ఒకవైపు పేషెంట్ కండిషన్ సీరియస్ .. మరోవైపు భూకంపం
పేషెంట్ ను వదిలేస్తే తమ ప్రాణాలు దక్కుతాయి .. కానీ పేషెంట్ ప్రాణాలు దక్కవు
అయినా సరే డాక్టర్లుపేషెంట్ ప్రాణాలు నిలపటమే ముఖ్యమని నిర్ణయించుకున్నారు
వైద్యో నారాయణ హరి అన్న వాఖ్యలను మరోసారి నిజం చేసారు
వివరాల్లోకి వెళ్తే ,
రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది
రిక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రత 8. 8 గా నమోదు అయ్యింది
ఈ భూకంపం రష్యాలోని కామ్చట్కా ద్వీపకల్పాన్ని అతలాకుతలం చేసింది
సమీపంలోని భవనాలు ఆ తీవ్రతకు తట్టుకోలేక ఊగడం మొదలుపెట్టాయి
భవంతుల్లోని జనాలు ప్రాణ భయంతో రోడ్లమీదకు పరుగులు తీశారు
కానీ ఒక భవనంలో ఉన్న డాక్టర్లు మాత్రం భవంతిలోనుంచి కదల్లేదు
ఆ టైములో క్రిటికల్ కండిషన్ లో ఉన్న ఓ పేషేంట్ కు సర్జరీ చేస్తుండటమే అందుకు కారణం
వారు బయటికి వెళ్ళిపోతే సేవ్ అవుతారు కానీ పేషెంట్ ప్రాణాలు నిలబడవు
అందుకే పేషెంట్ ప్రాణాలు నిలపటం కోసం మొండిగా సర్జరీ కొనసాగించటానికే నిర్ణయించుకున్నారు
ఏ మాత్రం భయపడకుండా ఒకరు స్ట్రెచర్ గట్టిగా పట్టుకుంటే మరొకరు వైద్య పరికరాలు ఉన్న బల్లలు పట్టుకుని సాయం చేస్తున్న సమయంలోనే వైద్యులు విజయవంతంగా సర్జరీ పూర్తీ చేసారు
ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి
తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వృత్తి పట్ల నిబద్దతతో సర్జరీ చేసి పేషెంట్ ప్రాణం కాపాడిన డాక్టర్లను పలువురు ప్రశంసిస్తున్నారు !