సరదా కబుర్లు !

Spread the love

“తలమీద ఆ దెబ్బలేంటి మాస్టారూ ? అటెంప్ట్ టు మర్దరా?”

“లాంటిదే సార్”

“లాంటిదే అంటే ఏంటి మాస్టారూ?”

“ఈ రోజు మా పెళ్లిరోజు సార్”

“హ్యాపీ మ్యారేజ్ డే మాస్టారూ.. అది సరే ఆ దెబ్బలేంటీ?”

“చందన శారీ కట్టుకుని మా ఆవిడ రెడి అయి శారీ ఎలా ఉంది డియర్ అని గోముగా అడిగింది”

” వండర్ ఫుల్ మాస్టారూ..శారీ సూపర్ అని చెప్పుంటారు..అది సరే ఆ దెబ్బలూ..?”

“నిజవే..శారీ సూపరని చెప్పుంటే బాగుండేది సార్”

” అదేంటి మాస్టారూ ? మరేం అన్నారు?”

“ఏజ్ పెరిగినా గ్లామర్ తగ్గనివాళ్ళు నాకు తెలిసి ఇద్దరే ఉన్నారని చెప్పా”

” సూపర్ మాస్టారూ..ఇంతకీ మొదటివారు ఎవరూ ?”

“రేఖ”

“రేఖ అంటే అమితాబ్ లైనేసాడంటారే ఆ అమ్మాయేనా మాస్టారూ?”

” ఆ రేఖే “

“ఎక్సలెంట్…ఇక రెండో పేరు మీరు చెప్పక్కర్లా మాస్టారూ..నాకర్థమైపోయింది…మేడం గారి పేరే చెప్పుంటారు కదూ “

“కాదు..నల్లదీప అత్తమ్మ..అని చెప్పా..అప్పుడూ…”

“మీరింకేం చెప్పొద్దు మాస్టారూ..నాకంతా అర్థమైంది..అయినా శారీ గురించి అడిగితే ఎఫ్బిలో లేడీస్ పోస్టుకి కామెంట్ పెట్టే మేల్ పురుషుల్లా సూపరనో.. ఎక్సలెంట్ అనో..వావ్ అనో ఓ మాట అనుంటే సరిపోయేది కదా..రేఖ గురించి..నల్ల దీప అత్త గురించి ఎందుకు మాస్టారూ నోటి దురద కాకపోతే.. రెండుపూటలా అంత టించర్ అద్దండి..గాయాలు తొరగా మానుతాయి..వస్తా మాస్టారూ..!”

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!