
“హాస్యం,సంగీతం కలిసి ఒకే జన్మ ఎత్తిన హాసం జంధ్యాల”
అమరుడు జంధ్యాల – భండారు శ్రీనివాసరావు( జూన్ 19 జంధ్యాల వర్ధంతి) బెజవాడ ఎస్సారార్ కాలేజీలో నా క్లాస్ మేట్ జంధ్యాల రాసిన ‘సంధ్యారాగంలో శంఖారావం’ నాటకం రిహార్సల్స్ హనుమంతరాయ గ్రంధాలయంలో వేస్తుంటే వెంట నేనూ వుండేవాడిని, ఏ వేషమూ వేయకపోయినా. ఏదో కవితలు గిలకడం వచ్చనే పేరు నాకూ వుండేది. దాంతో మా స్నేహం మరింత చిక్కబడింది. డిగ్రీ తరువాత మా దారులు వేరయ్యాయి. నేను ఆంధ్రజ్యోతిలో చేరాను. ఆయన కధ సినిమా మలుపులు తిరుగుతూ…