“నీకెంత ధైర్యం .. డిప్యూటీ సీఎం నే ఎదిరిస్తావా ?” “మీరు డిప్యూటీ సీఎం అవునో కాదో నాకెలా తెలుస్తుంది ? వీడియో కాల్ చేయండి సార్” దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన ఐపీఎస్ అంజనా కృష్ణ
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరియు ఐపీఎస్ అధికారిణి అంజనాకృష్ణల మధ్య లైవ్ లో జరిగిన వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది
రోడ్డు నిర్మాణం కోసం మహారాష్ట్రలోని కర్మలా తాలూకా ఖుద్దు గ్రామంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్టు ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణకు ఫిర్యాదులు అందాయి
ఫిర్యాదులు అందుకున్న అంజనా కృష్ణ రెండ్రోజుల క్రితం దర్యాప్తు కోసం ఆ గ్రామానికి వెళ్లారు
పోలీసులు గ్రామంలోకి అడుగుపెట్టడంతో కొంతమంది గ్రామస్తులు మరియు ఎన్సీపీ కార్యకర్తలు తిరగబడ్డారు
ఆవిడ గ్రామంలో ఉండగానే స్థానిక ఎన్సీపీ నేత డిప్యూటీ సీఎం పవార్ కు ఫోన్ చేసి నేరుగా ఐపీఎస్ అధికారిణికి ఇచ్చాడు
స్పీకర్ ఆన్ చేయడంతో ఇరువురి మధ్య సంభాషణలు ఓపెన్ అయ్యాయి
అజిత్ పవార్ మాట్లాడుతూ ” నేను డిప్యూటీ సీఎం ను మాట్లాడుతున్నా .. మీ చర్యలను ఆపి వెంటనే గ్రామం విడిచి వెళ్ళండి ” అని ఆదేశించారు
వేరొకరు అయితే సాక్షాత్తు డిప్యూటీ సీఎం లైన్ లో ఉన్నాడు .. మనకెందుకొచ్చిన తలనొప్పులు అని వెళ్లిపోయేవాళ్లు
కానీ యువ ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ రూటే సెపరేటు
” సార్ ! మీరు చెప్పేది నాకు అర్ధమౌతుంది . కానీ మీరు డిప్యూటీ సీఎం అవునో కాదో నాకెలా తెలుస్తుంది ? నా నెంబర్ కు ఒకసారి వీడియో కాల్ చేస్తారా ?” అని దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది
నిజానికి ఐపీఎస్ నుంచి ఇలాంటి సమాధానం అజిత్ పవార్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు
దాంతో ఆయన ఈగో హర్ట్ అయినట్టుంది
” యెంత ధైర్యం .. ? డిప్యూటీ సీఎం ను నన్నే పట్టుకుని వీడియో కాల్ చేయమంటారా ? అయితే మీరే నాకు వీడియో కాల్ చేయండి ” అని కోపంగా ఫోన్ పెట్టేసారు
దాంతో అంజనా కృష్ణ డిప్యూటీ సీఎం కు వీడియో కాల్ చేసారు
ఆ వీడియో కాల్ లో ఆయన ఐపీఎస్ అధికారిణిని తక్షణం గ్రామం విడిచివెళ్లాల్సిందిగా ఆదేశించడం సృష్టంగా కనిపించింది
ఈ తతంగం మొత్తాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది
మొత్తం వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తీరును తప్పుపడుతుండగా లైవ్ కాల్ లో ధైర్యంగా సమాధానం చెప్పిన ఐపీఎస్ అంజనా కృష్ణకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు