ప్రతి రోజూ 2000 మంది అన్నార్తుల ఆకలి తీరుస్తున్న
ప్రైవేట్ ఉద్యోగి మల్లేశ్వరావు !
ఒక్కోసారి వ్యవస్థలు చేయలేని పనులు వ్యక్తులు చేసి చూపిస్తారు
ఆశయం గట్టిదైతే లక్ష్యం ఒళ్ళోకి వచ్చి వాలుతుంది
12 ఏళ్ల క్రితం
బీటెక్ చదువుకోడానికి
హైదరాబాద్ వచ్చిన
ఒక సాధారణ కుర్రాడు
ఈరోజు డోంట్ వేస్ట్ ఫుడ్ అనే
ఆర్గనైజేషన్ స్థాపించి రోజూ 2 వేల మంది
ఆకలి తీర్చుతున్నాడు
అలా అని అతడు ఆగర్భ శ్రీమంతుడేమీ కాదు
కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో ఒక దశలో ఇంటి దగ్గర నుండి
డబ్బులు పంపేవారు కాదు
దాంతో హాస్టల్ నుంచి అతడ్ని బయటికి పంపారు
ఆ టైంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉంటూ
ఆకలి తీర్చుకోడానికి క్యాటరింగ్ కి వెళ్ళేవాడు
ఆ ఈవెంట్స్ లో , పార్టీస్ లో
చాలా ఆహారం వృధాగా మిగలడం గమనించి
చాలా బాధ పడ్డాడు
మనకు తినడానికి తిండి లేక బాధపడుతుంటే
ఇక్కడ మాత్రం అన్నం వృధాగా పోతుంది అని మధనపడేవాడు
అప్పుడు వచ్చిన ఆలోచనే
ఈ డోంట్ వేస్ట్ ఫుడ్ నినాదం
పదిమంది ఆకలి తీర్చాలన్న
తన ఆ బలమైన సంకల్పానికి
ఒక్కొక్క చేయి తోడైంది
ఇప్పుడు ప్రత్యక్షంగా , పరోక్షముగా
200 మంది వాలంటీర్లతో
కలిసి ప్రతి రోజు 2 వేలమందికి
భోజనం అందిస్తున్నారు
ఈ మంచి పనిలో
రెస్టారెంట్స్ , హోటల్స్
యజమానుల సహకారం కూడా
ఎంతో ఉంది
ఈ సేవలు 12 పదేళ్లుగా
విజయవంతగా కొనసాగుతూనే ఉన్నాయి
కరోనా టైంలో అయితే ప్రతి రోజు
20 వేల మందికి
ఆహారాన్ని అందించే వారు
ఆ సమయంలో చనిపోయిన
180 మందికి దగ్గరుండి
దహన సంస్కరణలు నిర్వహించారు
మల్లేశ్వరావు సేవలకు మెచ్చి
దేశ ప్రధాని
” నరేంద్ర మోదీ, ఆనంద్ మహేంద్ర ” వంటి
దిగ్గజాలు అభినందించారు
బాలయ్య తన అన్ స్టాపబుల్ షోలో మల్లేశ్వర రావును ప్రత్యేకంగా పిలిపించి అభినందించి సత్కరించడమే కాకుండా తన వంతు సాయాన్ని ప్రకటించారు
ఒకప్పుడు ఒక పూట తిండికి లేని మనిషి
ఇప్పుడు ప్రతిరోజు 2 వేల మంది ఆకలి తీర్చడం
అంటే చిన్న విషయం కాదు
ఎందుకంటే అతని దగ్గర డబ్బులేదు
పలుకుబడి అంతకంటే లేదు
ఉన్నదల్లా ఒక్కటే పదిమంది
ఆకలి తీర్చాలన్న గొప్ప సంకల్పం
అదే ఆయనకి శ్రీరామ రక్ష
అందుకే అంటారు “కడుపుమాడిన వాడికే
ఆకలి బాధ, అన్నం విలువ
తెలుస్తుందని “
Anchor sai