కుబేరలో బ్లాక్ మనీ వైట్ చేసుకునేందుకు బిచ్చగాళ్లను వాడుకుంటే ఇక్కడ బ్లాక్ మనీ పోగేసుకునేందుకు డాక్టరమ్మ బిచ్చగాళ్లను వాడుకుంది !
సేమ్ స్టోరీ సబ్జెక్టు డిఫరెంట్
ప్రస్తుత కథలోకి వస్తే ,
అనగనగా ఓ డాక్టరమ్మ పేరు నమ్రత .. బోలెడు బ్లాక్ మనీ సంపాదించాలని ఆశ పడింది
అందుకోసం ఏ అడ్డదారులు తొక్కాలా ? అని ఆలోచిస్తుండగా ఆమె కొడుకు తన లాయరు బుర్ర ఉపయోగించి ప్రెజెంట్ సంతాన సాఫల్య కేంద్రాలకు బాగా డిమాండ్ ఉంది కాబట్టి గదయితే కరెక్ట్ అని ప్లాన్ చెప్పాడు
ఫలితంగా డాక్టరమ్మ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ పేరుతొ సంతాన సాఫల్య కేంద్రం ఓపెన్ చేసింది
క్లినిక్ ఓపెన్ చేసిన తర్వాత సంతానం లేని వారు తండోపతండాలుగా రావడంతో ఆమెకు డిమాండ్ అర్థమైంది
సప్లై – డిమాండ్ సూత్రం తెలిసిన వ్యాపారవేత్త కావడంతో పేషేంట్ల బలహీనతలను , అవసరాలను క్యాష్ చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది
ఆ దుర్బుద్ధిలోనుంచే చౌకగా వీర్యాన్ని కొనుగోలు చేసే వెధవ పనికి శ్రీకారం చుట్టింది
ఆరోగ్యవంతులైన దాతలు వీర్యాన్ని ఇవ్వాలంటే అవసరాన్ని బట్టి డిమాండ్ చేస్తారు
అందుకే ఆమె లాయరు కొడుకు కుబేర సినిమా తరహా ప్లాన్ ఒకటి చెప్పాడు
కుబేరలో ఆయిల్ నిక్షేపాలను సొంతం చేసుకునేందుకు చేసుకున్న లక్షా కోట్ల డీల్ లో 50 వేల కోట్లు బ్లాక్ , 50 వేల కోట్లు వైట్ లో ఇచ్చేందుకు జైల్లో ఉన్న మాజీ సిబిఐ ఆఫీసర్ నాగార్జునను విడిపించి తీసుకొచ్చి అతడిచ్చిన ప్లాన్ ప్రకారం నలుగురు బిచ్చగాళ్లను వాడుకుని వాళ్ళ ద్వారా ప్లాన్ అమలుచేసారు
అలాగే ఈ కేసులో డాక్టరమ్మకు లాయరు కొడుకు బిచ్చగాళ్ల ప్లాన్ చెప్పాడు
ఈ ప్లాన్ ప్రకారం ఖర్చు లేకుండా కేవలం బీరు , బిర్యానీ ఇచ్చి బిచ్చగాళ్ల వీర్యం సేకరించి.. అదే భర్త వీర్యం అని నమ్మించి ప్రయోగాలు చేసి బిడ్డను అప్పగిస్తే బోలెడు డబ్బులు రావడంతో పాటు ఖర్చు కూడా చాలా కలిసొస్తుందని చీప్ ప్లాన్ చెప్పడంతో డాక్టరమ్మ అమలు చేసింది
ఇవి కాకుండా డబ్బులు సంపాదించటానికి ఇంకా ఎలాంటి మార్గాలు ఉన్నాయా అని ఆలోచిస్తున్న తరుణంలో సికింద్రాబాద్ కు చెందిన రాజస్థానీ దంపతులు ఇవిఎఫ్ ప్రక్రియ ద్వారా సంతానం కోసం డాక్టరమ్మ దగ్గరకు వచ్చారు
పేషేంట్ చూస్తే డబ్బుకు లెక్కలేనట్టు ఉన్నాడు
సంతానం కోసం ఎంతైనాఆ ఖర్చు పెట్టేట్టు ఉన్నారు
వారి బలహీనతలను సొమ్ము చేసుకోవాలనే ఆలోచనను వెంటనే అమలు చేసింది
ఇవిఎఫ్ ప్రక్రియ ద్వారా సంతానం వీలుపడదు కాబట్టి సరోగసీ ( అద్దె గర్భం ) ద్వారా చేద్దామని అయితే ఇందుకు ఒప్పుకునే మహిళలు దొరకడం కష్టమని ఇందుకు ముప్పై లక్షలదాకా అవుతుందని ఎర వేసింది
ఎలాగైతేనేమి సంతానం కలిగితే చాలని ఆ దంపతులు ముప్పై లక్షలకు ఒప్పుకున్నారు
ఇక అక్కడ్నుంచి ప్లాన్ మొదలైంది
ఢిల్ల్లీలో గర్భంతో ఉన్న ఓ పేద మహిళను 90 వేలకు బిడ్డను ఇచ్చేందుకు ఒప్పించింది
డెలివరీకి ముందు ఆ పేద మహిళను విమానంలో విశాఖపట్నంలో ఉన్న తమ సెంటర్ కు పిలిపించి మగబిడ్డ డెలివరీ అయ్యాక హైద్రాబాదులో ఉన్న రాజస్థానీ దంపతులకు ఫోన్ చేసి మగబిడ్డ పుట్టాడు .. వైజాగ్ వెళ్లి తీసుకోండి అనడంతో ఆ దంపతులు ఆనందంగా వైజాగ్ వెళ్లి బిడ్డను తీసుకున్నారు
వారి ఉత్సాహాన్ని గమనించిన డాక్టరమ్మ ఇంకో పది లక్షలు డిమాండ్ చేసింది
ఆ పదిలక్షలు కూడా ఇచ్చేవారేమో కానీ బిడ్డను చూసిన ఆ దంపతులకు అనుమానం వచ్చింది
డిఎన్ఏ రిపోర్ట్ ఇవ్వమని అడిగారు
ఆ రిపోర్ట్ ఇస్తే తమ బండారం బయటపడుతుందని గమనించిన లాయర్ కొడుకు డిఎన్ఏ రిపోర్ట్ ఇస్తే లీగల్ డిస్ప్యూట్స్ వస్తాయని బెదిరించి ఇవ్వలేదు
దాంతో ఆ దంపతులకు అనుమానం బలపడి వేరేచోట డిఎన్ఏ టెస్టులు చేయించగా బిడ్డ డిఎన్ఏ తండ్రికి మ్యాచ్ కాలేదు
మోసం తెలుసుకున్న ఆ దంపతులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో తీగ లాగితే డొంకంతా బయటపడ్డట్టు డాక్టరమ్మ చేసిన మోసాలు మొత్తం బయటపడ్డాయి
ఆశర్యకరమైన విషయం ఏంటంటే ఈ డాక్టరమ్మ క్లినిక్కుల మీద పదేళ్ల క్రితమే దాడులు చేసి మూసివేస్తే వేరే డాక్టర్ల పేరుతొ లైసెన్స్ తీసుకుని కొత్తగా హైద్రాబాదులో దుకాణం తెరిచింది
కృత్రిమ గర్భధారణలో రెండు రకాలు ఉంటాయి
ఒకటి భర్త వీర్యం .. రెండోది దాత వీర్యం
ఇందులో ఘోరమైన విషయం ఏంటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట అడుక్కునే బిచ్చగాళ్లకు బీరు బిర్యానీ ఇచ్చి వీర్యం కలెక్ట్ చేసి సంతానం ఆశించిన వాళ్ళదగ్గర లక్షల్లో వసూలు చేసింది డాక్టరమ్మ
మాములుగా ఆరోగ్యవంతులైన వీర్య దాతలు అవసరాన్ని బట్టి ఒక్కో రేటు అడుగుతారు
ఆ రేటు కూడా ఇవ్వడానికి ఇష్టపడని డాక్టరమ్మ బీరు , బిర్యానీ ఇచ్చి బిచ్చగాళ్ల వీర్యాన్ని సేకరించి ప్రయోగాలు చేసింది
భర్త వీర్యం అనిచెప్పి ఎవరో బిచ్చగాడి వీర్యంతో ప్రయోగాలు చేసి బిడ్డను వాళ్ళ చేతుల్లో పెట్టింది
ఈ చర్య మానవ సంబంధాల్లో దుర్మార్గానికి పరాకాష్ట
వైద్యో నారాయణ హరి అని పిలుచుకునే ప్రపంచంలోనే ఇటువంటి డాక్టరమ్మలు ఉండటం సిగ్గుచేటు !
ప్రస్తుతం పోలీసులు ఆమె ముఠాను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు !
పరేష్ తుర్లపాటి