ్ళు అమరులు..!!
బీవీ పట్టాభిరామ్ పూర్తి పేరు భావరాజు వెంకట పట్టాభిరామ్ . ఆయన స్వస్థలం తూర్పుగోదావరి .
ఆయన వ్యక్తిత్వ వికాస నిపుణుడు , హిప్నాటిస్టు , మెజీషియన్ మాత్రమే కాదు నటుడు కూడా . తెలుగు , ఇంగ్లీష్ కన్నడ , తమిళ భాషల్లో ఎన్నో మోటివేషనల్ పుస్తకాలు రాసారు
సెల్ఫ్ హిప్నాటిజం , వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై ఆయన దేశ విదేశాల్లో వర్క్ షాపులు నిర్వహించారు
హిప్నటిజంలో ఆయన చేసిన కృషికి ఫ్లోరిడా యూనివర్సిటీ 1983 లో ఆయనకు గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చింది
ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడు , హిప్నాటిస్ట్ బీవీ పట్టాభిరామ్ ( 75 ) జూన్ 30 సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు !
విశ్వ టాకీస్