Home » ‘భారత్‌తో యుద్ధం అంటూ వస్తే పాక్ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవలేదు.. ఇప్పటిదాకా అమెరికా ఐఎస్‌ఐకి లక్షలాది డాలర్లు చెల్లించింది’ – మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టిన అమెరికా మాజీ సిఐఎ అధికారి

‘భారత్‌తో యుద్ధం అంటూ వస్తే పాక్ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవలేదు.. ఇప్పటిదాకా అమెరికా ఐఎస్‌ఐకి లక్షలాది డాలర్లు చెల్లించింది’ – మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టిన అమెరికా మాజీ సిఐఎ అధికారి

Spread the love

భారత్ తో యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవలేదని అమెరికా మాజీ CIA అధికారి జాన్ కిరియాకో చెప్పారు . అంతేకాదు భారత్ తో యుద్ధం కోరుకుంటే పాకిస్తాన్ కు మంచి జరగదని వారు గ్రహించాలి అన్నారు

ఓ మీడియా ఛానెల్ కి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయన పలు సంచలనాత్మక విషయాలు వెల్లడించారు .

ఈయన గతంలో పాకిస్తాన్‌లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల చీఫ్‌గా హోదాలో CIAలో 15 సంవత్సరాలు పనిచేసారు . కిరియాకౌ మాట్లాడుతూ “భారతదేశం మరియు పాకిస్తాన్ ల మధ్య నిజమైన యుద్ధం జరిగితే దాని వల్ల ఎవరికీ ఏమీ ఒరగదు పై పెచ్చు పాకిస్తానీలు ఓడిపోతారు . నేను అణ్వాయుధాల గురించి మాట్లాడటం లేదు, నేను సంప్రదాయ యుద్ధం గురించే మాట్లాడుతున్నాను.”అని పాక్ అణు బెదిరింపులను ఉటంకిస్తూ అన్నారు

పాకిస్తాన్ అణు బ్లాక్‌మెయిల్‌ను తాము సహించబోమని మరియు ఏదైనా ఉగ్రవాద చర్యకు కఠినంగా స్పందిస్తామని భారతదేశం ఎప్పటి నుంచో పదేపదే చెప్తుంది

2016లో ఎల్‌ఓసీ వెంబడి ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడుల నుండి 2019లో బాలకోట్ వైమానిక దాడుల వరకు, ఇటీవల ఈ సంవత్సరం మేలో ఆపరేషన్ సిందూర్ వరకు నిర్ణయాత్మక సైనిక చర్యల ద్వారా భారత సైన్యం తన వైఖరిని స్పృష్టంగా చెప్తూనే ఉంది

కిరియాకౌ మాట్లాడుతూ ‘తన పదవీకాలంలోనే అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు అమెరికా మిలియన్ డాలర్లు పంపిందని’ సంచలన వ్యాఖ్యలు చేసారు

“అప్పట్లో పాకిస్తాన్ ప్రభుత్వంతో మా సంబంధాలు చాలా చాలా బాగున్నాయి. ఆ సమయంలో జనరల్ పర్వేజ్ ముషారఫ్ కూడా మేము చెప్పినట్టు నడుచుకున్నారు . ముషారఫ్ మాకు అమ్ముడుపోయారని చెప్పడంలో ఎటువంటి దాపరికం లేదని చెప్తూ అయన కుండ బద్దలు కొట్టారు

“సైనిక సహాయం పరంగా కానివ్వండి లేదా ఆర్థిక పరంగా కానివ్వండి మేము ముషారఫ్ కు లక్షలాది డాలర్ల సహాయాన్ని అందించాము. ఈ క్రమంలో మేము ముషారఫ్‌ను చాలాసార్లు క్రమం తప్పకుండా కలిసాము . మరియు ముఖ్యంగా మా నుంచి ఎటువంటి సాయం కావాలో ఆయన మాకు చెప్పేవాడు” అని ఆయన అన్నారు.

ముషారఫ్ చాలా తెలివిగా డబుల్ గేమ్ ఆడాడు . భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉగ్రవాద వ్యతిరేక చర్యలో అమెరికా వైపు ఉన్నట్లు నటించాడు.

పాక్ సైన్యం అల్-ఖైదా గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. వారి టార్గెట్ ఎంతసేపూ ఇండియా మీదే ఉండేది . కాబట్టి తమ సైన్యాన్ని సంతోషంగా ఉంచడానికి మరియు కొంతమంది తీవ్రవాదులను సంతోషంగా ఉంచడానికి, భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదానికి పాల్పడుతూ, ఉగ్రవాద వ్యతిరేక చర్యలో అమెరికన్లతో సహకరించినట్లు నటించే ద్వంద్వ ప్రమాణాలను ముషారఫ్ పాటించాడు” అని ఆయన వెల్లడించారు.

2001 లో పార్లమెంట్ పై దాడి , మరియు 2008 లో ముంబై దాడుల సమయంలో కూడా భారతదేశంలో ఉగ్ర దాడులకు తీవ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చిందనేది బహిరంగ రహస్యమని అయన అన్నారు

2008 లో జరిగిన ముంబై దాడులు ఆల్ ఖైదా పని అని నేను అనుకోవడం లేదు . అది పాకిస్తాన్ మద్దతు ఉన్న కాశ్మీరీ గ్రూపుల పని అనుకుంటున్నాను అని చెప్పారు

2002 లో తాను CIA అధికారిగా పనిచేస్తున్న సమయంలో ఇస్లామాబాద్ అణ్వాయుధాల బంకర్లపై పెంటగాన్ కంట్రోల్ ఉందని అనధికారికంగా తెలిసిందని మరో సంచలన వ్యాఖ్యలు చేసారు

అమెరికా సౌదీ సంబంధాలపై కిరియాకో మాట్లాడుతూ ” మేము వారి నుంచి చమురు కొనుగోలు చేస్తాం .. వారు మా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తారు . ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సౌదీ సైన్యంలో అధిక భాగం పాకిస్థానీయులే ఉన్నారని అయన చెప్పారు

హింసకు CIA ఏ విధంగా వత్తాసు పలుకుతుందో బహిరంగంగా చెప్పడంతో 2017 లో అమెరికన్ ప్రభుత్వం ఈయన్ను జైల్లో పెట్టింది

23 నెలలు జైల్లో ఉన్నప్పటికీ తాను చెప్పిన విషయాలపై ఈయన క్షమాపణ చెప్పలేదు . పైగా ఉన్న విషయాలే ప్రపంచానికి చెప్పి సరైన పని చేసానని సమర్ధించుకున్నాడు

తాజాగా పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల గురించి చెప్తూ ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *