మీరు గమనించారా ? ఈ మధ్య బాబుగారు సోషల్ మీడియాలో ఆక్టివ్ ఉంటున్నరు !
విభజిత ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటున్నారు
గతంతో పోలిస్తే ప్రచారంలో కూడా వినూత్న శైలి అవలంబిస్తున్నారు
ఈ రోజుల్లో ప్రతి పార్టీకి సోషల్ మీడియా వింగ్ ఉంది అనేది అందరికీ తెలిసిందే
పార్టీ ప్రచార కార్యక్రమాలకు గానీ , ప్రభుత్వ పధకాల ప్రచారానికి గానీ ప్రతి ఒక్కరూ ఈ సోషల్ మీడియా మీదే ఆధారపడుతున్నారు
గతంలో ప్రింట్ మీడియా కాలంలో ఈ రోజు వార్త మర్నాడు ఉదయానికి గానీ ప్రజలకు తెలిసేది కాదు
ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఏ రోజు వార్తలు ఆ రోజు ప్రజలకు చేరుతున్నాయి
ఇక సోషల్ మీడియా రంగప్రవేశంతో ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది
ప్రపంచంలో ఏ మూల ఉన్నా క్షణంలో వార్త ప్రజలకు చేరిపోతుంది
అందుకే రాజకీయ పార్టీలు , నాయకులూ సోషల్ మీడియాని పూర్తిస్థాయిలో వాడుకుంటున్నారు
సోషల్ మీడియా వాడకంలోనూ , ఫోటో షూట్ లోనూ నరేంద్ర మోడీ ముందున్నారు
ఈ పరంగా ఆయనకు సోషల్ మీడియాలో మరే నాయకుడికీ లేనంత ఫాలోవర్స్ ఉన్నారు
ఆ మధ్య ఆయన తమిళనాడులో స్వచ్ఛ భారత్ లో భాగంగా బీచ్ ఒడ్డున చెత్త ఏరివేసిన వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ అయినాయి
అలాగే మాల్దీవుల అధ్యక్షుడు చేసిన నెగిటివ్ వాఖ్యలకు సమాధానంగా లక్ష ద్వీప్ లో నరేంద్ర మోడీ కుర్చీ వేసుకుని కూర్చోవడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయి మాల్దీవులకు పర్యాటకుల రాక తగ్గి లక్ష ద్వీపానికి రద్దీ పెరిగింది
ఇక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటారు కానీ ఈసారి కొంచెం వినూత్న శైలిలో వాడుకుంటున్నారు
ఆ మధ్య ఒక చెప్పులు కుట్టే కార్మికుడి ఇంటికి వెళ్లి అతడికి అప్పటికప్పుడు ఇల్లు మంజూరు చేయడమే కాకుండా అతడ్ని స్వయంగా తన కారులో పక్కన కూర్చోబెట్టుకుని యోగక్షేమాలు కనుక్కుంటూ మొత్తం షూట్ చేసి వీడియో రిలీజ్ చేయడంతో అది వైరల్ అయ్యింది
అలాగే ఒక స్కూల్ కి వెళ్లి టీచర్ అవతారం ఎత్తి చిన్నపిల్లలకు మోటివేషన్ లెసన్స్ చెబుతున్న వీడియో వైరల్ అయ్యింది
చంద్రబాబు కొడుకు నారా లోకేష్ కూడా పిల్లలతో పాటు కూర్చుని బాబు గారి లెసన్స్ వినడం విశేషం
దీనికి మంచి వ్యూస్ వచ్చాయి
రొటీన్ కు భిన్నంగా సెక్యూరిటీ కాన్వాయిని దూరంగా పెట్టి నిన్న ప్రజావేదికకు ఆటోలో రావడం బాబు గారి వినూత్న శైలిని తెలియచేస్తుంది
తాజాగా గండికోట లో ఫోటో షూట్ లో పాల్గొని ఈ ప్రదేశం పేరు ఏంటో చెప్పగలరా ? అంటూ ఫేస్ బుక్ వేదికగా ప్రజలను ప్రశ్నించారు
ఏదిఏమైనా నేటి రోజుల్లో సోషల్ మీడియా బలమైన ప్లాట్ ఫార్మ్ గా తయారైంది
దీన్ని వాడుకున్నవాడికి వాడుకున్నంత !
పరేష్ తుర్లపాటి