ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ కు న్యూ యార్క్ సిటీలో వింత అనుభవం ఎదురైంది
ఈయన కాన్వాయ్ న్యూ యార్క్ వీధుల్లో వెళుతుండగా సరిగ్గా అదే సమయంలో అదే దారిలో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వస్తుండటంతో పోలీసులు ట్రాఫిక్ బ్లాక్ చేసారు
అప్పుడేం జరిగిందో సరదాగా ..
విషయమేంటో అర్ధం కాక మెక్రాన్ అక్కడున్న పోలీసుని ” ఏంటయ్యా బాబూ ! సడెన్గా ట్రాఫిక్ బ్లాక్ చేసారు .. నేను ఫ్రాన్స్ ప్రెసిడెంటుని.. మా ఎంబసీకి వెళ్ళాలి .. నన్ను పోనియ్యి ” అనడిగాడు
దానికా పోలీస్ ” సారీ మిస్టర్ ప్రెసిడెంట్ .. మరికొద్దిసేపట్లో మా ప్రెసిడెంట్ ఇక్కడికొస్తున్నాడు .. సార్ వచ్చేటప్పుడు ఆల్ రోడ్స్ బ్లాక్ చెయ్యాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి .. సారీ ప్రెసిడెంట్ .. రియల్లీ ఐ యామ్ వెరీ సారీ.. ఇప్పుడు మీ కాన్వాయ్ ని మేము అలో చేయలేము ” అని వినయంగా చెప్పాడు
మెక్రాన్ కి పరిస్థితి అర్థమైంది
ట్రంప్ వెళ్లి ఈ ట్రాఫిక్ క్లియర్ అయ్యేసరికి పుణ్యకాలం కాస్తా ముగిసిపోతుందని గ్రహించాడు
వెంటనే కారులోనుంచి దిగి నేరుగా ట్రంప్ కే ఫోన్ చేసాడు
అప్పుడు జరిగిన సంభాషణ ఇంచుమించుగా ఇదే ..
” హలొ మిస్టర్ ప్రెసిడెంట్ ! హౌ అర్ యు ? బావున్నావా ?” అని పలకరింపు మొదలెట్టాడు మెక్రాన్
” హాయ్ మెక్రాన్ .. ఐ యామ్ ఫైన్ .. నువ్వెలా ఉన్నావ్ ? ” ట్రంప్ కూడా హుషారుగా మాట కలిపాడు
” ఏం బావుండటం బ్రో .. నువ్వొస్తున్నావని ఇక్కడ ట్రాఫిక్లో మీ వాళ్ళు నన్ను ఆపేసారు .. ప్రస్తుతం న్యూ యార్క్ రోడ్డు మీద ఉన్నాను .. వీళ్ళకి చెప్పి నన్ను వదలమని చెప్పు బ్రో ” దీనంగా అడిగాడు మెక్రాన్
” హలొ .. హలో .. నీ వాయిస్ వినిపించటం లేదు మెక్రాన్ .. ఏమంటున్నావ్ ? “
“అదేంటి బ్రో ? ఇప్పటిదాకా బానే వినబడిందిగా ?” నేనేమంటున్నానంటే .. నన్ను వదలమనీ .. “
“హలొ .. హలో .. నీ వాయిస్ బ్రేక్ అవుతుంది మెక్రాన్ .. ఏమంటున్నావ్ ? “
” అదే బ్రో .. మొన్నేదో సుంకాల గురించి మాట్లాడదాం అన్నావుగా .. ఆ విషయం మాట్లాడదామనీ .. “
” మెక్రాన్ .. ఫోను మా వాళ్ళకియ్యి .. నీకు లైన్ క్లియర్ చేయమని చెప్తా .. హలొ మెక్రాన్ .. వింటున్నావా ? హలో “
మెక్రాన్ ఫోన్ కట్ చేసి ఫుట్ పాత్ మీద నడుచుకుంటూ రోడ్ క్రాస్ చేసి ఫ్రాన్స్ ఎంబసీ బిల్డింగ్ లోకి వెళ్ళాడు
సరదాగా రాసినా ఇది నిజంగా జరిగిన సంఘటనే
ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ న్యూ యార్క్ సిటీకి వచ్చాడు
సరిగ్గా అదే సమయంలో ఫ్రాన్స్ ఎంబసీ బిల్డింగ్లోకి వెళ్ళడానికి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ ఆ రూట్లోకి వచ్చాడు
దాంతో పోలీసులు మెక్రాన్ కాన్వాయిని ఆపేసారు
ట్రంప్ మాదిరే అమెరికా ఫస్ట్ అనే నినాదం తూచా తప్పకుండా పాటించేవాడు కాబట్టి ఆ కానిస్టేబుల్ దయలేకుండా మెక్రాన్ కారును కూడా ఆపాడు
ఇక చేసేదేమీ లేక మెక్రాన్ అక్కడనుంచే నేరుగా ట్రంప్ కే ఫోన్ చేసాడు
అదీ జరిగిన అసలు సంగతి
ఈ మొత్తం ఎపిసోడ్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసాడు మెక్రాన్
అది కాస్తా ఇప్పుడు వైరల్ అయ్యింది
