సడెన్గా మీ స్మార్ట్ ఫోన్ కాల్ సెట్టింగ్స్ మారిపోయాయా ? డోంట్ వర్రీ .. ఇలా సెట్ చేసుకోండి !
ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్స్ ఇటీవల సడెన్గా కొన్ని ఫీచర్స్ దానంతట అదే మారిపోవడం గమనించే ఉంటారు
తమ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కాల్ , డయలర్ సెట్టింగ్స్ మారిపోవడంతో చాలామంది వినియోగదారులు అయోమయంతో పాటు ఆశ్యర్యానికి కూడా గురయ్యారు
ఈ మార్పులపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు
సాధారణంగా ఫోన్లో సెట్టింగ్స్ మార్చుకోవాలంటే వినియోగదారుని ప్రమేయం అవసరం ఉంటుంది
కానీ తమ ప్రమేయం లేకుండా థర్డ్ పార్టీ తమ ఫోన్ సెట్టింగులు మార్చేయడంతో యూజర్లు కన్ఫ్యూజ్ అయ్యారు
ఈ మార్పులు కేవలం ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మాత్రమే కనిపిస్తుంది
ios ఫోన్ యూజర్లకు ఎటువంటి మార్పులూ కనిపించలేదు
దానితో ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తమ ఫోన్లు హ్యాక్ అయ్యాయేమో అని ఆందోళన చెందారు
అసలేం జరిగింది ?
ఆండ్రాయిడ్ ఫోన్స్ కోసం గూగుల్ ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించింది
సమయానుకూలంగా గూగుల్ ఈ సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేస్తుంది
2025 మే లోనే మెటీరియల్ 3D ఎక్స్ప్రెస్ అనే సాఫ్ట్వేర్ ను తీసుకొస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది
ఈ కొత్త సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో డిస ప్లే వినియోగాన్ని మరింత సులభతరం చేస్తుందని గూగుల్ అప్పట్లోనే ప్రకటించింది
పాత వెర్షన్ కన్నా కొత్త వెర్షన్లో మరిన్ని ఫీచర్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు వారి సైట్లో పేర్కొన్నారు
అయితే జూన్ లో కొంతమంది ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల సాఫ్ట్వేర్ అప్డేట్ కాగా ఆగష్టు లో మరింతమంది వినియోగదారుల సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యింది
ఇలా ఆండ్రాయిడ్ ఫోన్స్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి యూజర్ల ప్రమేయం అక్కర్లేదు
గూగుల్ ఆటో అప్డేట్ ఫీచర్స్ లో భాగంగా వెర్షన్స్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి
కొత్త సాఫ్ట్వేర్ ప్రకారం మిస్సుడ్ కాల్స్ అన్నీ ఒకే చోట కనిపించవు
ప్రతి సెకనుకు వచ్చిన కాల్స్ టైం తో సహా సెపరేట్ గా చూపిస్తుంది
దీనివల్ల యూజర్ కాల్ హిస్టరీ మరింత మెరుగ్గా ఉంటుంది
ఈ అప్డేట్ లు అన్నీ గూగుల్ ఆధ్వర్యంలోనే జరిగేవి కాబట్టి యూజర్లు ఆందోళన చెందాల్సిన పని లేదు
సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్ ప్లే స్టోర్ సెట్టింగ్స్ లో ఆటో అప్డేట్ మోడ్ ఆన్ లోనే ఉంటుంది
ఈ మోడ్ ఆన్ లో ఉందంటే గూగుల్ తీసుకొచ్చే ఏ అప్డేట్ లు అయినా యూజర్ ప్రమేయం లేకుండా ఆటో అప్డేట్ అవుతాయి
ఒకవేళ యూజర్లు తమ ఫోన్ సెట్టింగులు మార్చటానికి ఇష్టపడకపోతే ఈ ఆటో అప్డేట్ లను ను ఆఫ్ చేసి అన్ ఇంస్టాల్ అప్డేట్స్ పై క్లిక్ చేస్తే మీ ఫోను పాత సెట్టింగులు ప్రకారమే కనిపిస్తుంది
ఈ విషయాలు తెలియక చాలామంది యూజర్లు కన్ఫ్యూజ్ అయ్యారు
ఈ అప్డేట్స్ అనేవి గూగుల్ ద్వారానే జరిగాయి కాబట్టి ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు !