Home » సినిమా » Page 4

నారీ నారీ నడుమ శర్వానందు – మూవీ రివ్యూ

ఇదేంటి టైటిల్ చూసి మురారి ప్లేసులో కొత్తగా ఈ శర్వానందు ఎక్కడ్నుంచి వచ్చాడు ? అనుకుంటున్నారా ? ఉంది .. దానికో కారణం ఉంది 1990 లలో నారీ నారీ నడుమ మురారి పేరుతో ఇరువురు భామలతో అగచాట్లు పడ్డ బాలయ్య గుర్తున్నాడా ? అగచాట్లు పడితే పడ్డాడు కానీ అప్పట్లోనే బాలయ్య హిట్టు కొట్టాడుఇద్దరు భామలతో రొమాన్స్ చేస్తూ చక్కటి పాటలతో అదరగొట్టేసాడు ఇదిగో ఇన్నాళ్లకు మళ్ళీ అదే టైటిల్తో శర్వానందు ఇరువురు భామలనేసుకుని పండక్కి…

Read More

అనగనగా ఒక రాజు .. అదిసరే ఆ తర్వాత కధేంటి ? – మూవీ రివ్యూ

చిన్నప్పుడు ఏదన్నా కథలు చెప్పుకునేముందు అనగనగా అనే పదాలతో ప్రారంభించేవాళ్ళు ముఖ్యంగా చందమామ , బాలమిత్ర లాంటి పుస్తకాలలో అనగనగా ఒక రాజు.. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు అనే లైన్స్ తో కథ మొదలయ్యేది ఒకరకంగా చెప్పాలంటే అప్పట్లో కథలకు మెయిన్ డోర్ ఈ అనగనగా అనే పదాలే చాన్నాళ్లకు నవీన్ పోలిశెట్టి అనబడే ఈ యువ హీరో అనగనగా ఒక రాజు అంటూ అదే పదాలతో సొంతంగా డైలాగులు రాసుకుని సంక్రాంతికి మనముందుకు వచ్చాడు…

Read More

భర్త మహాశయులకు రవితేజ చేసిన విజ్ఞప్తి ఏంటి ? – మూవీ రివ్యూ

శోభన్ బాబు , శారద భార్యాభర్తలు అయితే విశాఖలో ఉండే శోభన్ బాబు పెద్ద బిజినెస్ మాన్ కావడంతో తరచూ పనిమీద ఊటీ వెళ్తుంటాడు అక్కడ శోభన్ బాబుకి అనుకోకుండా శ్రీదేవి పరిచయం అవడం , ఇద్దరు ఒకటి అవడం జరుగుతుంది పనిముగించుకుని విశాఖ వచ్చిన శోభన్ బాబు ఈ విషయం భార్యకి చెప్పకుండా దాచిపెడతాడు ఓ రోజు అనుకోకుండా శ్రీదేవి విశాఖ వస్తుంది దాంతో అసలు విషయం భార్యకు ఎక్కడ తెలిసిపోతుందో అని శోభన్ బాబు…

Read More

పండక్కి వచ్చిన పాతల్లుడు మన శంకర వరప్రసాద్ గారు హిట్టు కొట్టారు ! – మూవీ రివ్యూ

ఈ సినిమా గురించి చెప్పుకునేముందు సినిమా దర్శకుడి గురించి రెండు మాటలు చెప్పుకుందాం అనిల్ రావిపూడి థియేటర్కొచ్చిన ప్రేక్షకుడ్ని కాసేపు సరదాగా నవ్వించానికి కధే ఉండనవసరం లేదుకధనంతో కూడా అలాంటి అద్భుతాలను సాధించవచ్చు అనే ఫార్ములాతో సినిమాలు తీసి హిట్ కొట్టిన యువ దర్శకుడు అనిల్ రావిపూడి అలాంటి ఈ కుర్రాడు సినిమాల్లో పడితే ఏం జరుగుతుందండి ?సంక్రాతి పండుగని ముందే తీసుకొచ్చేస్తాడు నిరుటేడు సంక్రాంతికి వస్తున్నాం అన్చెప్పి మరీ వెంకటేషుతో కలిసొచ్చి అల్లరల్లరి చేసి నవ్వించాడు…

Read More

రాజాసాబ్ ప్రభాస్ మూవీ ఎలా ఉంది ? – రాజాసాబ్ మూవీ రివ్యూ

సినిమా కెరీర్ ప్రారంభంలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడి కొడుకుగానే ప్రభాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు 2002 లో ఈశ్వర్ మూవీలో ప్రభాస్ కనిపించగానే పెద్దనాన్నగారిలా ఈ కుర్రాడు కూడా ఒడ్డూ పొడుగు బావున్నాడుఆయన వారసత్వం నిలబెడతాడని కృష్ణంరాజు అభిమానులు ఆనాడే అంచనా వేశారు ఇక అక్కడ్నుంచి వర్షం , పౌర్ణమి , ఛత్రపతి , డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్ , మిర్చి సినిమాలతో వింటేజ్ హీరో లుక్ లో మెరిసి మెప్పించాడు 2015…

Read More

రాజా చెయ్యి వేస్తే అది రాంగై పోదులే .. రాజాసాబ్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి !

” ఇకపై టికెట్ రేట్లు పెంచేది లేదు ..ఇదే ఆఖరు.. ఈ విషయమై నిర్మాతలు ఎవరూ ప్రభుత్వం దగ్గరికి రావద్దు ” అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి ఇలా ప్రకటన ఇచ్చి కొన్ని రోజులు అయ్యిందో లేదో నిన్న అర్ధరాత్రి ప్రభాస్ మూవీ రాజాసాబ్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇస్తూ హోమ్ సెక్రెటరీ జీవో ఇచ్చేసారు నిజానికి మంత్రిగారి ప్రకటనకు చాన్నాళ్ల ముందే సీఎం రేవంత్ కూడా సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇచ్చేది…

Read More

కుక్కలతో సస్పెన్స్ గేమ్ నడిపిన మళయాళ దర్శకుడు – ఎకో మూవీ రివ్యూ

మీ దగ్గర ఐదు కోట్లు ఉంటే మళయాళ దర్శకుల చేతిలో పెట్టి చూడండిఓ మాంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీసి తిరిగి 50 కోట్లు మీ చేతిలో పెడతారు (నేను చెప్పాను కదా అని పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ చేతిలో ఐదు కోట్లు పెట్టి రోజులు లెక్కపెట్టుకోకండి .. డబ్బులతో పాటు మన బుర్రను కూడా కాస్త వాడాలని మనవి ) ఎట్టెట్టా 5 కోట్లకు 50 కోట్లు ఎలా ఇస్తారబ్బా ? అనుకుంటున్నారా? పేకాట కాదు…

Read More

చరిత్ర మరువని సైనికుడు అరుణ్ ఖేత్రపాల్ కధే ఇక్కీస్ – అన్నట్టు ఈ మూవీ హీరో అగస్త్య నంద అమితాబ్ బచ్చన్ మనవడే !

ఈ మధ్య బాలీవుడ్లో దేశభక్తి , సైన్యం , యుద్ధం నేపథ్యంలో వచ్చిన సినిమాలు కలెక్షన్ల సునామీలు రాబడుతున్నాయి సీక్రెట్ ఆపరేషన్ ,స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఇటీవల రిలీజ్ అయిన దురంధర్ మూవీ ఇప్పటికీ వసూళ్లపరంగా దూసుకుపోతుంది దురంధర్ మూవీ వాస్తవ సంఘటనల ఆధారంగా కథ రాసుకుని తెరకెక్కించారు గతంలో ఇండియన్ ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ కు చెందిన అధికారులు శత్రు దేశంలో స్పై ఆపరేషన్లు ఎలా చేసేవారో అందులో చూపించారు అలాగే ఇక్కీస్ సినిమా కూడా…

Read More

శంబాల అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను భయపెట్టిందా ? – శంబాల మూవీ రివ్యూ

ఈ సినిమాలో హీరో ఆది గురించి చెప్పుకునేటప్పుడు ముందుగా ఆయన తండ్రి సాయి కుమార్ గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాలి డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో పనిచేస్తూనే చిన్న చిన్న పాత్రలను పోషిస్తూ కెరీర్ మొదలుపెట్టిన సాయి కుమార్ అనతికాలంలోనే చక్కటి క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎదిగాడు ముఖ్యంగా నేనేరా పోలీస్ అంటూ ఈయన చెప్పే డైలాగులకు థియేటర్లు దద్దరిల్లిపోయేవిఅంత హై పిచ్ లో ఆపకుండా డైలాగ్ చెప్పడంలో సాయికుమార్ ది అందెవేసిన చేయి తెలుగునాటే కాదు కన్నడనాడులో కూడా…

Read More

హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ సినిమాల్లో ఛాంపియన్ అవుతాడా ? – ఛాంపియన్ మూవీ రివ్యూ

హీరో చూస్తే శ్రీకాంత్ కొడుకు , బ్యానర్ చూస్తే మహానటి వంటి హిట్ మూవీ తీసిన స్వప్న దత్ వాళ్ళది, చిత్రాన్ని సమర్పించింది జీ స్టూడియోస్ వారు అవడంతో ఛాంపియన్ మూవీపై విడుదలకు ముందే ఇండస్ట్రీలో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి అలాఅని చిన్న హీరో కాబట్టి లో బడ్జెట్లో తీయలేదునిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా షుమారు 40 కోట్లకు పైనే ఖర్చు పెట్టారు దాంతో సినిమాకి టీజర్ రిలీజ్ సమయంలోనే కొంత హైప్ వచ్చింది మరి…

Read More
error: Content is protected !!