గోవా గవర్నర్ గా నియమితులైన ఈ రాజు గారు చాలా నిరాడంబరుడు !
పేరుకే ఆయన విజయనగర సంస్థానాధీశుల వారసుడు .. కానీ ఆయనలో రాచరికపు ఛాయలు అస్సలు కనపడవు
చాలా సింపుల్ గా ఉంటారు
సాధారణ ప్రజలతో కలివిడిగా ఉంటారు
ఆ లక్షణాలే ఆయన్ను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దింది
ఏడుసార్లు శాసన సభ్యుడిగా ఒకసారి ఎంపీగా గెలిచి ప్రజలకు సేవ చేసారు
విజయనగరం మహారాజు డాక్టర్ పివిజి రాజు కుమారుడే ఈ అశోక గజపతి రాజు
జిల్లా ప్రజలు మాత్రం ఆయన్ను అభిమానంతో రాజుగారనే పిలుస్తారు
1978 లో జనతా పార్టీ తరపున అసెంబ్లీ కి వెళ్లిన పూసపాటి అశోక గజపతిరాజు 1982 లో ఎన్టీఆర్ స్థాపించిన టిడిపిలో చేరి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు
2014 లో టిడిపి పార్టీ తరపున లోక్ సభకు వెళ్లి కేంద్ర పౌర విమానయాన మంత్రి అయ్యారు
ఆ సమయంలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం కృషి చేసారు
ఆయన కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గమ్మత్తైన అనుభవాలు జరిగాయి
సాధారణంగా కేంద్ర పౌర విమానయాన మంత్రికి ప్రోటోకాల్ ప్రకారం విమానాశ్రయం ఎంట్రీనుంచి విమానం వరకు నేరుగా కారులో వెళ్లేందుకు అనుమతి ఉంది
కానీ రాజు గారు ఆ ప్రోటోకాల్ పక్కనబెట్టి సాధారణ ప్రయాణీకులతో పాటు విమానం వరకు ఎయిర్ పోర్ట్ బస్సు లో వెళ్లేవారు
రాజు గారి తీరు చూసి అప్పట్లో అధికారులే ఆశర్యపోయేవారట
విజయనగర సంస్థానాధీశుల వారసుడు అంటే పూర్తి రాచరికపు అలవాట్లు ఉంటాయేమో అనుకుని అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తే రాజు గారు తనకు అటువంటి ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ వద్దని అధికారులకు సున్నితంగా చెప్పేవారట
అప్పటినుంచి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులకు రాజు గారంటే మరింత గౌరవం పెరిగిందట
ఇంతేకాదు పౌర విమానయాన మంత్రికి సెక్యూరిటీ చెక్ లో కూడా ప్రోటోకాల్ ప్రకారం కొన్ని మినహాయింపులు ఉంటాయి
కానీ రాజు గారు కేంద్రమంత్రి హోదాలో విమానాశ్రయానికి వచ్చినా సాధారణ ప్రయాణీకులతో పాటు క్యూ లో నిలబడి సెక్యూరిటీకి సహకరించేవారు
విమానం చెక్ ఇన్ టైం కి గంట ముందే ఎయిర్ పోర్ట్ కు చేరుకొని తనవల్ల విమాన ప్రయాణం ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు
ఈరోజు గోవా గవర్నర్ గా పూసపాటి అశోక గజపతిరాజును నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసారు !
పరేష్ తుర్లపాటి