
‘ నాన్నా ! త్వరలో ఉద్యోగం మానేసి నీ దగ్గరే ఉంటా ‘ అని మాటిచ్చిన కొడుకు అంతలోనే ఇలా .. ? కన్నీరుమున్నీరు అవుతున్న విమానం పైలట్ కెప్టెన్ సుమిత్ తండ్రి !
గురువారం మధ్యాహ్నం గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన A 1171 విమానం ప్రమాదానికి గురై కూలిపోయిన సంగతి తెలిసిందే ఈ దుర్ఘటనలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడగా మిగిలిన అందరూ మరణించారు వారిలో విమానం పైలట్ కెప్టెన్ సుమిత్ సభర్వాల్ కూడా ఉన్నారు అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎటు చూసినా కన్నీటి వెతలే కనిపిస్తున్నాయి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న బంధువుల వేదనలు .. రోదనలు మిన్నంటుతున్నాయి కనీసం తమ వారి ఆఖరి చూపుకు…