పెద్దయ్యాక నువ్వేం అవుతావు ? అంటే చాలామంది పిల్లలు చెప్పే సమాధానం యాక్టర్ అవుతాననో ,డాక్టర్ అవుతాననో ,పోలీస్ అని ..ఇంజినీర్ అని రక రకాల ఆశయాలను చెప్తారు
అందరి పిల్లలాగానే వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా చిన్నప్పుడే అనుకున్న మాట ..పెద్దయ్యాక పెద్ద డాక్టర్ అయ్యి పేదోళ్లందరికీ సేవ చేసేయ్యాలని
వైద్యాన్ని పేద వాడికి అందుబాటులోకి తీసుకురావాలని కలలు కన్నారు
వై ఎస్ తండ్రి రాజారెడ్డి గారు అప్పటికే పేరు మోసిన కాంట్రాక్టర్ . తన వ్యాపారాలకు వై ఎస్ వారసుడు అవ్వాలని ఆయన కోరిక
కానీ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయం వేరు
ఆయన మదిలో ఉన్న ఆలోచన వేరు
ఒకటే ఆలోచన పేదవాడికి అందుబాటులోకి వైద్యం!
ఆ ఆలోచనే ఆయన్ని వ్యాపారాలు కాదని వైద్యం వైపు వెళ్లేలా పురికొల్పాయి
అదే ఆలోచనతో ఆయన వైద్య విద్యను పూర్తి చేసారు ..హౌస్ సర్జన్ గా చేస్తున్నప్పుడే రాష్ట్ర హౌస్ సర్జన్ ల సంఘానికి ప్రెసిడెంట్ అయ్యారు
1973 లో జమ్మలమడుగు సి ఎస్ ఐ ఆసుపత్రిలో వైద్యాధికారిగా చేరారు
ఈయన ఆశయం తండ్రి రాజారెడ్డి గారు కూడా అర్ధం చేసుకున్నారు
1973 లోనే పులివెందులలో 70 పడకల ఆసుపత్రి కట్టించారు ..అదే హాస్పిటల్లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వైద్యుడిగా పేదవాళ్ళకి ఉచిత వైద్యం అందించారు
అయినా ఆయనలో ఉన్న వైద్యుడు సంతృప్తి పడలేదు
పులివెందులలో మాత్రమే పేదవాడికి వైద్యం అందుబాటులోకి రావటం కాదు ..రాష్ట్రం మొత్తం అందుబాటులోకి రావాలి .ఎలా ? ఎలా ? అని ఆలోచిస్తున్నప్పుడే ఆయనలోని నాయకుడు బయటకు వచ్చాడు
రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయానికి అప్పుడే అంకురార్పణ జరిగింది
ఆనాడు రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయమే భవిష్యత్ లో రాష్ట్రం మొత్తంలో పేదవాళ్ళకి వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చింది !
ఎస్ ..104 ,108 ..ఆరోగ్యశ్రీ ..ఇప్పుడు ఎంతోమంది పేదల పాలిట సంజీవని ఆరోగ్యశ్రీ వై ఎస్ చలవతోనే ఏర్పడింది
నాయకత్వం అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు ..తీసుకుంటే దక్కేది
వై ఎస్ నాయకత్వం తీసుకున్నారు
ఇక ఆయన వెనుతిరిగి చూసుకునే సందర్భం రాలేదు
మంత్రిగా ,ముఖ్యమంత్రిగా వై ఎస్ పాలనా సామర్థ్యం నిరూపించుకున్నారు ..ఇన్ని చేసినా ఆయనలోని వైద్యుడు మాయమవ్వలేదు
ప్రమాదం జరిగిన నిమిషాల్లోనే కుయ్ కుయ్ మంటూ వచ్చే 108 అంబులెన్సులు ..మారుమూల పల్లెల్లో సైతం వైద్య సేవలను అందించే 104 సేవలు రోగుల పాలిట సంజీవని అయ్యింది
సత్యం రామలింగ రాజు..ప్రభుత్వం కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రాజెక్టు అప్పట్లో ప్రజల మన్నన పొందింది
సకాలంలో వైద్యం అంది ఎంతో మంది ప్రాణాలను నిలిపింది
పేదవాడికి వైద్యం అందుబాటులోకి తెచ్చిన ఆరోగ్యశ్రీ సృష్టికర్త డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి నేడే
వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు !
పరేష్ తుర్లపాటి