Home » ఒక జేమ్స్ బాండ్ , ఒక ఏజెంట్ 116 , ఒక కేజీబీ సీక్రెట్ ఏజెంట్ పుతిన్ .. అన్నట్టు ఈయన నడిచేటప్పుడు కుడిచేతిని కదపడు.. ఎందుకో తెలుసా ?

ఒక జేమ్స్ బాండ్ , ఒక ఏజెంట్ 116 , ఒక కేజీబీ సీక్రెట్ ఏజెంట్ పుతిన్ .. అన్నట్టు ఈయన నడిచేటప్పుడు కుడిచేతిని కదపడు.. ఎందుకో తెలుసా ?

Spread the love

రెండు రోజుల పర్యటనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే

షెడ్యూల్ ప్రకారం విదేశాంగ మంత్రి జై శంకర్ ఆయనకి స్వాగతం పలకాలి

కానీ ఆఖరి క్షణంలో ప్రోటోకాల్ ను పక్కనబెట్టి మోడీ స్వయంగా వెళ్లి పుతిన్ కు స్వాగతం పలకడమే కాదు ఒకే కారులో కలిసి ప్రయాణించారు

దీన్ని బట్టి రష్యా అధ్యక్షుడికి మోడీ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తుంది

పుతిన్ కు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా ఒక కారణం ఉంది

అమెరికాతో మారుతున్న భారత్ విదేశాంగ విధానం , ట్రంప్ టారిఫ్ లు , రష్యా ముడి చమురు అంశాలు వాటిలో ప్రధానమైనవి

రష్యా అధ్యక్షుడు , భారత ప్రధాని ల మధ్య ఈ రోజు జరగబోయే శిఖరాగ్ర సమావేశం మీద ఇరు దేశాలే కాదు ఏకంగా ప్రపంచం దృష్టి సారించింది
మరీ ముఖ్యంగా అమెరికా

ఇదిలా ఉండగా ప్రస్తుత రష్యా అధ్యక్షుడు పుతిన్ గతంలో సోవియట్ తరపున కేజీబీ లో రహస్య గూఢచారిగా కూడా పనిచేసారు
దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

కేజీబీ గూఢచారిగా పుతిన్

కేజీబీ అనేది అప్పటి సోవియట్ ప్రభుత్వంలో అత్యున్నత ఇంటలిజెన్స్ విభాగం

1954 నుంచి 1991 వరకు సోవియట్ రష్యా ప్రధాన కార్యాలయం గా ప్రపంచ దేశాల్లో గూఢచర్యం చేసింది

పుతిన్ 1975 లో సీక్రెట్ ఏజెంట్ పోస్టుకి కేజీబీ లో చేరాడు
ఇందులో చేరేముందు ఆయనకి కఠోరమైన శిక్షణ ఇచ్చారు

ఆయుధాలు వాడటంలో నైపుణ్యం , శత్రువుల కదలికలను పసిగట్టి అంతమొందించడం , ఇతర దేశాల్లో రహస్య స్ట్రింగ్ ఆపరేషన్లు చేస్తూ సైనిక రహస్యాలను సోవియట్ కు చేరవేయడం లాంటి పనుల్లో పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చారు

ఆ ట్రైనింగ్ తో పుతిన్ మెరికలాంటి కమెండో అయ్యాడు

ముఖ్యంగా ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయుధం దగ్గరే ఉంచుకోవాలని దానిని ఎప్పుడూ చేజార్చుకోరాదని ఆయనకి నేర్పారు

అందుకే పుతిన్ ఎప్పుడూ తన పాకెట్లో రివాల్వరో , కత్తో ఉంచుకునేవాడు

ఒకవేళ అనుకోకుండా శత్రువుకి దొరికిపోయిన పక్షములో ఈ ఆయుధాలను బయటికి తియ్యాలని బోధించారు

పుతిన్ కి జర్మన్ భాషలో కూడా ప్రావీణ్యం ఉండటంతో కేజీబీ అతడ్ని తూర్పు జర్మనీలో తమ ఆపరేషన్ల కోసం పంపింది

జర్మనీ చేరుకున్న పుతిన్ అక్కడ రహస్య ఆపరేషన్లు మొదలుపెట్టాడు

స్థానికంగా ఏజెంట్లను నియమించడం , ముఖ్యమైన సమాచారాన్ని సేకరించడం , సైనిక రహస్యాలను , ఇతర ముఖ్యమైన పత్రాలను సోవియట్ లోని కేంద్ర కార్యాలయం కేజీబీ కి పంపడం లాంటివి చేసేవాడు

ఈ సమయంలోనే తన రివాల్వర్ కి పని చెప్పి చాలామంది శత్రువులను లేపేసాడనే ఆరోపణలు కూడా వచ్చాయి
కానీ సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఏ ఒక్కటీ నిలబడలేదు

అలా కేజీబీ కి పనిచేస్తూ పుతిన్ లెఫ్టనెంట్ కల్నల్ హోదాకి ఎదిగాడు

రష్యాలోనే లిడ్మియా అనే యువతిని పెళ్ళిచేసుకుని జర్మనీలో కాపురం పెట్టిన ఈ దంపతులకు కొడుకు , కూతురు పుట్టారు ( తర్వాత ఆయన భార్యతో విడిపోయాడు )

అప్పటిదాకా జర్మన్లకు కూడా ఈయన సోవియట్ ఏజెంట్ అన్న విషయం తెలియదు

బెర్లిన్ గోడ కూలగొట్టబడిన సమయంలో జర్మన్లు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్న సమయంలో పుతిన్ కార్యాలయం మీద కూడా దాడి చేసారు

కేజీబీ ఏజెంట్ గా తాను చేస్తున్న స్ట్రింగ్ ఆపరేషన్లు బయటపడిపోతాయేమో అనే అనుమానంతో పుతిన్ కార్యాలయం టెర్రస్ పైకి ఎక్కి తన దగ్గరున్న రివాల్వర్ చూపిస్తూ బెదిరించడంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు

ఆ తర్వాత పుతిన్ తిరిగి సోవియట్ వచ్చేయడం రాజకీయాల్లో ప్రవేశించి ప్రధాని పదవి , అధ్యక్ష పదవులు చేపట్టాడు

అప్పటినుంచి రెండు దశాబ్దాలకు పైగా పుతిన్ రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు

ఆయన ఇంకా తాను కేజీబీ ఏజెంట్ ని అనే అనుకుంటున్నాడా ?

ఎందుకంటే రష్యా అధ్యక్షుడు అయిన తర్వాత కూడా పుతిన్ లో కేజీబీ ఏజెంట్ లక్షణాలు పోలేదు

ఎప్పుడేం చేస్తుంటాడో ఎవరికీ తెలీదు

ఆ మధ్య ఒక దేశాధ్యక్షుడితో తన బదులు తన డూపును పంపించి చర్చలు జరిపించాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

రాజకోట రహస్యం

రష్యా లో తానుండే రాజ భవనంలో తరచూ మార్పులు చేస్తూ ఉంటాడు
ఆ భవనంలో మొత్తం ఆరు వందలకు పైగా గదులు ఉన్నాయట
ఏ గది ఎటుపోతుందో తెలీదు
అందులో ఈయన ఎక్కడుంటాడో చివరి నిమిషం దాకా ఎవరికీ తెలీదు
అసలు ఆ బిల్డింగ్ ప్లాన్ ఏంటో ఎవరికీ తెలీదు
లోపలికి వెళ్లినవాడు బయటికి రావాలంటే గైడ్ సాయం ఉండాల్సిందే

ఆయన వాడే ఆరస్ కారు ప్రత్యేకతలు ఏంటి ?

అగ్ర దేశాల అధ్యక్షులు తాము ప్రయాణించేటప్పుడు ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడతారనే విషయం అందరికీ తెలిసిందే

అమెరికా అధ్యక్షుడికి కూడా ప్రత్యేకమైన భద్రతా ప్రామాణికాలు కలిగిన బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంది

పుతిన్ కూడా గతంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడేవారు

అయితే ఈ వాహనాలకు స్పేర్ పార్ట్ ల కోసం విదేశాల మీద ఆధారపడాల్సి రావడంతో రష్యా అధ్యక్షుడు ప్రత్యేకంగా నేషనల్ డిఫెన్స్ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించి తన కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేయబడిన కారును తయారుచేయిపించుకున్నాడు

దీనితో ఈ కారును ట్రాక్ చేసే టెక్నాలజీ ప్రపంచంలో ఏ దేశానికి లేకుండా చేసుకున్నాడు

అరస్ ను కారు అనేకన్నా కదిలే ప్యాలస్ అనటం కరెక్ట్ ఏమో

7 టన్నుల బరువుండే ఈ కారులో శత్రు దుర్హ్భేద్యమైన బాంబ్ దాడులను , డ్రోన్ అటాక్ లను , తట్టుకునే సామర్ధ్యానికి తోడు విలాసవంతమైన ఫీచర్స్ అదనం

అందుకే ఈ మధ్య చైనా వెళ్ళినప్పుడు పుతిన్ ప్రత్యేక సైనిక విమానం ద్వారా ఈ కారును కూడా పట్టుకుపోయాడు

ఇప్పుడు ఇండియా పర్యటనలో కూడా పుతిన్ ఇదే కారును తెచ్చుకుని వాడుతున్నాడు

నడిచేటప్పుడు పుతిన్ కుడిచేతిని కదిలించడం లేదు గమనించారా ?

బాగా నిశితంగా గమనిస్తే పుతిన్ బాడీ లాంగ్వేజ్లో కానీ , నడక లో కానీ కొన్ని మార్పులు కనిపిస్తాయి

ఆయన నడిచేటప్పుడు ఎడమచేతిని కదిలిస్తూ కుడి చేతిని స్థిరంగా ఉంచడం కనిపిస్తుంది

ఎందుకు ఆయన రెండో చేతిని కదిలించకుండా ఒక్క చేతినే కదిలిస్తూ నడుస్తారు ?
చాలామందికి ఈ సందేహం వచ్చింది

కొంతమంది ఆయనకు పార్కిన్సన్ వ్యాధి ఉంది . అందుకనే కుడి వైపు చేతిని కదపలేరు అన్నారు

అలా అనుకుంటే ఆయన కుడి చేత్తో మోడీకి బ్రహ్మాండంగా షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు
కుడిచేతికి పక్షవాతం ఉంటే అసలు చేతిని కదపలేరు కదా ?

మరి షేక్ హ్యాండ్స్ ఇచ్చేటప్పుడు కుడి చేతిని చక్కగా వాడుతున్న పుతిన్ నడిచేటప్పుడో , ఇతర సందర్భాల్లోనో స్థిరంగా ఎందుకుంచుతున్నారు ?

దీనికి సంబంధించి ఓ రష్యన్ మ్యాగజైన్ ఆసక్తికరమైన కధనాన్ని ప్రచురించింది

పుతిన్ గతంలో కేజీబీ ఏజెంట్ గా పనిచేసినప్పుడు శిక్షణలో భాగంగా కుడి చేతి ఛాతి వైపు రివాల్వర్ అందుబాటులో ఉంచుకోవాలని నేర్పారు

ఒకవేళ ఆపద వచ్చినప్పుడు తక్షణం కుడి చేత్తో ఆ రివాల్వర్ బయటికి తీసి ప్రాణాలను కాపాడుకోవాలని ట్రయినింగ్ లో ఆయనకు నేర్పిన పాఠం

అందుకే ఆయన ఎవరిపక్కనైనా దగ్గరగా నడిచేటప్పుడు కుడిచేతిని రెడీగా ఉంచుకుంటారని రాసారు

ఇందులో ఎంతవరకు నిజముందో కానీ ఇండియా పర్యటనలో ఉన్నఆయన్నిగమనిస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది !


Spread the love

One thought on “ఒక జేమ్స్ బాండ్ , ఒక ఏజెంట్ 116 , ఒక కేజీబీ సీక్రెట్ ఏజెంట్ పుతిన్ .. అన్నట్టు ఈయన నడిచేటప్పుడు కుడిచేతిని కదపడు.. ఎందుకో తెలుసా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!