
దైవం మానుష రూపేణా !
దైవం మానుష రూపేణా ఏ దిక్కులేనివాడికి దేవుడే దిక్కు అన్నారు పెద్దలు అయితే మాములు మనుషులం మనకే ఇన్ని పనులుంటే సర్వాంతర్యామి దేవుడికి ఇంకెన్ని పనులుంటాయి ? అన్ని అర్జీలను పరిశీలించి పరిష్కారించటానికి ఒకోసారి ఆయనక్కూడా సమయం సరిపోదు అందుకని కొంతమంది మనుషుల్లోనే దేవుళ్ళని సృష్టించాడు అలాంటి మనుషుల్లోని దేవుళ్ళ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను ఫోటోలో చూసారు కదా పిల్లలుఅమ్మానాన్నలు ఎవరో తెలియని ఆనాధలు జగమంత కుటుంబం నాది .. ఏకాకి జీవితం నాది అని సిరివెన్నెల…